ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ కథానాయకుడిగా పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ఆదిపురుష్. ఈ సినిమా విడుదల వాయిదా పడిందంటూ వార్తలు వచ్చాయి. రూ. 100 కోట్లతో గ్రాఫిక్స్‌పై ఫోకస్ చేసినట్లు సోషల్ మీడియా కోడై కూసింది. వీటన్నిటికీ తెరదించుతూ చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన వెలువరించింది.
"దిపురుష్ అనేది సినిమా కాదు. శ్రీరాముడిపై భక్తి, సంస్కృతి, చరిత్రలపై మనకున్న నిబద్ధతకు నిదర్శనం. ప్రేక్షకులకు పూర్తి విజువల్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేందుకు మా టీమ్‌కు మరింత సమయం అవసరం. ఇండియా గర్వపడే చిత్రం తీసేందుకు మేము పట్టుదలతో ఉన్నాం. ఆదిపురుష్ 16 జూన్ 2023 కి విడుదల అవుతుంది" అని దర్శకుడు ఓం రౌత్ ప్రకటన విడుదల చేశారు.
రామాయణాన్ని ఆధారంగా చేసుకుని 'ఆదిపురుష్' చిత్రాన్ని రూపొందించారు. సుమారు రూ.300 కోట్ల బడ్జెట్‌తో దీన్ని తెరకెక్కించినట్లు సమాచారం. రాముడి పాత్రలో ప్రభాస్, సీతగా కృతిసనన్, రావణాసురుడిగా సైఫ్ అలీఖాన్ నటించారు. అయితే, దసరా కానుకగా విడుదలైన ఈ సినిమా టీజర్‌పై సినీ ప్రియుల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. నటీనటుల లుక్స్, వీఎఫ్‌ఎక్స్ వర్క్ అసలేం బాలేదని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మరోసారి వీఎఫ్‌ఎక్స్ పనులపై చిత్రబృందం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 'ఆదిపురుష్' సంక్రాంతి బరి నుంచి వైదొలిగింది.
ఇదీ చదవండి: బాత్ టబ్‌లో విగతజీవిగా సింగర్.. ఏం జరిగింది?
'ఒకప్పుడు సౌత్ సినిమాలు చూసి ఉత్తరాది వాళ్లు ఎగతాళి చూసేవారు.. రాను రాను వాళ్లే..'