ETV Bharat / entertainment

విడుదల​కు సిద్ధమైన 'ఛత్రపతి'.. ఫుల్​ టెన్షన్​లో బెల్లంకొండ.. ఏమవుతుందో? - ఛత్రపతి హిందీ రిమేక్​ బడ్జెట్

Chatrapathi Hindi Remake : 'ఛత్రపతి' రిమేక్​తో బాలీవుడ్​లో ఎంట్రీ ఇస్తున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్​​. ఈ సినిమా దేశవ్యాప్తంగా మే 12 శుక్రవారం విడుదల కానుంది. దీంతో హీరోతో పాటు చిత్ర బృందంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.

bellamkonda srinivas chatrapathi remake release date

author img

By

Published : May 11, 2023, 4:04 PM IST

Chatrapathi Hindi Remake : తెలుగులో బ్లాక్​ బస్టర్​​గా నిలిచిన 'ఛత్రపతి' సినిమాతో బాలీవుడ్​లోకి ఎంట్రీ ఇస్తున్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్​. ఈ చిత్రం మే 12 శుక్రవారం విడుదల కానుంది. దీంతో ఈ సినిమాను ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో అని హీరోతో పాటు.. అభిమానుల్లోనూ ఉత్కంఠ నెలకొంది. అయితే, సాయి శ్రీనివాస్​ ఇప్పటివరకు నటించిన సినిమాల హిందీ వర్షన్లకు యూట్యూబ్​లో భారీ వ్యూస్​ వచ్చాయి. బెల్లంకొండ యాక్షన్​కు నార్త్​ ఫ్యాన్స్​ ఫిదా అయిపోయారు. ఇంకా చెప్పాలంటే ఆయన నటించిన 'జయ జానకి నాయక' హిందీ వర్షన్​కు యూట్యూబ్​లో దాదాపు 710 మిలియన్ల వ్యూస్​ వచ్చాయి. 'సీత' చిత్రానికి 588 మిలియన్​, 'కవచం' సినిమాకు 340 మిలియన్, 'అల్లుడు శీను'కు 246 మిలియన్ వ్యూస్​ వచ్చాయి. ఈ రికార్డులన్నీ బెల్లంకొండ 'ఛత్రపతి'కి కలిసి వచ్చే అవకాశాలున్నాయి.

అయితే, పాన్​ ఇండియా స్టార్ ప్రభాస్​ నటించిన తెలుగు వర్షన్ 'ఛత్రపతి'ని టాలీవుడ్​ అభిమానులు ఇదివరకే చూశారు. కాబట్టి తెలుగులో ఈ సినిమా అంతగా ఆడకపొవచ్చనేది సినీ నిపుణులు మాట. ఈ కారణంగానే మూవీ టీమ్ తెలుగు వర్షన్​ను అంత సీరియస్​ తీసుకోలేదని తెలుస్తోంది. మరోవైపు, చిత్ర బృందం మెయిన్​ టార్గెట్​ కూడా హిందీ బాక్సాఫీసే అని సమాచారం. అయితే, భారీ బడ్జెట్​తో తెరకెక్కిన ఈ సినిమా.. అంతమేరకైనా వసూళ్లు సాధిస్తుందా తేదా అని ఆసక్తి నెలకొంది. ఈ హిందీ 'ఛత్రపతి' సినిమాను.. గంగూభాయ్​, ఆర్ఆర్ఆర్​ చిత్రాల నిర్మాతలు పెన్​ స్టూడియోస్​ విడుదల చేస్తున్నాయి. కాబట్టి ఎక్కువ మొత్తం థియేటర్లలో రిలీజ్​ చేసే అవకాశలున్నాయి. సినిమా టాక్​ బాగుంటే భారీ కలెక్షన్లు సాధించే అవకాశం ఉంది.

అయితే, ఈ సినిమా విడుదల నేపథ్యంలో ఓ విషయం మూవీ టీమ్​ను కలవరపెడుతోంది. అదేంటంటే.. ఈ మధ్య బాలీవుడ్​లో విడుదలైన రిమేక్​ సినిమాలకు కలిసిరావడం లేదు. ఇటీవల రిలీజైన 'విక్రమ్​ వేదా', 'హిట్​ 1- దిఫస్ట్​ కేస్', 'జెర్సీ', 'షెహజాదా (అల వైకుంఠపురంలో)', 'యూటర్న్'​ లాంటి సినిమాలు బాలీవుడ్​ బాక్సాఫీస్​ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో చిత్ర యూనిట్​లో ఆందోళన నెలకొంది. ఇక, హీరో బెల్లంకొండ శ్రీనివాస్​కు కూడా రానున్న 24 గంటలు టెన్షన్​ అనే చెప్పాలి.
ఇదిలా ఉంటే, బెల్లంకొడ.. బాలీవుడ్​లో మరో రెండు సినిమాలకు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చారని వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే బెల్లంకొండ.. నార్త్ ఆడియెన్స్​కు మరింత దగ్గరయ్యే అవకాశాలున్నాయి. ఈ 'ఛత్రపతి' విజయం సాధిస్తే.. భవిష్యత్​లో మరిన్ని సినిమాలతో హిందీ ప్రేక్షకులను అలరించడానికి శ్రీనివాస్​కు అవకాశం లభిస్తుంది.

'ఛత్రపతి' బాలీవుడ్​ రిమేక్​ను దిగ్గజ దర్శకుడు వివి వినాయక్​ తెరకెక్కిస్తున్నారు. ఒరిజినల్ 'ఛత్రపతి'కి కథ అందించిన రచయిత విజయేంద్ర ప్రసాదే.. ఈ రీమేక్​కు కూడా అందించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ లెజెండ‌రీ క‌మెడియ‌న్ జానీ లివ‌ర్ కూడా కీలక పాత్ర పోషించారు. ఇంకా హీరో బెల్లంకొండ శ్రీనివాస్, నుస్రత్​ బరూచా, భాగ్యశ్రీతో పాటు అమిత్ నాయర్, సాహిల్ వైద్, శివమ్ పాటిల్, రాజేంద్ర గుప్తా, ఆశిష్ సింగ్ సహా పలువురు నటించారు. ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్‌ బ్యానర్​పై బాలీవుడ్ నిర్మాత జ‌యంతి లాల్ గ‌డా నిర్మించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.