ETV Bharat / entertainment

'బాలీవుడ్ పని అయిపోలే.. ముందుంది అసలు పండగ!'.. కరణ్ జోహర్ షాకింగ్​ కామెంట్స్​ - కరణ్​ జోహర్​ కామెంట్లు

బాలీవుడ్ ఇండస్ట్రీ పని అయిపోయిదంటూ నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్న వార్తలపై నిర్మాత కరణ్ జోహర్ స్పందించారు. అవి కేవలం పనికిరాని మాటలు మాత్రమేనని అన్నారు. ప్రస్తుతం థియేటర్లకు ప్రేక్షకులను రప్పించడమనేది పెద్ద సవాలుగా మారిందని.. కానీ మంచి చిత్రాలు మాత్రం ఎప్పటికీ హిట్ అవుతాయని తెలిపారు.

karan-johar-comments-on-bollywood
karan-johar-comments-on-bollywood
author img

By

Published : Jul 31, 2022, 5:25 PM IST

Karan Johar Comments On Bollywood: 'పుష్ప', 'ఆర్‌ఆర్‌ఆర్‌', 'కేజీయఫ్‌-2' సినిమాలు బాలీవుడ్‌పై దండయాత్ర చేశాయి. అక్కడి బాక్సాఫీస్‌ను కొల్లగొట్టి కోట్ల రూపాయలను వసూలు చేశాయి. కానీ హిందీ సినిమాలు మాత్రం ఒకట్రెండు మినహా అన్నీ బోల్తా కొట్టాయి. పెద్ద హీరోల సినిమాలకు కూడా ప్రేక్షకాదరణ పెద్దగా దక్కలేదు. దీంతో ఇక బాలీవుడ్‌ పని అయిపోయిందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ రూమర్స్‌పై ప్రముఖ నిర్మాత కరణ్‌ జోహార్‌ స్పందించారు.

"పనికిరాని చెత్త​ మాటలు మాట్లాడుతున్నారు. మంచి సినిమాలు ఎప్పుడూ విజయం సాధిస్తాయి. 'గంగూబాయ్​ కతియావాడి', 'భూల్‌ భులాయా 2' సినిమాలు భారీ హిట్‌ కొట్టాయి. అలాగే 'జుగ్‌ జుగ్‌ జియో' మూవీ కూడా బాగానే ఆడింది. సరైన కంటెంట్‌ లేని సినిమాలు మాత్రమే బెడిసికొడతాయి. అయినా ఇప్పుడు మన దగ్గర చాలా సినిమాలు లైన్‌లో ఉన్నాయి. 'లాల్‌ సింగ్‌ చడ్డా', 'రక్షా బంధన్‌', 'బ్రహ్మాస్త్ర', రోహిత్‌ శెట్టి మూవీ, ఏడాది చివర్లో సల్మాన్‌ సినిమా ఉంది. ఈ చిత్రాల కోసం మనం ఎదురుచూడాలి."

-- కరణ్​ జోహర్​, ప్రముఖ నిర్మాత

ప్రస్తుత రోజుల్లో థియేటర్లకు జనాలను రప్పించడం అంత సులువేమీ కాదని కరణ్​ జోహర్​ అన్నారు. "సినిమా ట్రైలర్‌, ప్రచారం అన్నీ పర్ఫెక్ట్‌గా ఉండాలి. అంతే కాకుండా మనం మన పేరుప్రతిష్ఠలపై బతుకుతున్నాం. కొన్నిసార్లు అది ఒత్తిడిగా అనిపిస్తుంటుంది" అంటూ చెప్పుకొచ్చారు కరణ్‌ జోహార్‌.

'జుగ్‌ జుగ్‌ జియో' చిత్రం కరణ్‌ జోహార్‌ సొంత బ్యానర్‌లోనే తెరకెక్కింది. గత నెలలో విడుదల​ అయిన ఈ మూవీ దాదాపు రూ.84 కోట్లు వసూళ్లు రాబట్టింది. 'గంగూబాయ్‌ కతియావాడి'కి రూ.180 కోట్లు రాగా 'భూల్‌ భులాయా 2' రూ.250 కోట్లను కొల్లగొట్టింది. ఇదే సమయంలో భారీ సినిమాలు సల్మాన్‌ ఖాన్‌ 'అంతిమ్‌', అజయ్‌ దేవ్‌గణ్‌ 'రన్‌వే 34', అక్షయ్‌ కుమార్‌ 'సామ్రాట్‌ పృథ్వీరాజ్‌', రణ్‌బీర్‌ కపూర్‌ 'షంషేరా' చిత్రాలు బోల్తా కొట్టాయి.

ఇవీ చదవండి: సోమవారం నుంచి సినిమా షూటింగ్​లు​ బంద్​

'బింబిసార 2'లో ఎన్టీఆర్‌!.. హీరో కల్యాణ్​రామ్‌ క్లారిటీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.