ETV Bharat / entertainment

భవిష్యత్తులో నేను చేయాల్సిన పరిస్థితి వస్తే కచ్చితంగా దర్శకత్వం చేస్తా: చిరు - మెగస్టార్​ చిరంజీవి సినిమాలు

నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానంలో ఎన్నో బ్లాకబస్టర్లలో నటించిన మెగాస్టార్​ చిరు.. ఎన్నో వైవిధ్యమైన పాత్రలకు ప్రాణం పోశారు. సంక్రాంతికి బరిలోకి దిగనున్న తన 'వాల్తేరు వీరయ్య' సినిమా గురించి విలేకరులతో ముచ్చటించారు. ఆ విషయాలు ఆయన మాటల్లోనే.

chiranjeevi waltair veerayya interview
chiranjeevi
author img

By

Published : Jan 12, 2023, 7:30 AM IST

నటుడిగా చిరంజీవి సినీ ప్రయాణం మొదలై నాలుగు దశాబ్దాలు దాటింది. కానీ, ఇప్పటికీ నటన పట్ల అదే నిబద్ధత.. అదే ఉత్సాహం. హుషారుగా వరుస సినిమాలు చేస్తూ యువ హీరోలకు దీటుగా జోరు చూపిస్తున్నారు. మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లుగా వైవిధ్యభరితమైన కథలు ఎంచుకుంటూ వినోదాలు పంచిస్తున్నారు. ఇప్పుడాయన 'వాల్తేరు వీరయ్య'గా సంక్రాంతి బరిలో సందడి చేసేందుకు సిద్ధమయ్యారు. బాబీ (కె.ఎస్‌.రవీంద్ర) తెరకెక్కించిన చిత్రమిది. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించింది. రవితేజ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు చిరు. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న విశేషాలివి..

మీరు సీనియర్‌ హీరో. ఈతరం దర్శకులతో పని చేస్తున్నప్పుడు ఏదైనా సీన్‌ బాగా రాకుంటే వాళ్లు ధైర్యంగా మీతో చెప్పగలుగుతున్నారా?
"నేను చేసింది నాకెప్పుడూ తెలిసిపోతుంటుంది. మానిటర్‌ కూడా చూడను. కాకపోతే నేను నా ఓకే కోసం ఎదురు చూడను. దర్శకులు సీన్‌ ఓకే అనే వరకు ఎదురు చూస్తా. వాళ్ల నోటి నుంచి ఆ మాట వచ్చే వరకు స్పాట్‌ నుంచి కదలను. దర్శకుడికనే కాదు.. నృత్య దర్శకుడికి.. ఫైట్‌ మాస్టర్‌కు.. ప్రతి ఒక్కరికీ పూర్తి స్వేచ్ఛనిస్తాను. ఓ కొత్త నటుడితో పని చేసేటప్పుడు వాళ్లెంత సౌకర్యంగా ఫీలవుతారో.. అలాంటి సౌకర్యాన్ని అందిస్తాను. ఎందుకంటే ఒక సినిమా బాగా రావాలంటే ప్రతి ఒక్కరూ కష్టపడాల్సిందే. ఒకవేళ అలా కష్టపడలేకపోతే రిటైర్‌ అయిపోవడం మంచిది".

'ఆర్‌ఆర్‌ఆర్‌'లోని "నాటు నాటు" పాటకు గోల్డెన్‌ గ్లోబ్‌ పురస్కారం రావడం ఎలా అనిపించింది?
"ఇది మనమంతా గర్వించదగ్గ విషయం. ఇదొక అద్భుతమైన.. చారిత్రక విజయం. నాకైతే ఇది మరింత ప్రత్యేకం. ఇంత మంచి పాటను అందించిన కీరవాణికి, సాహిత్యమందించిన చంద్రబోస్‌కు, ఉర్రూతలూగించేలా ఆలపించిన రాహుల్‌ - కాలభైరవకు, నృత్యదర్శకుడు ప్రేమ్‌ రక్షిత్‌కు, ఇందులో నటించి, మెప్పించి మనందరితో వావ్‌ అనిపించిన ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లకు నా శుభాభినందనలు".

తెలుగు సినిమాకి ఇది స్వర్ణయుగం అనుకోవచ్చా?
"అసలు మన తెలుగు సినిమా ఆరంభం నుంచే స్వర్ణయుగంలో ఉంది. హెచ్‌.ఎమ్‌.రెడ్డి, కేవీ రెడ్డి.. ఇలాంటి గొప్ప దర్శకులతో ఆరోజుల్లోనే ఆ యుగం మొదలైపోయింది. అదిప్పుడు కొత్తగా వచ్చింది కాదు. కాకపోతే ఇప్పుడా స్వర్ణయుగంలో ఉచ్ఛస్థితిని చూస్తున్నాం".

సాధారణంగా సంక్రాంతికి ఎప్పుడూ మీరే ముందొస్తుంటారు. కానీ, ఈసారి చివరగా వస్తున్నారు ఎందుకు?
"ఈ సంక్రాంతికి మా మైత్రీ సంస్థ నుంచే రెండు సినిమాలు రావడం చాలా ఆనందంగా ఉంది. మంచి చిత్రం ఎప్పుడొచ్చినా విజయం సాధిస్తుంది. బయ్యర్లు, ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయం తీసుకున్నాం".

'వాల్తేరు వీరయ్య'తో ప్రేక్షకులకు మళ్లీ ఆ వింటేజ్‌ చిరంజీవిని పరిచయం చేస్తున్నట్లున్నారు కదా?
"హుషారుగా చేయాలన్నా.. నాకిష్టమైన టాలెంట్స్‌ అన్నీ బయట పెట్టుకోవాలన్నా కమర్షియల్‌ కథల్లోనే బాగా కుదురుతుంది. కానీ, వ్యక్తిగతంగా నేనెప్పుడూ వైవిధ్యభరితమైన పాత్రలు చేయాలని తపన పడుతుంటాను. అందులో భాగంగానే 'శుభలేఖ', 'స్వయంకృషి', 'ఆపద్బాంధవుడు', 'మంత్రిగారి వియ్యంకుడు' లాంటి చిత్రాలు చేశాను. కానీ, ఆ తర్వాత కాలంలో నాకేం కావాలి అని ఆలోచించడం కంటే ప్రేక్షకులు నా నుంచి ఏం కోరుకుంటున్నారో అది అందివ్వడం నా కర్తవ్యంగా భావించాను. ఇప్పుడొస్తున్న ఈ 'వాల్తేరు వీరయ్య' కూడా అలాంటి ప్రయత్నమే. ప్రేక్షకులు నా నుంచి ఎలాంటి అంశాలు కోరుకుంటారో.. అవన్నీ పుష్కలంగా ఉన్న చిత్రమిది. ఈ సినిమాతో పాత చిరంజీవిని మళ్లీ చూస్తారు. ‘రౌడీ అల్లుడు’, 'ఘరానా మొగుడు', 'ముఠామేస్త్రి'ల్లో నేనెలా కనిపించానో.. ఈ 'వాల్తేరు వీరయ్య'లోనూ అలా కనిపిస్తాను. ఇప్పటి వరకు నేనింత మాస్‌గా ఎప్పుడూ కనిపించలేదు. చిత్రీకరణను ఆద్యంతం చాలా ఎంజాయ్‌ చేశా. సినిమా కచ్చితంగా ప్రేక్షకుల్ని అలరిస్తుంది"

మీరు.. రవితేజ 'అన్నయ్య'లో కలిసి నటించారు. మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ఈ చిత్రంలో కలిసి చేశారు. ఎలా అనిపించింది?
"రవితేజ ఆరోజుల్లో ఎంత సరదాగా ఉన్నాడో.. ఈరోజుకీ అలాగే ఉన్నాడు. నటన పట్ల తనకున్న ప్రేమ, వాత్సల్యం అలాగే ఉన్నాయి. రవి తన ఎనర్జీతో ఈ చిత్రానికి మరింత ప్లస్‌ అయ్యాడు. కథకు బలాన్ని చేకూర్చాడు. బాబీ కథ చెప్పినప్పుడే ఈ పాత్రకు రవితేజ బాగుంటాడని అందరం అనుకున్నాం. ఈ సినిమాలో మేమిద్దరం డైలాగులు మార్చుకున్నాం. తన ‘ఇడియట్‌’లోని డైలాగ్‌ నేను.. నా చిత్రంలోని డైలాగ్‌ తను చెప్పాడు. ఫ్యాన్స్‌కు కిక్‌ ఇవ్వడం కోసమే అలా డైలాగ్స్‌ మార్చుకున్నాం. ఈ ఆలోచన పూర్తిగా దర్శకుడు బాబీదే".

ఈ మధ్య 'మీకింత అతి మంచితనం అవసరమా’ అని మీ ఫ్యాన్స్‌' అనుకుంటున్నారు. దానిపై మీ అభిప్రాయమేంటి?
"కచ్చితంగా అవసరమే. ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఎదురుతిరిగితే ఆ క్షణానికి నా అహం చల్లారుతుందేమో కానీ, సినిమాకి భారీగా నష్టం వస్తుంది. అభిమానులు నిరాశ చెందుతారు. నా సంయమనం ఇంత మందికి మంచి చేస్తుందంటే నేను వెనక్కు తగ్గుతాను. నేనెప్పుడూ అంతిమ ఫలితం చూస్తాను. అలా చూడాలంటే మనలో పరిణతి, విజ్ఞత ఉండాలి. కొంతమంది పోరాట యోధులు ఉంటారు. వాళ్లు మాట అంటారు.. అనిపించుకుంటారు".

ఒకప్పటికీ.. ఇప్పటికీ కథల ఎంపికలో మీ ఆలోచనా విధానం ఏమైనా మారిందా?
"కథను బలంగా విశ్వసించే వ్యక్తిని నేను. సాధారణంగా అందరూ కథలు వింటారు. కానీ, నేను చూస్తాను. కథ వింటున్నప్పుడే దాన్ని విజువలైజ్‌ చేసేసుకుంటా. కథలో ఎన్ని పాటలున్నాయి. ఎన్ని ఫైట్స్‌ ఉన్నాయని చూడను. అవన్నీ అలంకారాలుగానే భావిస్తా. కథకు సహజ సౌందర్యాన్నిచ్చేది అందులోని భావోద్వేగాలే. అందుకే కథలో ఎంత ఎమోషన్‌ ఉందో చూస్తా. ప్రేక్షకులు ఓ వంద రూపాయలిచ్చి సినిమాకు వస్తే నా వంతుగా వాళ్లకు నేనేం అందిస్తున్నా అనేది చూస్తా".

మీరు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎలా ఉన్నారో.. ఇప్పటికీ అలాగే అణకువతో ఉన్నారు. ఈ విషయంలో కొత్తతరానికి మీరిచ్చే సలహాలేంటి?
"కొందరికి ఇలా ఉండటం సహజంగానే వస్తుంది. మన కోసం కాకుండా ఇతరుల కోసం ఆలోచించాలి. ఆ ఇతరులలో దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు అంతా ఉంటారు. మన ప్రవర్తన అన్నింటి కంటే ముఖ్యం. అది బాగుంది కాబట్టే నాకు వరుసగా సినిమాలొచ్చాయి. మన ప్రవర్తన సరిగా లేనప్పుడు వరుస పరాజయాలు తారసపడినా.. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా 'వాడికి బాగా అయ్యింది రా' అనుకొని చుట్టూ ఉన్న వాళ్లు భుజం దించేస్తారు తప్పితే ఎవరూ జాలి కూడా చూపరు. అందుకే మన ప్రవర్తన ఎప్పుడూ సరిగా ఉండాలి".

దర్శకత్వం చేయాలన్న దిశగా ఏమైనా ఆలోచన చేస్తున్నారా?
"ఈ మధ్యే ఎవరితోనో అన్నా.. ఎన్నిరోజులని మనం ఇలాగే తెరపై కనిపిస్తూ ఉంటాం. ఏదోక రోజు తెరమరుగు అవ్వాల్సి వస్తుంది. దాన్ని సంతోషంగా స్వీకరించాలి. కాకపోతే పనిలేకుండా ఉండటం కానీ, తక్కువ పని చేయడం గానీ నాకిష్టం లేదు. హాలీవుడ్‌ ప్రముఖుడు క్లింట్‌ ఈస్ట్‌వుడ్‌ 92ఏళ్ల వయసులోనూ ఇప్పటికీ నటిస్తూ.. దర్శకత్వం చేస్తూ ఉత్సాహంగా జీవిస్తున్నారు. ఆయన్ని చూసినప్పుడు నాకెంతో స్ఫూర్తిగా అనిపించింది. ఇలా జీవించినంత కాలం సినిమాకి సేవ చేయగలగడం కంటే కావాల్సింది ఏముంది. భవిష్యత్తులో నేను చేయాల్సిన పరిస్థితి వస్తే కచ్చితంగా దర్శకత్వం చేస్తా".

మిమ్మల్ని ఇండస్ట్రీకి పెద్ద అనొద్దని ఎందుకంటున్నారు?
"ఇండస్ట్రీ పెద్ద అనే అదనపు భుజ కీర్తుల వల్ల నాకు ఒరిగేదేం లేదు. అందుకే ఆ పేరు వద్దనుకున్నా. కాకుంటే ఇండస్ట్రీకి నా రుణం తీర్చుకునే తరుణం ఆసన్నమైతే ఏ స్థాయికైనా సరే నా భుజం కాస్తాను. అండగా ఉంటాను. నాకు భుజం కాయడం ఇష్టం తప్ప.. భుజ కీర్తులు కాదు".

మీరు గొప్ప నటుడిగా ఉండాలనుకుంటున్నారా? మంచి మనిషిగా ఉండాలనుకుంటున్నారా?
"మంచి నటుడు అనేది నాకు దక్కిన గొప్ప వరంగా భావిస్తా. అది నా అదృష్టం. కానీ, అది శాశ్వతం కాదన్నది సత్యం. కానీ, ఒక మంచి మనిషి అనేది శాశ్వతం. అది కాదనలేని సత్యం. మనం చనిపోయినా అది మాత్రం నిలిచిపోతుంది. రియల్‌ హీరోగా ఉంటూ.. రీల్‌ హీరోగా ఎక్కువ కాలం కొనసాగాలని నా కోరిక".

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.