ETV Bharat / entertainment

కొత్త రిలీజ్​ డేట్​తో 'మేజర్​'​.. పునీత్​ ఫ్యామిలీ నుంచి మరో హీరో!

New cinema updates: వాయిదా పడుతూ వస్తున్న హీరో అడివి శేష్​ నటించిన 'మేజర్' చిత్రం ఎట్టకేలకు​ కొత్త రిలీజ్​ డేట్​ను ఖరారు చేసుకుంది. దీంతో పాటే 'కేజీఎఫ్'​ ప్రొడక్షన్​ హౌస్​ హోంబలే ఫిల్మ్స్​​ తన కొత్త సినిమాను ప్రకటించింది.

Major movie new release date
మేజర్​ కొత్త రిలీజ్ డేట్
author img

By

Published : Apr 27, 2022, 12:09 PM IST

Updated : Apr 27, 2022, 12:30 PM IST

Major movie new release date: ఇప్పటికే పలు సార్లు వాయిదా పడిన హీరో అడివి శేష్‌ చిత్రం 'మేజర్‌' రాకకు కొత్త ముహూర్తం కుదిరింది. ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో జూన్3న తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. 26/11 ముంబయి ఉగ్ర దాడుల్లో వీరమరణం పొందిన మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవితాధారంగా తెరకెక్కించిన పాన్‌ ఇండియా చిత్రమిది. టైటిల్‌ పాత్రను అడివి శేష్‌ పోషించారు. శశికిరణ్‌ తిక్క తెరకెక్కించారు. మహేష్‌బాబు జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఏ ప్లస్‌ ఎస్‌ మూవీస్‌, సోనీ పిక్చర్స్‌ ఫిల్మ్స్‌ ఇండియా సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఈ సినిమాలో సందీప్‌ బాల్యాన్ని, యవ్వనాన్ని.. ఉగ్రదాడుల్లో ఆయన ముష్కరులతో పోరాడిన తీరును ఆసక్తికరంగా చూపించనున్నారు. ఇందులో అడివి శేష్‌కు జోడీగా సయీ మంజ్రేకర్‌ కనిపించనుంది. శోభితా ధూళిపాళ్ల, ప్రకాష్‌ రాజ్‌, రేవతి, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శ్రీచరణ్‌ పాకాల సంగీతం అందించగా.. వంశీ పచ్చిపులుసు ఛాయాగ్రహణం అందించారు.

KGF production house new film: 'కేజీయఫ్‌' సిరీస్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్లోనూ గుర్తింపు తెచ్చుకున్న కన్నడ సినీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌. ఈ పతాకంపై యశ్‌ హీరోగా దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన 'కేజీయఫ్‌ 1', 'కేజీయఫ్‌ 2' చిత్రాలు భారతీయ అభిమానులందరినీ కన్నడ చిత్ర పరిశ్రమ వైపు దృష్టి పెట్టేలా చేశాయి. దాంతో అక్కడ రూపొందుతున్న కొత్త చిత్రాలపై అంతటా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో హోంబలే ఫిల్మ్స్​ జోరు పెంచింది. కొత్త సినిమాలను వరుసగా ప్రకటిస్తోంది. ఈ క్రమంలోనే మరో కొత్త చిత్రాన్ని ప్రకటించింది. కన్నడ లెజెండరీ యాక్టర్​ రాజ్​కుమార్​ మనవడు, పునీత్​రాజ్​కుమార్​ అన్న కొడుకు యువ రాజ్​కుమార్​ను హీరోగా లాంఛ్​ చేయబోతున్నట్లు తెలిపింది. దీనికి సంతోష్​ అనన్​ద్రమ్​ దర్శకత్వం వహించనున్నట్లు పేర్కొంది. బ్లాక్​ అండ్​ వైట్​లో ఉన్న ఓ హీరో పోస్టర్​ను కూడా విడుదల చేసింది.

ఇదీ చూడండి: Acharya First review: మెగాఫ్యాన్స్​కు పూనకాలే.. ఫుల్​ మాస్​ మసాలా!

Last Updated : Apr 27, 2022, 12:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.