ETV Bharat / entertainment

ఆ కోరిక తీర్చుకున్న యాంకర్​ శ్యామల.. పల్లకిలో ఊరేగింపుగా వచ్చి.. - anchor syamala dream

యాంకర్​ శ్యామల తనకు తీరని ఓ కోరికను తీర్చుకుంది. హంసవాహనం ఆకృతిలో ఉన్న పల్లకిలో కూర్చుని ఊరేగింపుగా వచ్చి సందడి చేసింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్​ అవుతోంది.

anchor syamala
యాంకర్ శ్యామల
author img

By

Published : Sep 24, 2022, 4:18 PM IST

సామాన్యులకు ఉన్నట్టుగానే సినీ, సీరియల్‌ నటులు, వ్యాఖ్యాతలకు కూడా ఎన్నో కలలు, కోరికలు ఉంటాయి. వాటిని నెరవేర్చుకునేందుకు ఆరాటపడుతుంటారు. ఆ దిశగా ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే తాజాగా యాంకర్ శ్యామల తనకు తీరని ఓ కోరికను తీర్చుకుంది.

అదేంటంటే.. పెళ్లి విషయంలో సామాన్యులకే ఎన్నో కలలు, కోరికలు ఉంటాయి. ఇక సెలబ్రెటీలకు అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అంగరంగ వైభవంగా చేసుకుంటుంటారు. ఒకవేళ.. పెళ్లి సమయంలో ఏవైనా కోరికలు తీరకుండా ఉంటే.. ఆ తర్వాతైనా వాటిని తీర్చుకుంటారు. తాజాగా యాంకర్‌ శ్యామల కూడా అదే చేసింది. పెళ్లి వేళ తనకు తీరని ఓ కోరికను తీర్చుకుంది. దాన్ని అభిమానులతో పంచుకుంది.

యాంకర్‌ శ్యామలది ప్రేమ వివాహం. తోటి నటుడు నర్సింహ రెడ్డిని పెళ్లి చేసుకుంది. వీరికి ఓ బాబు కూడా ఉన్నాడు. వివాహ సమయంలో.. పెళ్లి కుమార్తెగా అందంగా ముస్తాబై.. పల్లకిలో ఊరేగాలని ఆమె కోరిక అంట. అయితే తమ పెళ్లి సమయంలో అది తీరలేదట. అయితే తాజాగా ఆ కోరికను తీర్చుకుంది శ్యామల. హంసవాహనం ఆకృతిలో ఉన్న పల్లకిలో కూర్చేని ఊరేగింపుగా వచ్చింది. నలుగురు మనుషులు పల్లకి మోసుకుంటూ రాగా.. దాని ముందు కొందరు డ్యాన్స్‌ కూడా చేశారు. ఆ ఊరేగింపుకు బారికేడ్లు కట్టి.. అభిమానులు ఎగబడకుండా జాగ్రత్త తీసుకున్నారు. పోలీసులు కూడా హాజరయ్యారు. ఈ వీడియో ఆమె ఇన్​స్టాలో పోస్ట్ చేయగా అది వైరల్​గా మారింది. దాన్ని మీరు చూసేయండి..

ఇదీ చూడండి: Vikram: 'రజనీకాంత్​లా కమల్​హాసన్​ మారితే ఇట్టానే ఉంటది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.