ఈ సంక్రాంతికి విడుదలైన మెగాస్టార్ చిరంజీవి 'వాల్తేరు వీరయ్య', నందమూరి నటసింహం బాలకృష్ణ 'వీర సింహారెడ్డి' సినిమాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. విడుదలై పది రోజులు అవుతున్నా బాక్సాఫీస్ వద్ద ఇంకా జోరు కొనసాగిస్తూ మంచి వసూళ్లను అందుకుంటున్నాయి. ఇప్పటికే వంద కోట్లకుపైగా కలెక్ట్ చేశాయి. అయితే ఈ క్రమంలోనే సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న వీరసింహా డైరెక్టర్ గోపిచంద్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ ఆసక్తికర విషయాలను బయటపెడుతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి తనకు ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారంటూ గుర్తుచేసుకున్నారు.
"నాకు రవి తేజగారికి పోలికలుంటాయి అని అందరూ అంటుంటారు. కొన్ని షాట్స్ చేసేటప్పుడు రవితేజ అయితే నువ్వు నిలుచో నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్లి పోయేవారు. అలానే చిరంజీవిగారు కూడా బక్క రవితేజ అని పిలిచేవారు. ఓసారి షూటింగ్ స్పాట్లో ఉన్నప్పుడు నా పుట్టినరోజు వచ్చింది. అప్పుడు అల్లు అరవింద్ చిరంజీవి వచ్చారు. ఓ వాచ్ తెప్పించి గిఫ్ట్‌గా ఇచ్చారు. అప్పుడు చిరు.. ఇక నీ టైమ్ బాగుంటుందని అన్నారు. ఇక ఇప్పటివరకు ఏ సినిమాకు నాకు ఫుల్ రెమ్యునరేషన్ ఇవ్వలేదు. వీర సింహారెడ్డికే తొలి సారి ఇచ్చారు." అని గోపి చంద్ చెప్పుకొచ్చారు.
కాగా, రవితేజ డాన్ శీను సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు గోపీచంద్ మలినేని. బాడీ గార్డ్, బలుపు, పండగ చేస్కో, విన్నర్, క్రాక్ ఇలా వరుస సినిమాలు చేస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక తాజాగా బాలకృష్ణతో వీర సింహా రెడ్డి సినిమా చేసి కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌ను అందుకున్నారు.
ఇదీ చూడండి: "ఇదే నా చివరి సినిమా..ఇక నా వల్ల కాదు!".. "ఈ పాలిటిక్స్ నా దగ్గర వద్దు!"