ETV Bharat / entertainment

'అవతార్'​ నిడివి కోసం పోట్లాట.. 'డాన్3'లో మరో హీరో ఎవరు? - డాన్​ త్రీ హీరో అప్డేట్​

హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జేమ్స్​ కామెరాన్‌ 'అవతార్​' విషయంలో జరిగిన ఓ సంఘటనను గుర్తుచేసుకున్నారు. సినిమా ఔట్​పుట్​ విషయంలో నిర్మాతలతో వాగ్వాదం చేశానన్నారు. ఇక బాలీవుడ్​ బ్లాక్ బస్టర్ 'డాన్​' సిరీస్​లో మూడో చిత్రంలో రాబోతుంది. ఇందులో మరో హీరో ఎవరో అనేది దాదాపు ఖరారయ్యింది. అందాల సుందరి త్రిష మరో సినిమా అప్డేట్ వచ్చింది.

james cameron about avatar movie
james cameron about avatar movie duration and don three movie update
author img

By

Published : Sep 21, 2022, 9:04 AM IST

Avatar Movie : 'అవతార్‌'లో కొన్ని దృశ్యాలు తొలగించకుండా, నిడివి తగ్గించకుండా నిర్మాతలతో పెద్ద యుద్ధమే చేశానన్నారు జేమ్స్‌ కామెరూన్‌. ఒక మీడియా సంస్థకి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. చిత్రీకరణ సమయంలో మనసుకి ఏది నచ్చితే అది చేయడానికి ఫాక్స్‌ స్టూడియోస్‌ యజమానులతో చాలాసార్లు వాగ్వాదం చేశానన్నారు. 'చిత్రం నిడివి తగ్గించాలి. ఇక్రాన్‌ పాత్ర ఎగిరే సన్నివేశాలు మరీ అధికంగా ఉన్నాయి. వాటిని కత్తిరించాలి' అని నిర్మాతలు ఓ సందర్భంలో కామెరాన్‌పై ఒత్తిడి తీసుకొచ్చారట.

avatar
అవతార్

దీంతో కోపోద్రిక్తుడైన కామెరూన్‌ 'ప్రస్తుతం మనం కూర్చొని మాట్లాడుకుంటున్న ఈ పెద్ద బంగళా, రూ.4 వేల కోట్ల విలువైన స్టూడియో కాంప్లెక్స్‌ ఇక్కడున్నాయంటే కారణం నేను మీకోసం తెరకెక్కించిన 'టైటానిక్‌'నే. ఆ విషయం మర్చిపోయారా?' అని నిర్మాతలను హెచ్చరించారట. 'ఆ విషయం అర్థం చేసుకున్న స్టూడియో ఓనర్లు తర్వాత ఎలాంటి అడ్డంకులు చెప్పకుండా సహకరించారు' అని చెప్పుకొచ్చారు. ఇలా ఎన్నో ఒడుదొడుకులతో జో సల్దానా, సామ్‌ వర్తింగ్టన్‌ కీలక పాత్రల్లో 2009లో తెరకెక్కిన 'అవతార్‌' ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.16వేల కోట్లు వసూలు చేసింది. 'అవెంజర్స్‌: ఎండ్‌గేమ్‌' వచ్చేంతవరకూ ప్రపంచ సినీ చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా నిలిచింది.

'డాన్3'లో డాన్​లు ఎవరు?
'డాన్‌'లో అమితాబ్‌ బచ్చన్‌ అదరగొడితే.. 'డాన్‌2'లో షారుక్‌ఖాన్‌ చెలరేగిపోయారు. ఈ రెండు చిత్రాలూ బాక్సాఫీసు దగ్గర భారీ వసూళ్లు రాబట్టాయి. మరి 'డాన్‌ 3'లో ఈ ఇద్దరూ కలిసి నటిస్తే..? వీళ్లకి తోడుగా రణ్‌వీర్‌సింగ్‌ కీలకపాత్ర పోషిస్తే..? అభిమానులకు పెద్ద పండగే అవుతుంది. చూస్తుంటే.. ఇది సాధ్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నటుడు, దర్శకుడు ఫర్హాన్‌ అఖ్తర్‌ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు 'డాన్‌ 3'ని తెరకెక్కించే బాధ్యత తీసుకున్న సంగతి తెలిసిందే.

don 3
డాన్​3

ఇందులో షారుక్‌ కథానాయకుడు అని గతంలోనే ప్రకటించారు. ఆయన కోరిన విధంగా స్క్రిప్టులో కొన్ని మార్పులు సైతం చేశారు. ఇప్పుడు ఫర్హాన్‌.. అమితాబ్‌, రణ్‌వీర్‌లను ఇందులోకి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. తరువాయి భాగాల్లో రణ్‌వీర్‌ హీరోగా చేయడానికే తనని ఓ పాత్రలోకి తీసుకున్నట్టు సమాచారం. అమితాబ్‌, రణ్‌వీర్‌లు సానుకూలంగా ఉన్నా.. అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. ఏదేమైనా ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి.

'వారసుడు' నాయిక త్రిష..
విజయ్‌ ప్రస్తుతం 'వారసుడు' చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తున్న ఈ ద్విభాషా చిత్రం.. ఇప్పుడు ముగింపు దశలో ఉంది. ఇది పూర్తయిన వెంటనే లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు విజయ్‌. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ చిత్రం నవంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలిసింది. ఇందులో ఇద్దరు కథానాయికలకు అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి.

varasudu
వారసుడు

దీంట్లో ఓ నాయిక పాత్ర కోసం త్రిషను ఎంపిక చేశారని సమాచారం. ఇప్పటికే కథా చర్చలు పూర్తయ్యాయని, త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశముందని ప్రచారం వినిపిస్తోంది. విజయ్‌ - త్రిష చివరిగా 14ఏళ్ల క్రితం 'కురువి' చిత్రంలో జంటగా కనిపించి.. మురిపించారు. ప్రస్తుతం త్రిష నటించిన 'పొన్నియిన్‌ సెల్వన్‌' సెప్టెంబర్‌ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఊహకందని కామెడీ కథతో
'భూల్‌ భులయ్యా 2' ఘనవిజయంతో దర్శకుడు అనీస్‌ బజ్మీతో సినిమా చేయడానికి చాలామంది నిర్మాతలు వరుసలో ఉన్నారు. ఎట్టకేలకు ఆయన కొత్త చిత్రానికి పచ్చజెండా ఊపారు. జీ స్టూడియోస్‌, ఎచిలాన్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించే ఈ ప్రాజెక్టుని పట్టాలెక్కించనున్నట్టు మంగళవారం ప్రకటించారు. ఈ సందర్భంగా జీ స్టూడియోస్‌ సీబీవో షారిక్‌ పటేల్‌ మాట్లాడుతూ 'మేం అనీస్‌తో కలిసి పని చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.

సరికొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కే ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. అనీస్‌ తప్పకుండా మనకోసం ఓ మాస్‌ మసాలా సినిమాని తీసుకొస్తారు' అని అన్నారు. రచయిత, దర్శకుడు అనీస్‌ బజ్మీ మాట్లాడుతూ 'భూల్‌ భులయ్యా 2' విజయం తర్వాత ప్రేక్షకుల కోసం మరో పెద్ద డోసు వినోదం ఇవ్వాలనుకుంటున్నా. ఈసారి ఎవరూ ఊహించని కామెడీ కథతో మీ ముందుకొస్తున్నా. భారతీయ ప్రేక్షకులు ఇంతకుముందు ఎప్పుడూ చూడని విధంగా ఉంటుంది' అన్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కే ఈ చిత్రం వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవీ చదవండి : 'గిరి గీసుకొని ఉంటానంటే ఎలా?.. ఈ 'అల్లూరి' వందలో ఒక్కడు'

ఈ చిన్నారి ఇప్పుడు హీరోయిన్​.. కీర్తిసురేశ్​కు బెస్ట్​ ఫ్రెండ్​.. ఎవరో తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.