ETV Bharat / entertainment

ఆ క్యాబ్​ డ్రైవర్​తో 'జాతి రత్నాలు' బ్యూటీ ఫరియా లవ్​ స్టోరీ! - ali tho saradaga latest episode

'జాతి రత్నాలు' చిత్రంతో హీరోయిన్​గా పరిచయమైన తెలుగు అందం ఫరియా అబ్దుల్లా. అందం, అభినయంతో మాత్రమే కాదు.. కామెడీ టైమింగ్​తో ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తోంది ఈ భామ. ఈటీవీలో ప్రసారమయ్యే 'ఆలీతో సరదాగా'కు ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి క్యాబ్​ డ్రైవర్​తో ప్రేమ కథ, సూపర్‌ మార్కెట్లో చోరీ వంటి ఆసక్తికర సంఘటనలను పంచుకుంది. అవి ఆమె మాటల్లోనే..

alitho saradaga latest episode with santosh shoban and faria abdullah

author img

By

Published : Nov 2, 2022, 5:54 PM IST

Updated : Nov 3, 2022, 11:17 AM IST

Ali Tho Saradaga Fariya Abdullah: 'చిట్టి నీ నవ్వుంటే లక్ష్మీ పటాసే' అంటూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న హైదరాబాదీ బ్యూటీ ఫరియా అబ్దుల్లా. తొలి చిత్రం 'జాతి రత్నాలు'లో తన నటనతో సినీ ప్రేక్షకులను ఫిదా చేసింది. ఆ తర్వాత 'బంగార్రాజు' మూవీలో ఐటమ్​ సాంగ్​తో కుర్రకారును ఉర్రూతలూగించింది. ఇలా తక్కువ సమయంలో హీరోయిన్​గా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఈ బ్యూటీ... తాజాగా హీరో సంతోష్​​ శోభన్​తో 'లైక్​ షేర్​ అండ్​ సబ్​స్క్రైబ్'​లో నటించింది. ఈటీవీలో ప్రసారమయ్యే ప్రముఖ సెలబ్రెటీ టాక్​ షో 'ఆలీతో సరదాగా'కు ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి పలు ఆసక్తికర విశేషాలను పంచుకుంది.

చిట్టితో క్యాబ్ డ్రైవర్ ప్రేమ కథ!
ఈ సందర్భంగా ఓ ఫన్నీ ఇన్సిడెంట్​ను ఫరియా షేర్​ చేసుకుంది. "ఒకసారి నేను క్యాబ్​లో వెళ్తున్నప్పుడు మాస్క్​ ఉండడం వల్ల నన్ను ఆ క్యాబ్​ డ్రైవర్​ గుర్తుపట్టలేకపోయాడు. కానీ అతడు చాలా బాధలో ఉన్నాడు. ఏమైందని అడిగితే కారు డ్రైవ్​ చేస్తున్నప్పుడు చాలా సౌండ్​ వస్తుందని చెప్పాడు. మీ కారు కోపంలో ఉందని నేను చెప్పా. మీరు ఎవరికైనా కారు ఇచ్చారా? అని అడిగా. అవును అన్నాడు. ఎప్పుడైనా క్యాబ్​లో ఒంటరిగా వెళ్తే డ్రైవర్​తోనే అలా మాట్లాడుతుంటా. ఆ సంభాషణలో తన కారు పేరు చిట్టి అని చెప్పాడు. ఎందుకు ఆ పేరే పెట్టారని అడిగితే తన చిన్నప్పుడు క్రష్​ పేరు చిట్టి.. అందుకే పెట్టాను అని అన్నాడు. వెంటనే నేను నా పేరు కూడా చిట్టి అన్నా. ఒక్కసారిగా నన్ను గుర్తు పట్టి చాలా హ్యాపీగా ఫీలయ్యాడు. ఒక్క సెల్ఫీ అడిగితే ఇచ్చా."

సూపర్‌ మార్కెట్లో చోరీ కథ..
ఓ సూపర్​ మార్కెట్లో దొంగతనం చేశావంట కదా అని అలీ అడగ్గా.. ఆమె ఇలా సమాధాన మిచ్చింది."చిన్నప్పుడు ఫ్రెండ్స్‌ అందరం కలిసి అనుకున్నాం. సూపర్‌ మార్కెట్‌కు వెళ్లి చిప్స్ పాకెట్స్‌, చాక్లెట్స్‌ తీసుకొని బ్యాగ్‌లో పెట్టుకుని వచ్చేద్దాం అనుకున్నాం. నేను చాక్లెట్‌ తీసుకుని వచ్చేశాను. మా ఫ్రెండ్స్‌ దొరికిపోయారు. "

జాతిరత్నాలు షూటింగ్‌లో డైరెక్టర్‌తో గొడవపై క్లారిటీ!
జాతిరత్నాలు షూటింగ్‌లో డైరెక్టర్‌తో ఫరియాకు గొడవ జరిగినట్లు అప్పట్లో ఊహాగానాలు వచ్చాయి. వాటిపై ఫరియా క్లారిటీ ఇచ్చింది. "డైరెక్టర్ అనుదీప్​కు ఒక మేనరీజం ఉంది.. ఏదైనా జోక్ విన్నా.. చెప్పినా పక్కన నవ్వుతూ పక్కవాళ్లను కొడుతుంటారు. షూటింగ్ సమయంలో అనుదీప్ అందరితో చాలా ఫన్నీగా ఉంటారు. ఎప్పుడూ ఏదో ఒక జోక్ వేస్తూ అందరినీ నవ్విస్తుంటారు. జాతిరత్నాలు మూవీ షూటింగ్ సమయంలో ఆయన ఒక జోక్ వేశారు.. ఆ సమయంలో పక్కన నేను ఉన్నాను.. నన్ను చేత్తో అలా అన్నారు.. దాన్ని చూసి అందరూ వేరే రకంగా ఊహించుకున్నారు. ఇది జస్ట్ ఫన్నీగా జరిగింది.. అంతే" అంటూ క్లారిటీ ఇచ్చింది. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో నటించాలని ఉందని తన మనసులోని కోరిక బయట పెట్టింది ఫరియా అబ్దుల్లా.

ఇవీ చదవండి: మ్యూజిక్ డైరెక్టర్ దేవీ శ్రీ ప్రసాద్‌పై కేసు నమోదు.. ఎందుకంటే?

తెలుగులోకి మరో డబ్బింగ్‌ చిత్రం.. 'కాంతారా'లా హిట్​ అవుతుందా?

Last Updated : Nov 3, 2022, 11:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.