ETV Bharat / entertainment

ప్రతినాయకుడిగా కథానాయకుడు.. 2022లో విలన్లుగా మెరిసిన హీరోలు

సినీప్రియుల అభిరుచుల్లో వస్తున్న మార్పులు.. పాన్‌ ఇండియా సంస్కృతి ప్రభావం.. కథానాయకుల ఆలోచనా ధోరణిని పూర్తిగా మార్చేశాయి. 'హీరోలంటే ఫలానా పాత్రలే చేయాలి.. ఇలాంటి కథల్లోనే నటించాలి' అనే మూస ధోరణి క్రమంగా కనుమరుగవుతోంది. కథ బాగుండి.. అందులో పాత్ర బలంగా కనిపించిందటే చాలు.. ప్రతినాయక పాత్రల్లోనూ మెరిసేందుకు వెనకాడటం లేదు ఈతరం హీరోలు. ఈ మార్పును ప్రేక్షకులూ ఆదరిస్తుండటంతో ఈతరహా ప్రయోగాలు చేసే కథానాయకుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఈ ఏడాది పలువురు హీరోలు ప్రతినాయకులుగా సినీప్రియుల్ని పలకరించారు. విలనిజంలో కొత్త కోణం చూపించి.. మెప్పించారు. మరి ఈ 2022లో విలన్లుగా మెరిసిన ఆ కథానాయకులెవరు? వారి చిత్ర విశేషాలేంటి? తెలుసుకుందాం పదండి..

ciniema
హీరోయిజం పండించిన విలనిజం
author img

By

Published : Dec 21, 2022, 7:03 AM IST

కథానాయకులే ప్రతినాయకులుగా మురిపించడమన్నది వెండితెరకు కొత్తేమీ కాదు. గతంలోనూ పలువరు స్టార్‌ హీరోలు ఈతరహా ప్రయోగాలు చేసిన వారే. కానీ, స్టార్‌గా ఓ స్థాయికి చేరుకున్నాక.. వాళ్లు మళ్లీ అలాంటి పాత్రల్లో కనిపించలేదు. ఇమేజ్‌ లెక్కలు.. ప్రేక్షకులు ఎలా స్వీకరిస్తారో అన్న అనుమానాలతో ఆ తరహా ప్రయోగాలకు దూరంగా ఉన్నారు. అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. హీరోయిజం చూపించాలంటే హీరో పాత్రలే చేయాల్సిన అవసరం లేదని నిరూపిస్తున్నారు ఈతరం కథానాయకులు. ప్రతినాయక పాత్రలతోనూ వెండితెరపై చెరగని ముద్ర వేస్తున్నారు.

ఈ ప్రయత్నాలకు ప్రేక్షకుల నుంచీ మంచి ఆదరణ దక్కుతుండటంతో.. ఇలా విలన్‌ పాత్రలతో మురిపించే హీరోల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 'బాహుబలి'లో భళ్లాలదేవగా శక్తిమంతమైన ప్రతినాయక పాత్రలో కనిపించి.. ప్రేక్షకుల్ని మెప్పించారు హీరో రానా. ఆయన ఈసారి 'భీమ్లానాయక్‌' కోసం విలన్‌గా మారారు. పవన్‌ కల్యాణ్‌ టైటిల్‌ పాత్రలో నటించిన చిత్రమిది. ఇందులో డానీ అలియాస్‌ డేనియల్‌ శేఖర్‌గా ప్రతినాయక ఛాయలున్న పాత్రతో ప్రేక్షకుల్ని అలరించారు రానా. పతాక సన్నివేశాల్లో ఆయన.. పవన్‌ కొదమ సింహాల్లా తలపడిన తీరు ఆద్యంతం ఆకట్టుకుంది.

villains
ప్రతినాయక పాత్ర

'గ్యాంగ్‌లీడర్‌' చిత్రంతో తెరపై తొలిసారి విలన్‌గా మెరిశారు యువ హీరో కార్తికేయ. ఈ ఏడాది విడుదలైన 'వలిమై'లో మరోసారి ప్రతినాయకుడిగా కనిపించి మురిపించారు. అజిత్‌ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. హెచ్‌.వినోద్‌ తెరకెక్కించారు. ఆయన ఇందులో కార్తికేయను నరేన్‌ అనే శక్తిమంతమైన విలన్‌గా ఆకట్టుకునేలా చూపించారు. సినిమాలో అతనికీ అజిత్‌కు మధ్య సాగే మైండ్‌ గేమ్‌ చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది.

villains
ప్రతినాయక పాత్ర

'సరైనోడు'లో వైరం ధనుష్‌గా అల్లు అర్జున్‌తో తలపడ్డారు కథానాయకుడు ఆది పినిశెట్టి. ఈసారి ఆయన 'ది వారియర్‌' కోసం గురు అనే మరో శక్తిమంతమైన విలన్‌గా మారారు. రామ్‌ హీరోగా లింగుస్వామి తెరకెక్కించిన యాక్షన్‌ చిత్రమిది. సినిమాలో రామ్‌ - ఆదిల మధ్య పోరాటం 'నువ్వా - నేనా' అన్నట్లుగానే సాగుతుంది. ఆ వైరాన్ని తెరపై ఎంతో ఆసక్తికరంగా ఆకట్టుకునేలా ఆవిష్కరించారు లింగుస్వామి.

వైవిధ్యభరితమైన కథలతో మెప్పిస్తూ.. సినీప్రియుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు యువ కథానాయకుడు సత్యదేవ్‌. ఆయన 'గాడ్‌ఫాదర్‌'లో జైదేవ్‌ దాస్‌ అనే పవర్‌ఫుల్‌ విలన్‌గా చిరంజీవితో తలపడి మెప్పించారు. మలయాళంలో విజయంతమైన 'లూసీఫర్‌'కు రీమేక్‌గా రూపొందిన చిత్రమిది. మాతృకలో వివేక్‌ ఒబెరాయ్‌ ప్రతినాయకుడిగా కనిపించగా.. ఆ పాత్రను తెలుగులో సత్యదేవ్‌ పోషించారు. నిజానికి చిరు వంటి అనుభవమున్న హీరోకి ఎదురుగా విలన్‌గా నిలబడటం అంత సులభం కాదు. కానీ, సత్యదేవ్‌ తన ప్రతిభతో ఆ పాత్రకు వందశాతం న్యాయం చేశారు. వచ్చే ఏడాది కూడా పలువురు హీరోలు విలన్లుగా సందడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రొటీన్‌ విలన్లను చూసి విసుగెత్తిన ప్రేక్షకులకు 'కేజీఎఫ్‌2', 'విక్రమ్‌' చిత్రాలు సరికొత్త విలనిజాన్ని రుచి చూపించాయి. యష్‌ కథానాయకుడిగా ప్రశాంత్‌ నీల్‌ తెరకెక్కించిన చిత్రమే 'కేజీఎఫ్‌2'. ఈ సినిమాతోనే ప్రతినాయకుడిగా దక్షిణాది ప్రేక్షకుల్ని పలకరించారు బాలీవుడ్‌ కథానాయకుడు సంజయ్‌ దత్‌. ఆయనిందులో అధీరాగా భీకరమైన అవతారంలో.. ఆసక్తికరమైన విలనిజంతో సినీప్రియుల్ని మెప్పించారు. సినిమాలో ఆయన పరిచయ సన్నివేశాలు.. హీరో యష్‌తో తలపడే ఘట్టాలు ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి.

villains
ప్రతినాయక పాత్ర

ఇక 'విక్రమ్‌'లో రోలెక్స్‌ అనే ప్రతినాయకుడిగా కనిపించి.. ప్రేక్షకుల్ని సర్‌ప్రైజ్‌ చేశారు కథానాయకుడు సూర్య. సినిమా ఆఖర్లో వచ్చే ఆ పాత్ర తెరపై కనిపించేది కొద్దిసేపే అయినా.. తనదైన విలనిజంతో ప్రేక్షకుల మదిపై చెరగని ముద్ర వేశారు సూర్య. కమల్‌హాసన్‌ కథానాయకుడిగా లోకేష్‌ కనగరాజ్‌ తెరకెక్కించిన చిత్రమిది. దీనికి సీక్వెల్‌గా త్వరలో 'విక్రమ్‌2' రానుంది. అందులో రోలెక్స్‌ - విక్రమ్‌ల పోరు పూర్తిస్థాయిలో చూసే అవకాశముంది. అంతేకాదు త్వరలో రోలెక్స్‌ పాత్రపైనే ఓ చిత్రం తెరకెక్కించేందుకు లోకేష్‌ సన్నాహాలు చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.