ETV Bharat / entertainment

Baby OTT Release Date : ఓటీటీలోకి రానున్న 'బేబీ'.. స్ట్రీమింగ్​ తేదీ ఇదే!

author img

By

Published : Aug 18, 2023, 12:09 PM IST

Baby OTT Release Date Telugu : యువ కథానాయకుడు ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'బేబీ'. యువతను విపరీతంగా ఆకట్టుకుని కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇప్పుడు ఓటీటీలో రిలీజ్​ అయ్యేందుకు సిద్ధమైంది. స్ట్రీమింగ్​ ఎప్పటినుంచో తెలుసా?

Baby OTT Release Date
Baby OTT Release Date

Baby OTT Release Date Telugu : సాధారణ చిన్న చిత్రంగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ట్రయాంగిల్​ లవ్​ స్టోరీ 'బేబీ'. సాయి రాజేశ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా యువతను విపరీతంగా ఆకట్టుకుని కలెక్షన్ల వర్షం కురిపించింది. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య, విరాజ్‌ అశ్విన్‌ కీలక పాత్రల్లో నటించి ప్రేక్షకులను కట్టిపడేశారు. జులై 14న థియేటర్‌లో విడుదలైన ఈ మూవీ.. బాక్సాఫీస్‌ వద్ద రూ.80 కోట్ల వసూళ్లను రాబట్టింది.

Baby Movie Aha Release Date : ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందా? అని సినీ అభిమానులు ఎదురు చూశారు. వారికి శుభవార్త వచ్చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్​ఫామ్​ 'ఆహా'లో 'బేబీ' మూవీ ఆగస్టు 25 నుంచి స్ట్రీమింగ్​ కానుంది. ఈ మేరకు 'ఆహా' ఓటీటీ సంస్థ ఎక్స్​ (ట్విట్టర్​) వేదికగా ట్వీట్‌ చేసింది. దీంతో పాటు ఓ స్పెషల్​ పోస్టర్‌ను విడుదల చేసింది. 'ఆహా గోల్డ్‌' సబ్​స్క్రిప్షన్ కలిగిన వారు.. ఈ చిత్రాన్ని 12 గంటల ముందే చూడొచ్చు. అంటే ఆగస్టు 24 సాయంత్రం 6 గంటల నుంచి గోల్డ్‌ సబ్‌స్క్రైబర్లకు ఈ సినిమా స్ట్రీమింగ్‌ కానుంది.

ఓటీటీలో ఎక్కువ రన్​టైమ్?
Baby Movie Runtime : ఇటీవల ఈ సినిమా రన్​టైమ్​పై వార్తలు వచ్చాయి. అందులో సుమారు 3 గంటల నిడివి కలిగిన ఈ మూవీ.. ఓటీటీలో మాత్రం 4 గంటల రన్​టైమ్​తో రానుందట. మరో పాట సహా.. కొన్ని సన్నివేశాలను సినిమాలో చేర్చనున్నారని సమాచారం. కాగా ఇందులో హీరోయిన్ వైష్ణవి చైతన్య, నటుడు విరాజ్​ మధ్య ఎక్కువ సీన్స్​ ఉండనున్నట్లు తెలుస్తోంది. హీరో ఆనంద్ దేవరకొండకు సంబంధించి కొన్ని ఎమోషనల్​ సన్నివేశాలు కూడా ఉంటాయని తెలుస్తోంది. అయితే ఇవన్నీ సాధ్యమైతే ఓటీటీలోకి 'బేబీ' నాలుగు గంటల రన్​టైమ్​తో సందడి చేయనుంది.

'బేబీ' క‌థ ఇదే..
Baby Movie Story Telugu : వైషు అలియాస్ వైష్ణ‌వి (వైష్ణ‌వి చైత‌న్య‌) ఓ బ‌స్తీకి చెందిన అమ్మాయి. ఆమె చిన్న‌ప్ప‌టి నుంచి తన ఎదురింట్లో ఉండే ఆనంద్ (ఆనంద్ దేవ‌ర‌కొండ‌)ను ప్రేమిస్తుంటుంది. ఆ ప్రేమ‌ను ఆనంద్​ కూడా అంగీక‌రిస్తాడు. వీరి ప్రేమ పాఠశాల రోజుల్లోనే ముదురుతుంది. అయితే ప‌దో త‌ర‌గ‌తి ఫెయిల్​ కావడం వల్ల ఆనంద్ ఆటో డ్రైవ‌ర్‌గా స్థిర‌ప‌డ‌తాడు. వైష్ణవి మాత్రం ఇంట‌ర్ పూర్తి చేసి పేరున్న ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో చేరుతుంది. అక్క‌డ కొత్త ప‌రిచ‌యాల వ‌ల్ల.. వైషూ ఆలోచ‌నా విధానంలో మార్పులు మొద‌లై.. ఈ క్ర‌మంలోనే ఆమె త‌న క్లాస్‌మేట్‌ విరాజ్ (విరాజ్ అశ్విన్)కు దగ్గరవుతుంది. ఈ క్ర‌మంలోనే అనుకోని ప‌రిస్థితుల వ‌ల్ల విరాజ్‌కు వైష్ణ‌వి శారీర‌కంగా ద‌గ్గ‌ర‌వ్వాల్సి వ‌స్తుంది. అయితే ఆ త‌ర్వాత ఏమైంది? వీరిద్ద‌రి వ్య‌వ‌హారం ఆనంద్‌కు తెలిసిందా? నిజం తెలిశాక ఆనంద్​ ఎలా స్పందించాడు? అన్న‌ విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

కలెక్షన్లలో దూసుకెళ్తున్న 'బేబీ'.. తొమ్మిది రోజుల్లోనే ఇన్ని కోట్లా?

13 రోజులైనా ఆగని 'బేబీ' జోరు.. ఎన్ని కోట్లు లాభం వచ్చిందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.