ETV Bharat / entertainment

ఎల్లలు దాటిన 'పుష్ప' క్రేజ్.. బన్నీతో సినిమాకు ఆ బాలీవుడ్​ డైరెక్టర్​ రెడీ! - అల్లు అర్జున్​పై రోహిత్​ శెట్టి

పుష్ప సినిమాతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అల్లు అర్జున్​కు. బాలీవుడ్​లో విపరీతమైన క్రేజ్​ సొంతం చేసుకున్నారు. దీంతో బన్నీతో సినిమా చేసేందుకు బాలీవుడ్​ డైరెక్టర్లు సైతం ఉవ్విళ్లూరుతున్నారు. తాజాగా ఓ బాలీవుడ్​ డైరక్టర్​ తన మనసులోని మాటను బయటపెట్టారు. ఇంతకీ ఏమన్నారంటే..

allu arjun rohit shetty
allu arjun rohit shetty
author img

By

Published : Dec 2, 2022, 10:20 PM IST

Updated : Dec 2, 2022, 10:35 PM IST

ప్రతి సినిమాతో కొత్తదనం చూపిస్తూ తనకంటూ అభిమానులను సంపాదించుకున్నాడు అల్లుఅర్జున్‌. ఇటీవల విడుదలైన పుష్ప సినిమాతో బన్నీ రేంజ్‌ పాన్‌ ఇండియా స్థాయి దాటి వెళ్లింది. ఈ ఐకాన్‌ స్టార్‌తో సినిమాలు తీసేందుకు ఇప్పుడు దర్శకులు క్యూ కడుతున్నారు. తాజాగా ఓ ప్రముఖ బాలీవుడ్‌ దర్శకుడు అల్లుఅర్జున్‌తో కలిసి పనిచేయాలని ఉందంటూ తన మనసులో మాటను బయటపెట్టాడు. దీంతో బన్నీ ఫ్యాన్స్‌ ఈ వార్తను తెగ షేర్‌ చేస్తున్నారు.

బాలీవుడ్‌ సినిమా 'సర్కస్‌' ట్రైలర్‌ విడుదల కార్యక్రమంలో ఆ సినిమా దర్శకుడు రోహిత్‌ శెట్టి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. సౌత్‌ స్టార్స్‌ గురించి మాట్లాడిన ఆయన ఎవరెవరితో సినిమా తీయాలని ఉందో పంచుకున్నారు. "నాకు దక్షిణాది స్టార్స్‌ అందరితో సినిమా తీయాలని ఉంది. మరీ ముఖ్యంగా అజిత్‌, విజయ్‌, అల్లుఅర్జున్‌, కార్తి లతో పనిచేయడం చాలా ఇష్టం" అని చెప్పారు. ఇక రోహిత్‌శెట్టి దర్శకత్వం వహించిన 'సర్కస్‌' సినిమా ట్రైలర్‌ అలరిస్తోంది. రణ్‌వీర్‌ సింగ్‌ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమాలో ఆయన సరసన పూజా హెగ్డే, జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ నటించారు. క్రిస్మస్‌ కానుకగా ఈ సినిమా డిసెంబర్‌ 23న విడుదలవ్వనుంది.

ఇవీ చదవండి : ప్రభాస్‌తో బాలయ్య 'అన్‌స్టాపబుల్'.. రెబల్​స్టార్​తో నటసింహం ఫుల్ ఫన్​!

ధరమ్​ తేజ్​ న్యూ మూవీ షురూ​.. ఓటీటీలో 'రామ్‌సేతు'.. 'ఊర్వశివో రాక్షసివో' ఎప్పుడంటే?

Last Updated : Dec 2, 2022, 10:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.