Rishab Shetty Rashmika: దేశవ్యాప్తంగా 'కాంతార' సినిమాతో సంచలనం సృష్టించిన రిషబ్ శెట్టి చేసిన వ్యాఖ్యలు నెట్టింట దుమారం రేపుతున్నాయి. రష్మిక, కీర్తి సురేష్, సాయి పల్లవి, సమంతల్లో హీరోయిన్గా ఎవరిని ఎంచుకుంటారని ఒక విలేకరి ప్రశ్న అడిగారు. దీనికి రిషబ్ శెట్టి సమాధానం ఇస్తూ సాధారణంగా తాను స్క్రిప్ట్ పూర్తయ్యాకనే నటీనటులను ఎంచుకుంటానని, కొత్త వారికి ప్రిఫరెన్స్ ఇస్తానని అన్నారు. అయితే ఆ తర్వాత గాల్లో రెండు చేతులతో కొటేషన్ సింబల్ చూపిస్తూ ఇలాంటి హీరోయిన్లు తనకు నచ్చరని, కానీ సాయిపల్లవి, సమంతలతో కలిసి పనిచేస్తానని తెలిపారు.
అయితే రిషబ్ కౌంటర్ వేసింది రష్మికకేనని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఇటీవలే రష్మిక ఒక ఇంటర్వ్యూలో తన మొదటి సినిమా 'కిరిక్ పార్టీ' అవకాశం రావడం వెనకున్న కథ చెప్పారు. ఒక అందాల పోటీలో తాను గెలిచానని, ఆ సమయంలో తన ఫొటో ఒక ప్రముఖ దినపత్రిక మొదటి పేజీలో వచ్చిందని, అప్పుడు తనకు ఆ ప్రొడక్షన్ హౌస్ నుంచి కాల్ వచ్చిందని తెలిపారు. ప్రొడక్షన్ హౌస్ గురించి తెలిపే సమయంలో రష్మిక రెండు చేతులతో గాల్లో కొటేషన్ సింబల్ చూపిస్తూ మాట్లాడటంతో అది బాగా వైరల్ అయింది.
-
This Hits Hard 😂 🤣😂 #RishabShetty 🔥🔥 pic.twitter.com/sd9n2NFken
— Filmy Corner (@filmycorner9) November 21, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">This Hits Hard 😂 🤣😂 #RishabShetty 🔥🔥 pic.twitter.com/sd9n2NFken
— Filmy Corner (@filmycorner9) November 21, 2022This Hits Hard 😂 🤣😂 #RishabShetty 🔥🔥 pic.twitter.com/sd9n2NFken
— Filmy Corner (@filmycorner9) November 21, 2022
అయితే 'కిరిక్ పార్టీ' సినిమాకు రిషబ్ శెట్టినే దర్శకుడు. సినిమాలో హీరోగా నటించిన రక్షిత్ శెట్టినే ఆ సినిమాను నిర్మించారు కూడా. రష్మిక చేసిన వ్యాఖ్యలకు రిషబ్ శెట్టి గట్టిగా కౌంటర్ ఇచ్చారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
'కిరిక్ పార్టీ' సినిమాతో రష్మిక సాండల్వుడ్లో ఏకంగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. అందులో హీరోగా నటించిన రక్షిత్ శెట్టితో ప్రేమలో పడటంతో వారిద్దరికీ నిశ్చితార్థం కూడా అయిపోయింది.