ప్రస్తుతం టాలీవుడ్ చిత్రసీమలో ఓ టాప్ డైరెక్టర్ శిష్యుల టాలెంట్ గురించే అంతా చర్చ. వారి సినిమాలు వస్తున్నాయంటే.. సినీ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంటోంది. ఆ దర్శకుడు మరెవరో కాదు లెక్కల మాస్టర్ సుకుమార్. తెలుగు చిత్రపరిశ్రమలో వివాదస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తర్వాత.. ఎక్కువ సంఖ్యలో తన శిష్యులను ప్రోత్సహించి, మద్దతుగా నిలిచి, వారిని వెనుక ఉండి నడిపిస్తన్న దర్శకుడు సుకుమారే అని చెప్పాలి! ఇప్పటికే పల్నాటి సూర్యప్రతాప్, వేమారెడ్డి, జక్కా హరిప్రసాద్, బుచ్చిబాబు సానా, శ్రీకాంత్ ఓదెల లాంటి కొత్త దర్శకులు.. సుక్కు దగ్గర రచయితలుగా, అసిస్టెంట్ డైరెక్టర్లుగా పని చేసి.. అనంతరం డైరెక్టర్లుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
వీరిలో దాదాపు అందరూ తమ తొలి చిత్రాలతోనే విజయాలు అందుకున్నారు! ముఖ్యంగా బుచ్చిబాబు 'ఉప్పెన', శ్రీకాంత్ ఓదెల 'దసరా' చిత్రాల భారీ హిట్‌ను అందుకోవడంతో.. సుక్కు శిష్యుల మీద మరింత అంచనాలు ఆడియెన్స్‌లో భారీగా పెరిగాయనే చెప్పాలి. ఎవరైనా సుక్కు దగ్గర శిష్యరికం చేసి దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడంటే.. అందరూ అతడి సినిమాను స్పెషల్ ఇంట్రెస్ట్‌తో చూస్తున్నారు. అలా ఈసారి ఇప్పుడు అందరి దృష్టి నూతన దర్శకుడు కార్తీక్ దండుపై పడింది.
ఈ శుక్రవారం(ఏప్రిల్ 21) రిలీజవుతున్న సాయి ధరమ్ తేజ్ కొత్త సినిమా మిస్టీక్ థ్రిల్లర్ 'విరూపాక్ష'తో డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు కార్తీక్ దండు. గోల్డెన్ లెగ్ హీరోయిన్ సంయుక్త మేనన్ కథానాయికగా నటిస్తోంది. అయితే ఈ కథకు సుకుమార్ స్క్రీన్ ప్లే అందించడం, నిర్మించడం మరో విశేషం. సుకుమారే స్క్రీన్ ప్లే అందించి, నిర్మిస్తున్నారంటే.. కార్తీక్ తన టాలెంట్‌తో ఆయన్ను ఆకట్టుకున్నాడనే చెప్పాలి. అందుకే ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అలాగే 'విరూపాక్ష'కు పోస్టర్స్, టీజర్, ట్రైలర్ కూడా ఆసక్తికరంగా సాగాయి. మిస్టీక్ థ్రిల్లర్‌గా ఆకట్టుకుంది. దీంతో డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలు చూసే ఆడియెన్స్.. ఈ మూవీపై బాగా ఆసక్తి చూపిస్తున్నారు. మరి ట్రైలర్‌తో రేకెత్తించిన ఆసక్తి.. సినిమాలో కూడా ఉంటుందా?, ఆడియెన్స్ సినిమా చూస్తున్నంత సేపు.. అదే ఉత్కంఠ ఉంటుందా లేదా అనేది ఇక తెరపై చూడాల్సిందే.
ఏదేమైనప్పటికీ రిలీజ్‌కు ముందు బజ్ పర్వాలేదనిపిస్తున్నప్పటికీ.. సినిమా మొదటి రోజు టాక్ పాజిటివ్‌గా ఉంటే.. మెల్లగా ఊపందుకునే అవకాశం ఉంటుంది. అనుకున్నట్టే ఈ చిత్రం హిట్ అయితే.. మరో సుకుమార్ శిష్యుడు గ్రాండ్ డెబ్యూ ఇచ్చినట్టవుతుంది. దీంతో ఇండస్ట్రీలో హీరోలు, నిర్మాతలు వారితో పని చేసేందుకు ఆసక్తి చూపిస్తారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: వీకెండ్ ఆగయా.. ఒక్కరోజే OTTలోకి 25 చిత్రాలు.. మరి మీరేం చూస్తారు?