ETV Bharat / business

Maruti Suzuki Swift Unveiled : 40 కి.మీ మైలేజ్​తో నయా మారుతి స్విఫ్ట్.. టోక్యో మోటార్​షోలో అన్​వీల్​! - Maruti Suzuki Swift engine specs

Maruti Suzuki Swift Unveiled : మారుతి సుజుకి కంపెనీ టోక్యో మోటార్​ షోలో.. ఫోర్త్​ జనరేషన్​ స్విఫ్ట్​ కారును ప్రదర్శించింది. 2024లో దీనిని ఇండియన్ మార్కెట్​లో లాంఛ్ చేసే అవకాశం ఉంది. మరి ఈ నయా స్విఫ్ట్ కారు ఫీచర్స్​, స్పెసిఫికేషన్స్​పై ఓ లుక్కేద్దామా?

Maruti Suzuki Swift features
Maruti Suzuki Swift Unveiled
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 25, 2023, 2:16 PM IST

Maruti Suzuki Swift Unveiled : దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి బుధవారం టోక్యో మోటార్​ షోలో.. 'ఫోర్త్ జనరేషన్​ స్విఫ్ట్ ' కారును ప్రదర్శించింది. వచ్చే ఏడాది దీనిని భారత మార్కెట్​లో విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.

టోక్యో మోటార్​ షోలో..
4th Gen Suzuki Swift Unveiled : మారుతి సుజుకి స్విఫ్ట్​ కార్లు ఇప్పటికే.. మంచి పనితీరుతో, సూపర్​ మైలేజీతో వినియోగదారుల మనస్సులను కొల్లగొట్టాయి. అందుకే ఈ మోడల్​ కార్లకు భారత్​లో మంచి డిమాండ్​ ఉంది. దీనిని క్యాష్ చేసుకునేందుకే మారుతి సుజుకి.. తమ లేటెస్ట్ ఫోర్త్​ జనరేషన్​ స్విఫ్ట్ కారును.. టోక్యో మోటార్​ షోలో అధికారికంగా ప్రదర్శించింది. వచ్చే ఏడాది దీనిని లాంఛ్ చేసే అవకాశం ఉంది. అయితే దీనిపై కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

మారుతి సుజుకి స్విఫ్ట్​​ ఫీచర్స్​?
Maruti Suzuki Swift Features : ఈ సరికొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ కారును.. పాత మోడళ్ల కంటే మంచి లుక్​తో, స్టైలిష్ డిజైన్​తో రూపొందించినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ కారులో కొత్తగా బ్లాక్​-కలర్డ్​ గ్రిల్స్​, స్వెప్ట్​బ్యాక్​ ఎల్​ఈడీ హెడ్​ల్యాప్స్​, ఎల్​-షేప్​ ఎల్​ఈడీ డీఆర్​ఎల్స్​, పియానో బ్లాక్​ ఓవీఆర్​వీ ఉన్నాయి. కారు వెనుక భాగంలో.. టెయిల్​ ల్యాంప్​లతో కూడిన ఇంటిగ్రేటెడ్​ స్పాయిలర్​లు కనిపిస్తున్నాయి.

ఈ నయా స్విఫ్ట్ కారు ముందు భాగం దాదాపు పాత మోడల్స్ లానే సిగ్నేచర్​ స్టైలింగ్​లో ఉంది. కానీ ఎడ్జ్​ లుక్స్​, కాస్మోటిక్ ఛేంజస్​ స్పష్టంగా కనిపిస్తున్నాయి. కారు ఇంజిన్ విషయానికి వస్తే.. దీనిలో 1.2 లీటర్ త్రీ-సిలిండర్ స్ట్రాంగ్​ హైబ్రీడ్​ పెట్రోల్ ఇంజిన్​ను అమర్చారు. దీని ఫ్యూయెల్ ఎకానమీ 35 కి.మీ నుంచి 40 కి.మీ ఉండవచ్చు.

కారు లోపల ఏలా ఉండొచ్చు?
Maruti Suzuki Swift Interior Design : మారుతి సుజుకి స్విఫ్ట్​ కారు లోపల వైర్​లెస్​ యాపిల్​ కార్​ప్లే, ఆండ్రాయిడ్​ ఆటో కనెక్టివిటీతో కూడిన 9 అంగుళాల ఫ్లోటింగ్​ టచ్​స్క్రీన్ ఇన్ఫోటైన్​మెంట్ సిస్టమ్ ఉంది. అలాగే స్టార్ట్​/స్టాప్ పుష్​ బటన్​, సరికొత్త ఎయిర్​ కండిషనింగ్​ వెంట్స్​, టోగిల్ కంట్రోల్స్, న్యూ క్లైమేట్ కంట్రోల్​ డిస్​ప్లే, సెమీ-డిజిటల్ ఇన్​స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. అలాగే దీనిలో వైర్​లెస్​ ఛార్జింగ్​, 360 డిగ్రీ కెమెరా సహా పలు అడ్వాన్స్​డ్​ మోడ్రన్ ఫీచర్స్​ పొందుపరిచే అవకాశం ఉంది. వాస్తవానికి కంపెనీ తన ఈ నయా కారులో పొందుపరిచిన ఫీచర్ల గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. బహుశా త్వరలోనే వీటిని వెల్లడించే అవకాశం ఉంది.

Best Cars Under 7 Lakhs : పండుగకు కారు కొనాలా?.. రూ.7 లక్షల బడ్జెట్​లో బెస్ట్ కార్స్​ ఇవే!.. సూపర్​ డిస్కౌంట్స్ కూడా ఉన్నాయ్​!

How To Change Train Journey Date : ట్రైన్​ జర్నీ​ తేదీ మార్చాలా?.. పై క్లాస్​కు అప్​గ్రేడ్ కావాలా?.. ఈ సింపుల్ స్టెప్స్​ ఫాలో అవ్వండి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.