తెలంగాణలో 21కి చేరిన కరోనా బాధితులు - Telangana Corona Positive Cases
తెలంగాణ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కొవిడ్-19 వైరస్ సోకిన వారి సంఖ్య ఇవాళ్టికి 21కి చేరింది.
![తెలంగాణలో 21కి చేరిన కరోనా బాధితులు 21 corona positive cases in telanagana](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6491114-670-6491114-1584785266821.jpg?imwidth=3840)
తెలంగాణ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కొవిడ్-19 వైరస్ సోకిన వారి సంఖ్య ఇవాళ్టికి 21కి చేరింది. యూఎస్‌కు చెందిన క్రూజ్ లాన్సర్‌లో పనిచేసే 33 ఏళ్ల యువకుడు ఇటీవల దుబాయ్ నుంచి వచ్చాడు. అతనికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది.
హైదరాబాద్‌లో అతనికి సన్నిహితంగా ఉన్న మరో వ్యక్తికి కూడా వైరస్ సోకిందని వైద్య పరీక్షలో తేలింది. వీరిద్దరిని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వైరస్ వ్యాప్తి కట్టడికి రేపు జనతా కర్ఫ్యూకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ప్రకటించింది. ఉదయం 6 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 6 గంటల వరకు 24 గంటలు కర్ఫ్యూ ఉంటుందని... ఇందుకు ప్రజలు సహకరించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.