Upcoming Cars In 2024 : కార్ లవర్స్ అందరికీ గుడ్ న్యూస్. 2024లో ఇండియన్ మార్కెట్లో టాప్ బ్రాండెడ్ కార్స్ లాంఛ్ కానున్నాయి. వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
1. New Gen Maruti Suzuki Swift
భారత ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి.. 2024 ఫిబ్రవరిలో న్యూ జనరేషన్ మోడల్ Swift కారును లాంఛ్ చేసే అవకాశం ఉంది. ఈ కారులో 1.2 లీటర్ హైబ్రీడ్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చారని.. దీని ప్యూయెల్ ఎఫీషియన్సీ.. లీటర్‌కు 35 కి.మీ అని సమాచారం. అంతేకాదు ఈ అప్‌కమింగ్ కారులో పలు ఇంటీరియర్, ఎక్స్టీరియర్ మార్పులు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. బహుశా టోక్యో మోటార్ షోలో ఈ హ్యాచ్‌బ్యాక్ కారును ఆవిష్కరించే అవకాశం ఉంది.
2. New Gen Maruti Suzuki Swift Dzire
మారుతి సుజుకి కంపెనీ బహుశా 2024 మార్చిలో ఈ స్విఫ్ట్ డిజైర్ కారును లాంఛ్ చేసే అవకాశం ఉంది. దీనిలో 1.2 లీటర్ హైబ్రీడ్ ఇంజిన్ ఏర్పాటుచేయనున్నట్లు తెలుస్తోంది. ఈ కారు కూడా మారుతి స్విఫ్ట్ తరహా డిజైన్‌ను కలిగి ఉంటుందని సమాచారం.
3. Maruti Suzuki 7 Seater SUV
ఈ మారుతి ఎస్‌యూవీని 2024 అక్టోబర్‌లో విడుదల చేసే అవకాశం ఉంది. Grand Viatra బేస్ మోడల్ ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ ఎస్యూవీ కారు.. టాటా సఫారీ, ఎంజీ హెక్టార్ ప్లస్, హ్యుందాయ్ అల్కాజర్, మహీంద్రా ఎక్స్‌యూవీ700తో నేరుగా పోటీ పడనుంది.
4. Toyota Taisor (Fronx Based Subcompact SUV)
టయోటా టైసర్ 2024 ఫిబ్రవరిలో లాంఛ్ అయ్యే అవకాశం ఉంది. ఈ కారులో 1.2 లీటర్ K12C ఇంజిన్ అమరుస్తున్నారు. ఇది పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లతో వస్తుంది. అలాగే 1.0 లీటర్ బూస్టర్‌జెట్ టర్బో పెట్రోల్ మోటార్ వేరియంట్ కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ కారులో బంపర్స్, ఫ్రంట్ గ్రిల్, అల్లాయ్ వీల్స్ డిజైన్‌లో మార్పులు చేస్తున్నట్లు తెలుస్తోంది.
5. Toyota Fortuner
భారత్ ఎస్యూవీ టయోటా ఫార్చ్యూనర్ కారుకు మంచి డిమాండ్ ఉంది. దీనిని బహుశా 2024 నవంబర్‌లో లాంఛ్ చేసే అవకాశం ఉంది. దీనిలో 2.8 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్‌ను ఏర్పాటుచేస్తున్నట్లు సమాచారం.

6. Tata Harrier Petrol
టాటా మోటార్స్ ఇటీవలే హారియర్ ఫేస్‌లిఫ్ట్‌ను లాంఛ్ చేసింది. కానీ పెట్రోల్ ఇంజిన్ వేరియంట్‌ను మాత్రం అందుబాటులోకి తీసుకురాలేదు. అయితే 2024 ఏప్రిల్‌లో టాటా హారియర్ పెట్రోల్ వేరియంట్‌ను లాంఛ్ చేస్తామని కంపెనీ వెల్లడించింది. టాటా హారియర్‌లో 1.5 లీటర్ tGDi పెట్రోల్ ఇంజిన్‌ను పొందుపరుస్తున్నారు.

7. Tata Safari Petrol
టాటా మోటార్స్ కంపెనీ.. హారియర్‌తో పాటు సఫారీ పెట్రోల్ వేరియంట్‌ను కూడా 2024 ఏప్రిల్‌లో విడుదల చేయనుంది. దీనిలో కూడా1.5 లీటర్ tGDi పెట్రోల్ ఇంజిన్‌ను పొందుపరుస్తున్నారు. ఈ ఇంజిన్ 168 bhp పవర్, 280 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. అలాగే ఇది 6 స్పీడ్ మాన్యువల్, 7 స్పీడ్ డీసీటీ గేర్ బాక్స్ అనుసంధానంతో వస్తుంది. టాటా సఫారీ కారులో 2.0 లీటర్ టర్బో డీజిల్ వేరియంట్ కూడా అందుబాటులో ఉంటుంది.

8. Tata Curvv EV
టాటా కంపెనీ ఈ న్యూ జనరేషన్ 2 ఎలక్ట్రిక్ కారును 2024 నవంబర్‌లో లాంఛ్ చేసే అవకాశం ఉంది. ఈ టాటా కర్వ్ ఈవీని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 400-500 కి.మీ రేంజ్ వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది.

9. Tata Harrier EV
2023 ఆటో ఎక్స్‌పోలో ఈ టాటా హారియర్ ఈవీని పరిచయం చేశారు. దీనిని ICE వేరియంట్ కంటే భిన్నమైన డిజైన్‌తో రూపొందించడం జరిగింది. ఈ కారులో డ్యూయెల్ మోటార్ ఏడబ్ల్యూడీ సెటప్ ఉంటుంది. బహుశా ఈ టాటా హారియర్ ఈవీ కారును 2024 మార్చిలో లాంఛ్ చేయవచ్చు.

10. Tata Punch EV
టాటా మోటార్స్ ఇండియన్ మార్కెట్లో విడుదల చేస్తున్న నాల్లో ఈవీ కారు ఇది. దీనిలో 30kWh సామర్థ్యం గల బ్యాటరీని అమర్చారు. దీనిని ఫుల్ ఛార్జ్ చేస్తే 300 కి.మీ వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. బహుశా ఈ టాటా పంచ్ ఈవీని 2024 ఫిబ్రవరిలో విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.

11. Honda Sub 4 Meter SUV
హోండా కంపెనీ 2030లో 5 సరికొత్త ఎస్‌యూవీలను లాంఛ్ చేస్తామని ప్రకటించింది. అందులో భాగంగా 2024 సెప్టెంబర్‌లో హోండా సబ్ 4 మీటర్ ఎస్‌యూవీని ఇండియన్ మార్కెట్లో లాంఛ్ చేయనుంది. ఈ కారు దాదాపు 4 మీటర్ల పొడవుతో, ఎలివేట్ డిజైన్‌తో, ADAS టెక్‌తో వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
12. New Gen Honda Amaze
ఈ కాంపాక్ట్ సెడాన్ 2024 ఏప్రిల్‌లో ఇండియన్ మార్కెట్లో లాంఛ్ అయ్యే అవకాశం ఉంది. దీనిలో 1.2 లీటర్ i-VTEC ఇంజిన్ అమర్చారు. ఇది 90 bhp పవర్, 110 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ న్యూ జెన్ హోండా అమేజ్ కారు ADAS టెక్‌తో రానుంది.
13. Mahindra Thar 5 Door
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా & మహీంద్రా 2024 ఆగస్టులో థార్ 5 డోర్ కారును భారత మార్కెట్లో లాంఛ్ చేయనుంది. స్కార్పియో ఎన్ మోడల్లోని ఇంజిన్నే దీనిలోనూ పొందుపరిచారు. ఈ థార్ కారు 2.2 లీటర్ mHawk డీజిల్, 2.0 లీటర్ mStallion పెట్రోల్ ఇంజిన్ వేరియంట్లలో లభిస్తుంది. దీనిలో 5 డోర్లు ఉంటాయి. పైగా విశాలమైన బుట్ స్పేస్ కూడా ఇందులో ఉంటుంది.

14. Mahindra XUV300 Facelift
మహీంద్రా ఎక్స్‌యూవీ 300 ఫేస్‌లిఫ్ట్‌ను 2024 ఫిబ్రవరిలో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నయా కారులోని క్యాబిన్, డ్యాష్‌బోర్డ్ లేఅవుట్, ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లేలను సరికొత్త డిజైన్‌తో తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.
15. New Mahindra XUV 500
మహీంద్రా కంపెనీ ఈ న్యూ మిడ్ సైజ్ ఎస్యూవీ500ని 2024 సెప్టెంబర్‌లో లాంఛ్ చేసే అవకాశం ఉంది. వాస్తవానికి దీనిని హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి సుజుకి గ్రాండ్ విటారాలకు పోటీగా తీసుకువస్తున్నట్లు సమాచారం. ఈ కారు సుమారుగా 4.3 మీటర్ల పొడవు ఉంటుందని తెలియవస్తోంది.
16. Kia Sonet Facelift
కియా సోనెట్ ఫేస్‌లిఫ్ట్ 2024 ఫిబ్రవరిలో విడుదల అయ్యే అవకాశం ఉంది. ఇటీవలే పలు అంతర్జాతీయ పోర్టల్స్‌లో దీని ఫొటోలు లీక్ అయ్యాయి. వాస్తవానికి ఈ కారు ఎక్స్టీరియర్, ఇంటీరియర్స్‌లో పలు మార్పులు చేస్తున్నట్లు సమాచారం.

17. Kia EV9
ఈ ఫ్లాగ్షిప్ కియా ఎలక్ట్రిక్ ఎస్యూవీ 2023 జూన్‌లో లాంఛ్ కానుంది. ఇది మల్టిపుల్ పవర్ట్రైన్ ఆప్షన్స్‌తో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారులో 99.8kWh బ్యాటరీ ఉంది. దీనిని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 541 కి.మీ ప్రయాణించవచ్చుని కంపెనీ చెబుతోంది.

18. New Gen Kia Carnival (KA4)
ఈ కియా కార్నివాల్ 4 ఎంవీపీ కారును 2024 జులైలో ఇండియన్ మార్కెట్లో లాంఛ్ చేసే అవకాశం ఉంది. ఈ కారులో 2.2 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ ఉంది. ఇది 200 bhp పవర్, 440 Nm టార్క్ జనరేట్ చేస్తుంది.

19. Hyundai Creta Facelift
మోస్ట్ వెయిటెడ్ హ్యుందాయ్ క్రెటా ఫేస్‌లిఫ్ట్‌ను 2024 ఫిబ్రవరిలో లాంఛ్ చేసే అవకాశం ఉంది. దీనిలో 1.5 లీటర్ tGDi ఇంజిన్ అమర్చారు. ఇది 160 bhp పవర్, 253 Nm టార్క్ జనరేట్ చేస్తుంది.

20. Hyundai Alcazer Facelift
వాస్తవానికి హ్యుందాయ్ అల్కాజర్‌ను 2021లో లాంఛ్ చేయడం జరిగింది. అయితే దానిలో కొన్ని మిడ్-లైఫ్ అప్డేట్స్ చేస్తున్నారు. బహుశా ఈ అప్డేటెడ్ అల్కాజర్ ఫేస్‌లిఫ్ట్‌ను 2024 మార్చిలో విడుదల చేయవచ్చు.

21. Hyundai Exter EV
కొరియన్ కార్ మేకర్ హ్యుందాయ్ ఈ ఏడాది జులైలో ఎక్స్టర్ పెట్రోల్, డీజిల్ వేరియంట్లను లాంఛ్ చేసింది. వీటితో పాటు తమ ఎలక్ట్రిక్ వేరియంట్లను కూడా భారత్‌లో ప్రవేశపెట్టాలని ప్రణాళిక వేసింది. అందులో భాగంగానే 2024 నవంబర్‌లో హ్యుందాయ్ ఎక్స్టర్ ఈవీ మోడల్‌ను భారత్‌లో లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
ఈ హ్యుందాయ్ ఎక్స్టర్ ఈవీలో 25-30kWh బ్యాటరీ ఉంటుందని.. దీనిని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 300-350 కి.మీ రేంజ్ వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది.
22. Volkswagen ID 4 EV
జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ వోక్స్వ్యాగన్.. భారత్‌లో ID 4 EVని లాంఛ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ కారులోని బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 480కి.మీ ప్రయాణించవచ్చని కంపెనీ క్లెయిమ్ చేస్తోంది. ఈ ప్రీమియం కారు ధర రూ.50 లక్షల వరకు ఉంటుందని అంచనా. బహుశా దీనిని 2024 ఏప్రిల్‌లో విడుదల చేసే అవకాశం ఉంది.
23. New Volkswagen Tiguan
వ్యోక్స్వ్యాగన్ కంపెనీ ఈ టిగువాన్ కారును 2024 ఏప్రిల్‌లో లాంఛ్ చేసే అవకాశం ఉంది. ఇది మైల్డ్ హైబ్రీడ్ పెట్రోల్, టర్బో డీజిల్ వేరియంట్స్‌లో కూడా లభిస్తుంది.
24. New Gen Skoda Kodiaq
ఈ న్యూ జనరేషన్ స్కోడా కొడియాక్‌ను 2024 ఏప్రిల్‌లో ఇండియాలో విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ఎస్యూవీ ధర రూ.40 లక్షల వరకు ఉంటుంది.
