ETV Bharat / business

అలర్ట్ ​- కొత్త సిమ్​ కార్డు కొనాలా? ఈ రూల్స్​ తెలియకపోతే అంతే! - సిమ్​కార్డు కొత్త రూల్స్​

SIM Card New Rules in Telugu: కొత్త సిమ్​ కార్డుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన నూతన నిబంధనలు డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. మరి.. ఇంతకీ ఆ రూల్స్​ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం..

SIM Card New Rules in Telugu
SIM Card New Rules in Telugu
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 29, 2023, 5:30 PM IST

SIM Card New Rules Details in Telugu : మనుషుల జీవితంలో.. మొబైల్ ఫోన్ అతిముఖ్యమైన భాగంగా మారిపోయింది. అది లేకుంటే జీవితం ముందుకు సాగదు అన్నట్టుగా మారింది పరిస్థితి. ఇప్పుడు చాలా ఇళ్లలో.. కనీసం రెండుకు మించిన ఫోన్లు ఉంటున్నాయి. అవసరాలు సైతం అలాగే ఉన్నాయి! సినిమా టికెట్ నుంచి రైల్వే, విమాన టికెట్ దాకా.. ప్రభుత్వ పథకాల నుంచి బ్యాంకింగ్ దాకా.. సమస్త సేవలూ మొబైల్ కేంద్రంగానే సాగుతున్నాయి. ఇక ఆధార్ నుంచి.. పాన్​ కార్డ్​ దాకా.. ప్రతి గుర్తింపు కార్డుకూ.. మొబైల్ నెంబర్ లింక్ చేయాల్సిందే. ఇంతటి కీలకమైన సిమ్​ కార్డుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఇష్టానుసారంగా సిమ్ కార్డులు విక్రయించేవారు. అయితే.. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సిమ్ కార్డు నిబంధనల్ని కఠినతరం చేస్తోంది.

పాస్​వర్డ్​లో ఎమోజీలు వాడొచ్చా? ఎక్స్​పర్ట్స్ మాటేమిటి?

డిసెంబర్ 1, 2023 నుంచే దేశంలో SIM కార్డ్ నిబంధనలు మారిపోతున్నాయి. సిమ్ కార్డు విక్రయాల్లో సేఫ్టీ, సెక్యూరిటీని పెంచడం సహా దేశంలో విచ్చలవిడిగా పెరిగిపోతున్న నకిలీ సిమ్ మోసాలు, సైబర్ ఫ్రాడ్స్ అరికట్ట వేసేందుకు.. కేంద్ర టెలికాం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో మీరు కొత్త సిమ్ కార్డు కొనాలనుకుంటున్నట్లయితే.. మారుతున్న నిబంధనల గురించి తప్పక తెలుసుకోవాలి.

కస్టమర్లు, డీలర్లు ఈ పని చేయాలి:

  • ఒక వ్యక్తి ఒక ఐడీపై గరిష్టంగా 9 సిమ్ కార్డుల్ని పొందేందుకు అర్హత ఉంటుంది.
  • ఎవరి సిమ్ కార్డు సేవలనైనా పూర్తిగా నిలిపివేస్తే.. 90 రోజుల వ్యవధి తర్వాతే ఆ నంబర్ మరొక వ్యక్తికి ఇస్తారు.
  • కస్టమర్లు సిమ్ కార్డుల్ని కొనుగోలు చేసే సమయంలో.. ఆధార్ స్కానింగ్ సహా డెమోగ్రాఫీ డేటా సేకరిస్తారు.
  • డిసెంబర్ 1 నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయి.
  • కొత్త నిబంధనలను అంగీకరించి సిమ్ విక్రయాలు జరిపేందుకు.. డీలర్లు నవంబర్ 30 లోపు నమోదు చేసుకోవాలి.

మీ​ ఫోన్​లో ఈ సీక్రెట్ కోడ్స్​ ఎంటర్ చేస్తే - మీరు ఊహించని సమాచారం వస్తుంది!

నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా:

కేంద్రం రూల్స్ విషయంలో చాలా కఠినంగా ఉండబోతోంది. ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారికి.. జరిమానా, జైలు వంటి కఠిన శిక్షలు వేసేందుకు కూడా సిద్ధమవుతోంది. ఈ మేరకు ప్రభుత్వం నిబంధనలు అమలు చేయనుంది. వాస్తవానికి.. ఈ కొత్త రూల్స్ అక్టోబర్ 1 నుంచే అమలు చేయాలని యోచించినప్పటికీ.. నిర్ణయం 2 నెలల పాటు వాయిదా పడింది. మొత్తానికి.. డిసెంబర్ 1 నుంచి అమలు చేయాలని సర్కారు నిర్ణయించింది.

సిమ్ కార్డుల్ని విక్రయించే డీలర్లు.. ముందుగానే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వీరి పోలీస్ వెరిఫికేషన్ బాధ్యత ఆయా టెలికాం ఆపరేటర్లపైనే ఉంటుంది. ఇవి పాటించకపోతే.. రూ.10 లక్షల వరకు జరిమానా విధిస్తారు. అంటే సిమ్ కార్డులు విక్రయించే షాపులకు వెళ్లి.. ఆయా నెట్‌వర్క్ సంస్థలు కేవైసీ వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుందన్నమాట.

రూ.15వేలకే ల్యాప్​టాప్​ - 'క్లౌడ్'​తో రిలయన్స్ జియో మేజిక్ - మార్కెట్లోకి ఎప్పుడు వస్తుందంటే?

నిద్రపోతున్నప్పుడు స్మార్ట్ వాచ్ ధరించడం డేంజరా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.