ETV Bharat / entertainment

'ఆ అమ్మాయితో లవ్​లో ఉన్నా..' తన ప్రేమ గురించి చెప్పిన విశాల్​ - hero vishal relationship with girlfriend

హీరో విశాల్​ తన ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఓ అమ్మాయితో ప్రేమలో పడినట్లు వెల్లడించారు.

Hero Vishal who says he is in love with a girl
ఆ అమ్మాయితో ప్రేమలో ఉన్నా.. ఆమె ఎవరంటే?: హీరో విశాల్​
author img

By

Published : Jul 7, 2022, 8:32 PM IST

తమిళ, తెలుగు భాషల్లో హీరోగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు విశాల్​. ఇటీవల యాక్షన్‌ సీన్స్​లో డూప్​ లేకుండా చేసిన నేపథ్యంలో గాయపడ్డారు. ఈ క్రమంలో విశ్రాంతి తీసుకుంటున్న విశాల్​.. తాజాగా ఓ ఛానెల్​కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తాను ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్నానని చెప్పారు విశాల్​. ఆమె ఎవరు అని అడగ్గా.. చెప్పకుండా దాటవేశారు. త్వరలో ఆమె గురించిన పూర్తి వివరాలు చెబుతానని వివరించారు. అయితే పెద్దలు కుదిర్చిన సంబంధాలు.. కలిసి రాకపోవడం వల్లే.. ప్రేమ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. నడిగర్‌ సంఘానికి భవనం కట్టించాకే పెళ్లి చేసుకుంటానని విశాల్​ శపథం చేసిన విషయం తెలిసిందే. అయితే ఆ భవనం పూర్తయ్యాక.. తన ప్రేయసి ఎవరనేది చెప్పే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే.. అర్జున్​ రెడ్డి ఫేమ్​ నటి అనీషా అల్లారెడ్డితో విశాల్​కు నిశ్చితార్థం జరిగింది. కొన్ని కారణాల వల్ల ఆ నిశ్చితార్థం రద్దు అయ్యింది. అలాగే.. వరలక్ష్మి శరత్‌కుమార్‌తో విశాల్​ ఎఫైర్​ నడుతున్నట్లు రూమర్స్​ సైతం వచ్చాయి.

ఇదీ చదవండి: విడాకుల తర్వాత గ్లామర్​ డోస్​ పెంచిన స్టార్​ హీరోయిన్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.