ETV Bharat / entertainment

'ఆచార్య'కు మహేశ్​ గళం.. కలెక్షన్లలో 'కేజీఎఫ్​ -2' సరికొత్త రికార్డు! - ఆచార్య సినిమాకు మహేశ్​బాబు గళం

కొత్త సినిమా అప్డేట్స్​ వచ్చాయి. ఇందులో మెగాస్టార్​ చిరంజీవి, సూపర్​స్టార్​ మహేశ్​బాబు, రాకింగ్ స్టార్​ యశ్​ చిత్రాల సంగతులు ఉన్నాయి.

mahesh acharya kgf 2 collections
ఆచార్య మహేశ్ గళం, కేజీఎఫ్ 2 రికార్డ్స్
author img

By

Published : Apr 21, 2022, 12:39 PM IST

Maheshbabu voice for Acharya movie: మెగాస్టార్​ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఆచార్య'. రామ్‌చరణ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. కాజల్‌, పూజా హెగ్డే కథానాయికలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా గురించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ మూవీలో సూపర్​స్టార్​ మహేశ్​బాబు గళం వినిపించనుందని తెలిసింది. ఈ సినిమా కథ మహేశ్ వాయిస్​ ఓవర్​తోనే మొదలవుతుందట! ప్రస్తుతం సోషల్​మీడియాలో ఇదే హాట్​టాపిక్​.

మరి ఇది ఎంత వరకు నిజమో తెలియదుగానీ.. ఈ వార్త తెలుసుకున్న మెగాఫ్యాన్స్​, మహేశ్​ ఫ్యాన్స్​ తెగ సంబరపడిపోతున్నారు. 'మెగాసూపర్​ ట్రీట్'​ అంటూ సోషల్​మీడియాను హోరెత్తిస్తున్నారు. ఒకవేళ నిజంగానే మహేశ్​ కనుక 'ఆచార్య'కు వాయిస్​ ఓవర్​ ఇస్తున్నట్లు మూవీటీమ్​ అధికారికంగా ప్రకటిస్తే అభిమానుల ఆనందం మరింత రెట్టింపు అవుతుంది. వారి సంతోషానికి అవధులు లేకుండా పోతాయి. కాగా.. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌, పాటలకు మంచి స్పందన వస్తోంది. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కొణిదెల ప్రొడక్షన్‌ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

KGF 2 hindi collections Record: ప్రస్తుతం సినిమా కబుర్లు చెప్పుకొనే ఏ ఇద్దరి నోట విన్నా 'కేజీయఫ్‌2' సంగతులే. రాఖీభాయ్‌గా యశ్ నటన, ప్రశాంత్‌ నీల్‌ టేకింగ్‌ సినిమాను మరో స్థాయిలో నిలబెట్టాయి. పాన్‌ ఇండియా సినిమాగా విడుదలైన ఈ చిత్రం బాలీవుడ్‌లోనూ రికార్డులు తిరగరాస్తోంది. విడుదలైన వారం రోజుల్లో హిందీ వెర్షన్​లో ఏకంగా రూ.250కోట్లను సాధించి రికార్డు సృష్టించింది. బాలీవుడ్​లో అత్యంత వేగంగా రూ.250కోట్లు కొల్లగొట్టిన తొలి సినిమాగా నిలిచింది. రిలీజ్ అయిన మొదటి రోజు(రూ.53.95కోట్లు), రెండో రోజు(రూ.46.79), మూడో రోజు(రూ.42.90), నాలుగో రోజు(50.35), ఐదో రోజు(25.57), ఆరో రోజు(19.14), ఏడో రోజు(రూ.16.35) కోట్లతో వసూళ్ల సునామీని సృష్టించింది. అంతకుముందు విడుదలైన 'ఆర్​ఆర్​ఆర్​'కు హిందీ వెర్షన్​కు రూ.250కోట్లు సాధించడానికి దాదాపు మూడు వారాలు పట్టగా.. 'బాహుబలి 2'కు ఎనిమిది రోజులు, ఆమిర్​ ఖాన్​ 'దంగల్'​కు పది రోజులు పట్టింది.

ఇదీ చూడండి: విజయ్‌ దేవరకొండ-సమంత సినిమా షురూ.. టైటిల్​ ఇదే!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.