ETV Bharat / entertainment

షారుక్​ సినిమాలో బన్నీ రోల్​ ఫిక్స్​! షూటింగ్​ కూడా.. - జవాన్​ సినిమా అప్డేట్స్

టాలీవుడ్​ ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్​ త్వరలో బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇవ్వనున్నడట. ఇన్ని రోజులు అవాస్తవాలన్న మాటలు ఇప్పుడు నిజం అవ్వనున్నాయని సమాచారం. ఇంతకీ ఈ సినిమాలో బన్నీ రోల్​ ఎంటంటే..

allu arjun cameo
allu arjun cameo in jawaan movie
author img

By

Published : Apr 22, 2023, 7:14 AM IST

టాలీవుడ్​ ఐకాన్​ స్టార్​ అల్లు అర్జున్​ త్వరలో బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడు. అది కూడా ఓ స్టార్​ హీరో సినిమాలో. అప్పట్లో ఈ వార్త సోషల్​ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యింది. అయినప్పటికీ అవన్ని అవాస్తవాలే అంటూ కొట్టిపారేశారు. అయితే తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం అవన్ని నిజమే అని అనిపిస్తోంది. బాలీవుడ్​ బాద్​షా షారుక్​ ఖాన్​ నటిస్తున్న జవాన్​ సినిమాలో బన్నీ రోల్​ ఉందన్న విషయం గట్టిగానే వినిపిస్తోంది. అప్పట్లో చెప్పినట్లే ఈ సినిమాలో అల్లు అర్జున్​ గెస్ట్​ రోల్​లో మెరవనున్నారట. అంతే కాకుండా ఈ సినిమాలో బన్నీ షెడ్యూల్​ కూడా కంప్లీట్​ అయ్యిందని టాక్​.

ఇక ఈ వార్త విన్న అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. బన్నీని ఆ స్టార్​ హీరో సినిమాలో చూసేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికీ ఈ విషయంపై మూవీ టీమ్​ ఎటువంటి అఫీషియల్​ అనౌన్స్​మెంట్​ ఇవ్వలేదు. ఒక వేళ ఈ సినిమాలో బన్నీ ఎంట్రీని ఫ్యాన్స్​ కోసం సర్ప్రైజ్​గా ఉంచాలని డైరెక్టర్​ ప్లాన్​ చేశారేమో అని నెటిజన్లు అనుకుంటున్నారు.

'జవాన్' సినిమాతో పలువురు సౌత్​ ఇండియన్​ స్టార్స్​ స్క్రీన్​పై సందడి చేయనున్నారు. దర్శకుడు అట్లీ సౌత్​ వ్యక్తి కాగా.. హీరోయిన్​ నయనతార సౌత్​లోనే ఫేమస్​ అయిన స్టార్​. వీరిద్దరు కూడా ఈ సినిమాతోనే బాలీవుడ్​లోకి తొలిసారిగా ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇక ఈ సినిమాలో మరో ఇద్దరు సౌత్​ స్టార్స్​ అయిన విజయ్ సేతుపతి, ప్రియమణి కీలక పాత్రలు పోషిస్తున్నారు. అంతే కాకుండా ఇందులో బాలీవుడ్ ముద్దుగుమ్మ దీపికా పదుకొణె అతిథి పాత్ర పోషించనున్నారట. షారుఖ్ నిర్మాణ సంస్థ అయిన రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్ ఈ ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్​కు ప్రేక్షకులను బాగా కనెక్టయ్యారు. శరవేగంగా షూటింగ్​ జరుపుకుంటున్న ఈ సినిమా జూన్ 2న హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

ఇక బన్నీ సినిమా లైనప్​ విషయానికి వస్తే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పుష్ప 2' సినిమా షూట్​లో పాల్గొంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా హిట్ 'పుష్ప'కు సీక్వెల్​గా రెడీ అవుతోంది. ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన్న నటించగా.. మొదటి పార్ట్​ లాగే ఇందులోనూ ఫహాద్​ ఫాజిల్​, సునీల్​ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా కొన్ని రోజుల క్రితం సినిమాలో కీలక ఫైట్​ సీన్స్​ కోసం ఒడిశాకు చేరుకున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ షూట్​కు బ్రేక్​ పడినట్లు సమాచారం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.