ETV Bharat / business

ఎయిర్​ ఇండియాలో విస్తారా ఎయిర్​లైన్స్​ విలీనం - ఎయిర్​ ఇండియా సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌

ప్రముఖ విమానయాన సంస్థ 'విస్తారా'.. టాటా గ్రూప్‌ యాజమాన్యంలోని 'ఎయిర్‌ ఇండియా'లో విలీనం కానున్నట్లు సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రకటించింది.

vistara airlines merge to air india
విస్తారా ఎయిర్​లైన్స్
author img

By

Published : Nov 29, 2022, 6:02 PM IST

Updated : Nov 30, 2022, 12:30 PM IST

ప్రముఖ విమానయాన సంస్థ 'విస్తారా'.. టాటా గ్రూప్‌ యాజమాన్యంలోని 'ఎయిర్‌ ఇండియా'లో విలీనం కానున్నట్లు సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రకటించింది. విస్తారా ఎయిర్‌లైన్స్‌లో టాటా గ్రూప్‌నకు 51శాతం వాటాలు ఉండగా.. మిగిలిన 49శాతం వాటా సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ వద్ద ఉంది. విలీనం ప్రక్రియ పూర్తైతే, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌కు.. ఎయిర్‌ ఇండియాలో రూ.2,058 కోట్ల పెట్టుబడి దక్కుతుంది. అంటే ఎయిర్ ఇండియాలో.. సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ 25శాతం వాటాను కలిగి ఉండనుంది. ఈ విలీన ప్రక్రియను 2024మార్చి కల్లా పూర్తి చేయాలని సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌, టాటా గ్రూప్‌లు నిర్దేశించుకున్నట్లు తెలుస్తోంది.

ఎయిర్​ ఇండియాను ప్రపంచ స్థాయి విమానయాన సంస్థగా మార్చే ప్రయాణంలో విస్తారాతో ఈ ఒప్పందం జరిగినట్లు టాటా సన్స్​ ఛైర్మన్​ ఎన్​. చంద్రశేఖరన్​ తెలిపారు. దీనిలో భాగంగా ఎయిర్​ ఇండియా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టి, కచ్చితమైన సమయపాలన పాటించనున్నట్లు ప్రకటించారు. భద్రతను మరింతగా మెరుగుపరుస్తున్నట్లు వెల్లడించారు. అతితక్కువ ధరకు దేశీయ, అంతర్జాతీయ సేవలు అందించనున్నట్లు తెలిపారు. ఈ విలీనంతో టాటా గ్రూప్​తో సింగపూర్​ ఎయిర్​లైన్స్​ బంధం మరింత బలపడతుందని ఎస్​ఐఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గోహ్ చూన్ ఫాంగ్ అన్నారు.
గత ఎనిమిదేళ్లలో విస్తారా చాలా సాధించిందని ఎయిర్​ ఇండియా సీఈఓ క్యాంప్​బెల్​ విల్సన్​ చెప్పారు. ఈ విలీన ప్రక్రియతో ఎయిర్ ఇండియా మరింత బలోపేతం అవుతుందని క్యాంప్​బెల్​ ధీమా వ్యక్తం చేశారు. రెగ్యులేటరీ అనుమతులకు లోబడి.. విలీనం ప్రక్రియ మార్చి 2024 నాటికి పూర్తవుతుందని భావిస్తున్నామన్నారు.

ఎయిర్​ ఇండియా, సింగపూర్​ ఎయిర్​ లైన్స్​ కలిసి.. 2015లో విస్తారా ఎయిర్​లైన్స్​ను ప్రారంభించాయి. ప్రస్తుతానికి 43 జాతీయ, అంతర్జాతీయ గమ్యస్థాలను కలుపుతోంది. ప్రతిరోజూ 260 కంటే ఎక్కువ విమానాలను నడుపుతోంది. ఇందులో 4,700 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. విస్తారా అక్టోబర్​ నాటికి 9.2శాతం వాటాతో దేశంలో రెండో అతిపెద్ద క్యారియర్​గా నిలిచింది.

ప్రస్తుతానికి నాలుగు విమానయాన సంస్థలు టాటా గ్రూప్​ చేతుల్లో ఉన్నాయి. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్, ఎయిర్ ఏషియా ఇండియా, విస్తారా ఎయిర్​లైన్స్​ వారి అధీనంలో ఉన్నాయి. ఈ ఒప్పందంతో టాటా గ్రూపు భారతదేశంలో అతిపెద్ద క్యారియర్​ సంస్థగా మారనుంది. 218 విమానాలతో భారతదేశంలో అతిపెద్ద అంతర్జాతీయ క్యారియర్​, రెండో అతిపెద్ద దేశీయ క్యారియర్​గా మారుతుంది.

ఇవీ చదవండి:

భారత్​లో మరో వ్యాపారం బంద్.. అమెజాన్​కు ఏమైంది?

'50 కోట్ల యూజర్ల వాట్సాప్ డేటా లీక్..​ ఆ వార్తలన్నీ అవాస్తవం'

Last Updated : Nov 30, 2022, 12:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.