ETV Bharat / entertainment

షూటింగ్​లో గాయపడిన చియాన్ విక్రమ్​.. విరిగిన పక్కటెముక - షూటింగ్​లో చియాన్ విక్రమ్​ కు గాయం

ప్రముఖ తమిళ నటుడు చియాన్ విక్రమ్ షూటింగ్​ గాయపడ్డారు. పక్కటెముక విరిగినట్లు వైద్యులు గుర్తించారు.

Chiyaan Vikram  injured
షూటింగ్​లో గాయపడిన చియాన్ విక్రమ్​.. విరిగిన పక్కటెముక
author img

By

Published : May 3, 2023, 1:46 PM IST

Updated : May 3, 2023, 4:12 PM IST

Chiyaan Vikram injured : వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులను అలరిస్తుంటారు స్టార్ హీరో విక్రమ్‌. ప్రముఖ తమిళ నటుడైన ఈయన తాజాగా గాయపడ్డారు. పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'తంగలాన్' అనే సినిమాలోని పోరాట సన్నివేశాల చిత్రీకరణ రిహార్స్​లో ఆయకు గట్టి దెబ్బతగిలింది. దీంతో అప్రమత్తమైన మూవీ సిబ్బంది ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పరీక్షల్లో భాగంగా విక్రమ్ పక్కటెముక విరిగినట్లు వైద్యులు గుర్తించారు. ఈ మేరకు విక్రమ్ ప్రమాద విషయాన్ని ఆయన మేనేజర్ సూర్యనారాయణ్ ధ్రువీకరిస్తూ వివరాలు వెల్లడించారు. దీంతో చియాన్​ ఫ్యాన్స్​ ఆందోళన చెందుతున్నారు.

'తంగలాన్' షూటింగ్​కు ముందు రిహార్సల్ చేస్తున్న సమయంలో గాయపడ్డారని​.. ఆయన కొన్ని రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారని సూర్యనారయణన్​ తెలిపారు. ఈ క్రమంలో ఆయన కొద్ది రోజుల పాటు 'తంగలాన్​' షూటింగ్​కు దూరం కానున్నారని వెల్లడించారు. ఈ క్రమంలో విక్రమ్​పై అభిమానులు చూపిస్తోన్న ప్రేమకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే అతి త్వరలోనే కోలుకొని విక్రమ్ మళ్లీ షూటింగ్ కు హాజరవుతారని అన్నారు.

పంతొమ్మిదవ శతాబ్ధంలోని కోలార్‌ గోల్డ్‌ ఫీల్స్‌ నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో డిఫరెంట్​ లుక్​లో కనిపిస్తున్నారు విక్రమ్​. ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లు, మేకింగ్‌ వీడియోలు ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనాలు ఇంతకింత పెంచుతున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో విక్రమ్‌ గెటప్‌ గురించి అందరిలో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. డిఫరెంట్​ క్యారెక్టర్స్​కు ప్రాధాన్యత ఇచ్చే ఈ స్టార్​ హీరో.. ఈ సినిమాకు తగ్గట్టుగా తన లుక్​ను మార్చుకున్నారు. ఇందులో భాగంగా విక్రమ్‌ డీ గ్లామరైజ్‌ పాత్రలో కనిపించనున్నారు. అంతేకాకుండా ఈ మూవీ కోసం ఆయన బరువు కూడా తగ్గినట్లు సమాచారం.

ఇక ఈ సినిమాలో విక్రమ్​తో పాటు పార్వతి, మాళవిక మోహనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. హాలివుడ్​ నటుడు డేనియల్ కాల్టాగిరోన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషించారు. కొనేళ్ల క్రితమే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే 80శాతం షూటింగ్ కంప్లీట్‌ చేసుకున్న ఈసినిమా.. మరో రెండు షెడ్యూల్స్‌తో టాకీ పార్ట్‌ను పూర్తిగా కంప్లీట్‌ చేయాలని ప్లాన్‌ చేసుకుంది. అయితే ఇప్పుడు ఆయన గాయం వల్ల షూటింగ్​ తాత్కాలికంగా ఆగిపోయింది.

ఇటీవలే పాన్​ ఇండియా లెవెల్​లో విడుదలైన 'పొన్నియన్ సెల్వన్ పార్ట్​ 2' ఘన విజయాన్ని ఆస్వాదిస్తున్న చియాన్​​ అభిమానులు.. ఇప్పుడు 'తంగలాన్' షూటింగ్​లో ఆయన గాయపడ్డారన్న విషయాన్ని తెలుసుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నటుడు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. సోషల్​ మీడియాలో గెట్​ వెల్​ సూన్​ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇదీ చూడండి: ప్రముఖ నటుడు మనోబాల కన్నుమూత

Last Updated : May 3, 2023, 4:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.