గతేడాది రోడ్డు ప్రమదానికి గురై.. విరూపాక్ష సినిమాతో ఘనంగా టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు హీరో సాయిధరమ్‌తేజ్. శుక్రవారం విడుదలైన ఈ చిత్రం.. ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. దీంతో తొలి రోజు ఈ మూవీ అద్భుతమైన వసూళ్లను దక్కించుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు.. విరూపాక్ష సినిమా ఎనిమిదిన్నర కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. వరల్డ్ వైడ్‌గా 12 కోట్ల రూపాయల గ్రాస్‌ను, ఆరు కోట్ల నలభై లక్షల రూపాయల షేర్‌ను సొంతం చేసుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. నైజాం ఏరియాలో కలెక్షన్స్‌లో ఈ సినిమా దుమ్ము రేపింది. శుక్రవారం ఒక్కరోజే దాదాపు నైజాంలో విరూపాక్ష సినిమాకు రెండు కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. సీడెడ్‌లో యాభై ఐదు లక్షలు, ఉత్తరాంధ్రలో 60 లక్షల మేర విరూపాక్ష మూవీకి కలెక్షన్స్ వచ్చినట్లు తెలిసింది.
వీకెండ్ కల్లా బ్రేక్ ఈవెన్!
మొత్తంగా శుక్రవారం రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఎనిమిదిన్నర కోట్ల గ్రాస్, నాలుగు కోట్ల అరవై లక్షలకుపైగా షేర్ దక్కించుకున్నట్లు ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 20 కోట్ల వరకు జరిగినట్లు తెలిసింది. తొలిరోజే దాదాపు ఈ సినిమా నలభై శాతం మేర రికవరీ కావడంతో వీకెండ్‌లోగా బ్రేక్ ఈవెన్ అవుతుదని టాలీవుడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కెరీర్‌లో ఫస్ట్‌డే..
సాయిధరమ్‌తేజ్ కెరీర్‌లో ఫస్ట్ డే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా విరూపాక్ష రికార్డ్ క్రియేట్ చేసింది. హారర్ థ్రిల్లర్ పాయింట్‌కు రివెంజ్ డ్రామాను దర్శకుడు కార్తిక్ దండు ఈ సినిమాను తెరకెక్కించారు. కథలోని మలుపులతో పాటు సాయిధరమ్‌తేజ్, సంయుక్త యాక్టింగ్ ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నాయి. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్‌ప్లేను అందించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
టైటిల్ అసలు లాజిక్ ఇదా!
అయితే తెలుగులో ఇదివరకు చాలా సినిమా టైటిల్స్‌ను అందరూ పలకడానికి వీలుగా పెట్టేవారు. కొన్ని చిత్రాలకు మాత్రం ఇంగ్లీష్ టైటిల్స్ పెట్టేవారు. ఈ మధ్య కాలంలో ఆ ట్రెండ్ ఎందుకో చాలావరకు మారిందనిపిస్తోంది. రీసెంట్గా హిట్ అయిన బలగం, దసరాని తీసుకుంటే.. టైటిల్‌కు సినిమాకు లింక్ ఉంటుంది. ఇప్పుడు విరూపాక్ష కూడా ఆ లిస్టులోకి చేరింది. కాకపోతే సినిమా అంతా చూసినా సరే చాలామంది టైటిల్ మీనింగ్ ఏంటనేది అర్థం కాదు. మీరు కరెక్ట్‌గా పోస్టర్స్‌ను గమనిస్తే అసలు విషయం ఏంటనేది తెలిసిపోతుంది. రూపంలేని కన్నుని విరూపాక్ష (శివుడి మూడో కన్ను) అంటారట. ఈ మూవీలోనూ రూపంలేని శక్తితో హీరో పోరాటం చేస్తుంటారు. అందుకే ఈ మూవీకి ఈ టైటిల్ పెట్టారట!