Regina cassandra Alitho saradaga: గ్లామర్ పాత్రలో సూపర్ అనిపించుకున్న తమిళ అమ్మాయి, పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్‌లో శెభాష్ అనిపించుకుని, చిన్నవయసులో యాంకరింగ్‌గా కెరీర్ ప్రారంభించి, నటిగా 30కు పైగా సినిమాల్లో స్టార్స్ సరసన హీరోయిన్గా నటించి, వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకెళ్తు గార్జియస్ బ్యూటీ కథానాయిక రెజీనా. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఆలీతో సరదాగా కార్యక్రమానికి విచ్చేసి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. గతంలో ఓ సారి తాను గర్భవతి అని అబద్ధం చెప్పిన సరదా సంఘటనను గుర్తుచేసుకుంది. ఆ సంగతులివీ..
ప్రెగ్నెన్సీ అని అబద్ధం చెప్పా.. రాత్రి 11 గంటల సమయంలో మిస్టీ దోయ్ స్వీట్ బాగా తినాలనిపించింది. కావాలి కావాలి అనిపించింది. ఎక్కడ దొరుకుతుందోనని బయటకు వెళ్లా. ఓ షాపు ఉంది. అక్కడికి వెళ్లి అడిగితే దుకాణం కట్టేస్తున్నారని యజమాని చెప్పారు. దీంతో నేను 'సార్ సార్ నేను ప్రెగ్నెంట్.. తినాలని ఉందని' ఆయనకు అబద్ధం చెప్పాను. ఆ సమయంలో అతడికి అబద్ధం చెప్పడం తప్పలేదు. అలా స్వీట్ తినేశా.
అలా చూస్తే సహించలేను.. అప్పుడు ఓ వ్యక్తిని నేను కొట్టడం తొలిసారి ఏమీ కాదు. ఆగ్రాలో చిన్న చిన్న గొందులు ఉంటాయి. అదే సమయంలో అక్కడ షూట్ చేసేటప్పుడు కెమెరాకు ఓ కుక్క అడు వచ్చింది. అది చిన్నగా నడుస్తూ వెళ్తోంది. ఓ వ్యక్తి అక్కడికి వచ్చి దాన్ని బలంగా కాలితో కొట్టాడు. అది చూసి నేను తట్టుకోలేకపోయాను. బాగా కోపం వచ్చేసింది. నాలో ఫైర్ బయటకు వచ్చింది. అతడిని బలంగా కొట్టేశా.
ప్రయోగాలు అంటే చాలా ఇష్టం.. ప్రయోగాలు చేయడమంటే చాలా ఇష్టం. అందుకే 'అ!' సినిమాలో నటించా. అలాంటి పాత్రలు వస్తే చేసేస్తా. అలానే హిందీ సినిమాలో నటించే అవకాశం వచ్చింది కానీ అది జరగలేదు. ఇక ఐఫా వేడుకలో ఓ సారి నేను వేసుకున్న డ్రెస్ చూసి హిందీ సినిమా ఆఫర్ వచ్చింది. కానీ ఆ తర్వాత అది కుదరలేదు.
అందుకే ఈ పేరు పెట్టుకున్నా.. దీంతోపాటే ఆరేళ్ల వయసులో తన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. అమ్మ క్రిస్టియన్, తండ్రి ముస్లిం. అందుకే ఇద్దరి కోసం రెజీనా కాసాండ్రా అనే రెండు పేర్లు పెట్టుకున్నా. ఇక సినిమా విషయానికొస్తే.. తెలుగులో కాలేజ్‌లో ఉన్నప్పుడు కన్నడలో నటించేందుకు ఓ సారి ప్రయత్నించా. చదువు, యాక్టింగ్‌ను బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. కానీ యాక్టింగ్, డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. కాలేజ్ చదివే రోజుల్లో ఎన్నో షార్ట్‌ఫిల్మ్‌లో నటించా. అందులోని ఓ షార్ట్‌ఫిల్మ్ వైరల్ అయింది. అది చూసి ఎస్ఎమ్ఎస్ సినిమా ఆడిషన్‌కు పిలిచారు. అప్పుడే శేఖర్ కమ్ముల లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కోసం పిలిచారు. అప్పుడు నేను ఎస్ఎమ్ఎస్ను ఎంచుకున్నా.
ఇదీ చూడండి: గుండెపోటుపై స్పందించిన హీరో విక్రమ్.. ఏమన్నారంటే..