ETV Bharat / entertainment

NBK 108 టైటిల్ వచ్చేసిందోచ్​.. గిప్పడి సంది ఖేల్ అలగ్! - Bhagavant kesari title poster released

NBK 108 Title : నందమూరి నటసింహం లేటెస్ట్ మూవీ ఎన్​బీకే 108 టైటిల్​ పోస్టర్​ను రిలీజ్ చేసింది మూవీ టీమ్. ఆ వివరాలు..

NBK 108 Title
NBK 108 టైటిల్ వచ్చేసిందోచ్​.. 'భగవంత్ కేసరి'గా బాలయ్య
author img

By

Published : Jun 8, 2023, 9:27 AM IST

Updated : Jun 8, 2023, 11:40 AM IST

NBK 108 Title : 'భగవంత్ కేసరి'గా.. గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ.. విజయ దశమికి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ప్రస్తుతం ఆయన 'NBK 108' సినిమా షూటింగ్​తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రమే విజయదశమి కానుకగా థియేటర్లలో రిలీజయ్యేందుకు సిద్ధమవుతోంది. శరవేగంగా షూటింగ్​ జరుపుకుంటోంది. అయితే ఇప్పటికే విడుదలైన రెండు పోస్టర్లతో అభిమానులకు గూస్​బంప్స్​ తెప్పించిన మూవీ టీమ్.. ​ తాజాగా మరో అదిరిపోయే అప్డేట్ ఇచ్చి అభిమానుల్లో జోష్​ను నింపింది. ఈ సినిమా టైటిల్​ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు.. జూన్‌ 10న బాలకృష్ణ పుట్టినరోజును పురస్కరించుకుని.. రెండు రోజుల ముందే సర్​ప్రైజ్ ఇచ్చింది. 'అన్న దిగిండు.. ఇగ మాస్ ఊచకోత షురూ' అంటూ టైటిల్​ పోస్టర్​ను రిలీజ్ చేసింది. ఈ సినిమాకు 'భగవంత్ కేసరి' అనే టైటిల్​ ఖరారు చేసినట్లు తెలిపింది. 'ఐ డోంట్ కేర్​' ఉపశీర్షిక. టాలీవుడ్ సినిమా హిస్టరీలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో 108 లొకేషన్లలో టైటిల్​ను రిలీజ్ చేశారు మేకర్స్​ . 108 హోర్డింగ్స్​పై టైటిల్ పోస్టర్లను విడుదల వేశారు. ఇంతకుముందెప్పుడూ చూడని సరికొత్త పాత్రలో బాలకృష్ణను చూపించనున్నట్లు పేర్కొన్నారు. పోస్టర్​లో బాలయ్య పవర్​ఫుల్​ లుక్​లో కనిపిస్తున్నారు.

NBK 108 Teaser : ఇకపోతే బాలకృష్ణ అభిమానులకు.. డైరెక్టర్​ అనిల్ రావిపూడి మరో సర్​ప్రైజ్​ కూడా సిద్ధం చేసినట్లు తెలిసింది. బాలయ్య పుట్టిన రోజున 'భగవంత్ కేసరి' టీజర్​ను రిలీజ్​ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్​పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు.

NBK 108 Cast : ఇక సినిమా విషయానికి వస్తే.. అనిల్​ రావిపూడి డైరెక్షన్​లో వస్తున్న ఈ భారీ యాక్షన్​ మూవీలో బాలకృష్ణ డిఫరెంట్​ షేడ్స్​ ఉన్న రోల్​లో నటిస్తున్నారు. అనిల్‌ తన మార్క్​ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఏమాత్రం మిస్‌ కాకుండా సినిమాను తీర్చిదిద్దినట్లు సమాచారం. బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. వీరిద్దరి కలయికలో తొలి సినిమా ఇది. యంగ్​ అండ్​ బ్యూటీ హీరోయిన్​ శ్రీలీలతో పాటు, తమిళ స్టార్​ నటుడు శరత్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. తండ్రీ కూతుర్లుగా కనిపిస్తారని సమాచారం. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ రోల్ చేస్తున్నారు. ''విజయ దశమికి ఆయుధ పూజ'' అంటూ దసరా కానుకగా ఈ సినిమా రిలీజ్​ కానుంది.

బాబీ దర్శకత్వంలో కొత్త సినిమా అనౌన్స్​మెంట్​... బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమా ప్రకటన కూడా రానుందని తెలిసింది. 'వాల్తేరు వీరయ్య'తో సంక్రాంతికి హిట్ అందుకున్న దర్శకుడు బాబీ.. బాలయ్యతో ఓ సినిమా అనౌన్స్​ చేయనున్నారట. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్​పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తారట. అనిల్ రావిపూడి సినిమా పూర్తయ్యాక ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్తుందట.

Last Updated : Jun 8, 2023, 11:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.