ETV Bharat / entertainment

బాలయ్యతో కాజల్ అగర్వాల్​​.. అఫీషియల్​ అనౌన్స్​మెంట్​ వచ్చేసిందోచ్​ - nbk 108 balakrishna kajal latest update in telugu

నందమూరి బాలకృష్ణ సరసన నటించనున్నారు హీరోయిన్​ కాజల్​ అగర్వాల్. ఈ విషయాన్ని NBK108 మూవీ టీమ్​ అధికారికంగా ప్రకటించింది.

kajol agarwal movie started with balakrishna
బాలయ్య ఎన్‌బీకే108లో కాజల్​ అగర్వాల్​
author img

By

Published : Mar 20, 2023, 10:06 PM IST

Updated : Mar 21, 2023, 6:40 AM IST

టాలీవుడ్​లో తన అందం, యాక్టింగ్​తో మెప్పించిన హీరోయిన్​ కాజల్​ అగర్వాల్​.. దాదాపు అందరు యువ హీరోలతో కలిసి సినిమాలు చేశారు. ఇక ఇప్పుడు అగ్రహీరో అయిన నందమూరి బాలకృష్ణతో జతకట్టనున్నారు. తాజాగా ఆమె.. దర్శకుడు అనిల్​ రావిపూడి తెరకెక్కిస్తున్న ఎన్‌బీకే108 షూటింగ్ సెట్​లోకి అడుగుపెట్టారు. ఈ విషయాన్ని తెలియజేసేలా మూవీ యూనిట్​ తాజాగా ఓ పోస్టర్​ను విడుదల చేసింది. ఇక ఈ సినిమాలో నటి శ్రీలీల కీలక పాత్ర పోషిస్తున్నారు. షైన్‌ స్క్రీన్‌ బ్యానర్​పై సాహు గారపాటి, హరీశ్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఎస్​ఎస్​ తమన్ సంగీత స్వరాలు సమకూరుస్తున్నారు. ఇక ఎన్​బీకే108 సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.

పెళ్లై పాప పుట్టిన అనంతరం​ యాక్టింగ్​కు కాస్త గ్యాప్​ ఇచ్చిన కాజల్​ అగర్వాల్.. మళ్లీ సినిమాల్లో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. రీసెంట్​గా ఈమె.. తమిళ చిత్రం ఘోస్టీతో ప్రేక్షకుల్ని అలరించారు. ఇటీవలే విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్​ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. ఇదే సినిమా కోస్టీ పేరుతో తెలుగులో మార్చి 22న తెలుగు ఆడియన్స్​ ముందుకు రానుంది. తెలుగులో చందమామ సినిమాలో తన నటనతో ఆడియన్స్​కు దగ్గరయ్యారు. ఆ తర్వాత టాలీవుడ్​లో అగ్రహీరోయిన్​గా ఎదిగిన ఈమె తన ఖాతాలో ఎన్నో బ్లాక్​బస్టర్స్​ను వేసుకున్నారు.

మహారాష్ట్రకు చెందిన బిజినెస్​మెన్​ గౌతమ్ కిచ్లును 2020లో వివాహం చేసుకున్నారు కాజల్​. దీంతో కొన్నాళ్లు ఈమె సినిమాలకి దూరంగా ఉన్నారు. ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చారు. అయితే ఈ పరిణామాలతో కాజల్​ కొద్ది రోజులు సినిమాలకు బ్రేక్​ చెప్పారు. అయితే వరుస సినిమాల షెడ్యూల్​తో బిజీగా కనిపిస్తున్న కాజల్​ సినీ ఇండస్ట్రీలో కొనసాగుతానని చెప్పకనే చెప్పారు. అయితే భర్త గౌతమ్​ కిచ్లు పెళ్లికి ముందు తనకు మంచి ఫ్రెండ్​ కావడం వల్ల అతడి ప్రోత్సాహంతో సినిమాల్లో సెకెండ్​ ఇన్నింగ్స్​ను మొదలుపెట్టారు కాజల్​.

తన ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు కాజల్​ అగర్వాల్​. రెగ్యూలర్​గా జిమ్​, వ్యాయామాలు చేస్తూ బాడీని ఫిట్​గా ఉండేలా చూసుకుంటారు. అయితే ఈ మధ్య సోషల్​ మీడియాలో కూడా చాలా యాక్టివ్​గా ఉంటున్నారు కాజల్​. ఈ క్రమంలో తన కొత్త లుక్స్​ను అభిమానులకు చూపించేందుకు మోడ్రన్​ డ్రెస్సులు ధరించి పలు ఫొటో షూట్​లను సోషల్​ మీడియా వేదికగా ఫ్యాన్స్​తో పంచుకుంటున్నారు కాజల్​.

అయితే ఇండస్ట్రీలో హీరోయిన్ల హవా వారు పెళ్లి చేసుకునేంత వరకే అనే ప్రచారం​ ఉండేది. కానీ ప్రస్తుతం ఆ ట్రెండ్​ మారుతోంది. వివాహ బంధంలోకి అడుగుపెట్టి పిల్లల్ని కని కూడా సిల్వర్​ స్క్రీన్​పై కనిపించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ లిస్ట్​లో హీరోయిన్​ కాజల్​ అగర్వాల్​తో పాటు బాలీవుడ్​ నటి కాజోల్​, ఐశ్వర్యరాయ్​ బచ్చన్​, నయనతార, స్నేహ, మాధురి దీక్షిత్​ ఉన్నారు.

Last Updated : Mar 21, 2023, 6:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.