ETV Bharat / entertainment

స్టేజ్‌పై అభిమాని కాళ్లకు నమస్కరించిన స్టార్​హీరో, ఎందుకంటే - అభిమాని పాదాలను నమస్కరించిన హృతిక్ రోషన్​

Hrithik roshan అభిమాని కాళ్లకు నమస్కారం చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్ . ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఆయన్ని మెచ్చుకుంటున్నారు. ఇంతకీ అభిమాని కాళ్లకు హృతిక్‌ ఎందుకు నమస్కారం చేశారంటే?

hrithik roshan
హృతిక్​ రోషన్​
author img

By

Published : Aug 28, 2022, 3:55 PM IST

సాధారణంగా సినీతారలు కనిపిస్తే అభిమానుల ఆనందానికి హద్దులు ఉండవు. వాళ్లతో కలిసి ఒక్క సెల్ఫీ అయినా దిగాలని ఆరాటపడుతుంటారు. అలాగే కొన్ని సందర్భాల్లో స్టేజీపై హీరో కనిపించగానే వెంటనే సెక్యురిటీ సిబ్బందిని దాటి మరీ స్టేజీ ఎక్కి వారి మీద పడిపోతుంటారు. హీరోల పాదాలు తాకి జన్మ ధన్యమైపోయినట్లే ఫీలవుతారు. ఇలాంటి సంఘటనలు ఇదివరకు మనం చాలానే చూశాం. కానీ ఈసారి మాత్రం అందుకు భిన్నంగా జరిగింది. స్టార్‌ హీరో హృతిక్​రోషన్​ అందరూ చూస్తుండగానే తన అభిమాని పాదాలకు నమస్కరించాడు.

సినిమా షూటింగ్స్‌తో బిజీగా ఉండే హృతిక్‌ తాజాగా ఓ ప్రైవేటు ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేజ్‌పైకి వచ్చిన ఓ అభిమాని హృతిక్‌ కాళ్లకు నమస్కారం చేశాడు. అభిమాని చేసిన పనికి ఆశ్చర్యపోయిన హృతిక్‌ వెంటనే మర్యాదపూర్వకంగా అతని కాళ్లనూ తాకాడు. ఆయన చేసిన పనిని మెచ్చుకుంటూ పలువురు అభిమానులు ఈ వీడియోని నెట్టింట షేర్‌ చేశారు. హృతిక్‌ సింప్లిసిటీకి ఇది నిదర్శనం అని పేర్కొంటున్నారు.

ఇక, సినిమాల విషయానికి వస్తే ఆయన ప్రధాన పాత్రలో నటించిన 'విక్రమ్‌ వేద' వచ్చేనెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కోలీవుడ్‌ హిట్‌ మూవీ 'విక్రమ్‌ వేద'కు రీమేక్‌ ఇది. సైఫ్‌ అలీ ఖాన్‌ కీలకపాత్రలో నటించారు.

ఇదీ చూడండి: రంభ, ఊర్వశికైనా ఇంత అందం సాధ్యమా

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.