వరదల సమయంలో బాధితులను ఆదుకోవటంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. మంత్రులు ఎవరూ వారి వారి ప్రాంతాల్లో పర్యటించిన దాఖలాలు లేవన్నారు. కేంద్ర ప్రభుత్యం రాష్ట్రాన్ని అదుకుంటామని చెప్పిన తర్వాతే ముఖ్యమంత్రి జగన్ మేల్కొన్నారని దుయ్యబట్టారు.
తిరుమల బాండ్లుపై వివాదం చెలరేగితే.. భాజపా ఆందోళనతో వైకాపా ఉపసంహరించుకుందని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. బీసీల కార్పొరేషన్ పేరుతో వైకాపా రాజకీయ నిరుద్యోగులకు పదవులు ఇచ్చారని ఆరోపించారు.
ఇదీ చదవండి: ఆశల పునాదికి సమాధి... ఐదేళ్లలో అంతా ఆవిరి!