ETV Bharat / entertainment

'గుంటూరు కారం' ప్రీ రిలీజ్​ ఈవెంట్ వాయిదా- కారణం అదేనా? - Guntur Kaaram cast

Guntur Kaaram Pre Release Event : తెలుగు సూపర్​ స్టార్ మహేశ్​ బాబు నటించిన 'గుంటూరు కారం' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ వాయిదా పడింది. ఈ మేరకు చిత్ర యూనిట్​ వెల్లడించింది. ఇంతకీ ఈ సినిమా ఎందుకు వాయిదా పడిందంటే?

Guntur Kaaram Pre Release Event
Guntur Kaaram Pre Release Event
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 6, 2024, 6:54 AM IST

Updated : Jan 6, 2024, 8:55 AM IST

Guntur Kaaram Pre Release Event : సూపర్ స్టార్ మహేశ్ బాబు, 'మాటల మాంత్రికుడు' త్రివిక్రమ్ కాంబినేషన్​లో వస్తున్న మూడో చిత్రం 'గుంటూరు కారం'. జనవరి 12న (Guntur Kaaram Release Date) విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్​ శనివారం జరగాల్సి ఉన్నా, వాయిదా పడింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా చిత్ర యూనిట్ వెల్లడించింది. సూపర్ స్టార్ అభిమానులకు క్షమాపణలు చెబుతూ, వీలైనంత త్వరలో కొత్త వేదిక, తేదీ ప్రకటిస్తామని చెప్పింది. కొన్ని పరిస్థితులు, సెక్యురిటీ అనుమతుల కారణంగా ఈ కార్యక్రమం వాయిదా పడిందని తెలిపింది.

అయితే హైదరాబాద్‌లోని యూసఫ్​గూడా పోలీస్ లైన్స్‌లో జనవరి 6న 'గుంటూరు కారం' ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగాల్సి ఉంది. అంతుకుముందు ఈ వేడుకు నిర్వహించుకోవడానికి పోలీసులు అనుమతి ఇచ్చారు. కానీ ఆ తర్వాత యూటర్న్ తీసుకుని చివరి నిమిషంలో అనుమతి నిరాకరించినట్లు తెలిస్తోంది. ఈ ఈవెంట్​కు బందోబస్తు కల్పించడం సాధ్యం కాదని పోలీసులు చెప్పినట్లు సమాచారం. ఈ కారణంగానే చిత్ర యూనిట్ వేడుకను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. అయితే ఇటీవల బిగ్​బాస్​ ఫైనల్​ విన్నర్​ విషయంలో జరిగిన ఘటనే ఇందుకు కారణం అని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ప్రీ రిలీజ్​ ఈవెంట్ లైవ్​ స్ట్రీమింగ్!
ఈ సినిమా ప్రీ రిలీజ్​ ఈవెంట్​తో సరికొత్త ట్రెండ్​ సృష్టించాలని సినిమా యూనిట్ భావించింది. అందులో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్​ను అమెరికా థియేటర్స్​లో లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వబోతున్నారు. కాలిఫోర్నియాలోని సినీ లాంజ్‌ ఫ్రీమాంట్‌ 7 సినిమాస్‌ స్క్రీన్‌పై ప్రీ రిలీజ్ ఈవెంట్ లైవ్ స్ట్రీమ్ కానుంది. ఈ విషయాన్ని మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. సినీ వేడుకలు వెండితెరపై కనిపించనుండడం కూడా చిత్ర పరిశ్రమలో ఇదే తొలిసారి. దీంతో మహేశ్​ బాబు మరో కొత్త ట్రెండ్​ను సెట్ చేసి 'ట్రెండ్ సెట్టర్' అనిపించుకుంటున్నారు.
ఈ సినిమాలో మహేశ్​ సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల ఆడిపాడనుంది. సెకండ్​ హీరోయిన్​గా మీనాక్షి చౌదరి నటించింది. తమన్​ ఎస్​ సంగీతం సమకూర్చారు. సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరించారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

'ఫైట్ సీక్వెన్స్‌లు, ఎమోషన్లు, కుర్చీ సాంగ్- ఓ రేంజ్​లో చివరి 45నిమిషాలు!'

'త్రివిక్రమ్​ సెకండ్​ హీరోయిన్ సెంటిమెంట్​'- గుంటూరు కారంతో మీనాక్షి ఏం చేస్తుందో?

Last Updated : Jan 6, 2024, 8:55 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.