ETV Bharat / business

బంగారం కొంటున్నారా? బిల్లు తీసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించకపోతే అంతే! - BIS Care యాప్​

Keep these Things in Mind While Taking the Gold Bill: బంగారం.. ఈ పేరు వింటేనే మహిళల పెదవుల్లో చిరునవ్వు విరబూస్తుంది. ఫంక్షన్​ ఏదైనా.. మెడలో గోల్డ్​ ఉండాల్సిందే. అందుకే ప్రతి ఒక్కరూ ఎంతో కొంత బంగారం కొనుగోలు చేస్తారు. అయితే.. గోల్డ్ కొనుగోలు చేస్తున్న సమయంలో కొన్ని విషయాలు తప్పక తెలుసుకోవాలి.

Keep these Things in Mind While Taking the Gold Bill

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 1, 2023, 12:34 PM IST

Keep these Things in Mind While Taking the Gold Bill: బంగారం అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు? నూటికి 99 మంది మహిళా మణులు ఆభరణాలు ధరించడాన్ని ఇష్టపడతారు. అందుకే.. ఆర్థిక శక్తిని బట్టి బంగారాన్ని కొనుగోలు చేస్తుంటారు. అయితే.. దుకాణాలకు వెళ్లి నచ్చిన నగలు కొనుగోలు చేయడమే కాదు.. బిల్లు తీసుకుంటున్నప్పుడు అప్రమత్తంగా వ్యవహరించడం కూడా ముఖ్యమే. లేదంటే.. తర్వాత ఇబ్బంది పడాల్సి రావొచ్చు. మరి.. ఆ వివరాలేంటో ఇప్పుడ చూద్దాం.

బిల్లులో తప్పనిసరిగా ఉండాల్సిన అంశాలు..

  • బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం.. రిటైలర్/ఆభరణాల వ్యాపారి నుంచి హాల్‌మార్క్ ఉన్న ఇన్‌వాయిస్‌ను పొందడం అవసరం. ఏదైనా వివాదం/దుర్వినియోగం/ఫిర్యాదు కోసం ఇది అవసరం.
  • BIS ప్రకారం.. ఆభరణాల వ్యాపారి/రిటైలర్ జారీ చేసిన బిల్లులో కొనుగోలు చేసిన హాల్‌మార్క్ వస్తువు వివరాలు ఉండాలి.
  • బిల్లులోని ప్రతీ అంశం వివరణ, క్యారెట్లలో వస్తువుల నికర బరువు, స్వచ్ఛత, డిజైన్ హాల్‌మార్కింగ్ ఫీజు, కొనుగోలు చేసిన తేదీ రోజు బంగారం ధర వంటి వివరాలు గమనించాలి.
  • రత్నం లేదా వజ్రం విలువ, రత్నాల ధర, బరువు కొనుగోలుదారు చెల్లించిన మొత్తం బిల్లులో విడిగా పేర్కొనాలి.
  • బంగారం స్వచ్ఛతపై మీకు సందేహాలు ఉంటే.. మీరు ఏదైనా BIS గుర్తింపు పొందిన హాల్‌మార్కింగ్ (A&H) కేంద్రాన్ని సందర్శించవచ్చు.
  • టెస్ట్​ కోసం మీకు నామమాత్రపు ఫీజు వసూలు చేస్తారు. BIS గుర్తింపు పొందిన పరీక్ష, హాల్‌మార్కింగ్ కేంద్రాల జాబితా BIS వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది.
  • బంగారం క్వాలిటీని ఆన్​లైన్​లో చెక్​ చేయడానికి.. కేంద్ర ప్రభుత్వం BIS Care యాప్​ను అందుబాటులోకి తెచ్చింది.

పర్సనల్​ లోన్ తీసుకుంటున్నారా? అంతకన్నా తక్కువ వడ్డీకే రుణాలు!

BIS-కేర్ యాప్ అంటే ఏమిటి..? (What is BIS Care App) : BIS-కేర్ యాప్ ద్వారా.. ISI, హాల్‌మార్క్ నాణ్యత, ధ్రువీకరణ పొందిన నగల క్వాలిటీని చెక్ చేయొచ్చు. ఇందులో.. ఆభరణాల ప్రామాణికత గురించి తెలుసుకునేందుకు.. తేడా ఉంటే కంప్లైంట్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంది. ఈ అప్లికేషన్.. హిందీ, ఇంగ్లీష్ రెండు భాషల్లోనూ అందుబాటులో ఉంది.

చట్ట ప్రకారం ఒక వ్యక్తి దగ్గర ఎంత బంగారం ఉండొచ్చు? - ఎక్కువ ఉంటే ఏమవుతుంది?

BIS కేర్ యాప్​లో బంగారాన్ని ఎలా చెక్​ చేయాలి..? (How to Check Gold in BIS Care App) :

  • ముందుగా.. Play స్టోర్‌ నుంచి BIS-కేర్ యాప్​ను డౌన్​లోడ్​ చేసుకోవాలి
  • యాప్​ ఓపెన్​ చేసిన తర్వాత స్క్రీన్​ మీద పలు రకాలు సర్వీసులు కనిపిస్తాయి.
  • ముందుగా మీరు రిజిస్ట్రేషన్​ కంప్లీట్​ చేసుకోవాలి(దీని పూర్తి వివరాలకు ఈ లింక్​ను నొక్కండి).
  • విజయవంతంగా రిజిస్టర్​ అయిన తర్వాత.. మీరు ఉత్పత్తుల నాణ్యతను చెక్​ చేసుకోవచ్చు.
  • యాప్​ ఓపెన్​ చేసిన తర్వాత Verify HUID ఆప్షన్​పై క్లిక్​ చేయండి.
  • తర్వాత బంగారం ఆభరణంపై ఉన్న HUID నెంబర్​ను ఎంటర్​ చేసి.. సెర్చ్​ చేయాలి.
  • వెంటనే మీకు సదరు ఆభరణంలోని బంగారం స్వచ్ఛత వివరాలు కనిపిస్తాయి.

How to Use BIS care App to Check Gold Purity: మీరు కొన్న బంగారం స్వచ్ఛమైనదా? నకిలీదా..? ఇలా చెక్ చేయండి!

How to Apply for Gold Monetization Scheme : ఈ స్కీమ్​లో చేరండి.. మీ ఇంట్లో ఉన్న బంగారంతో డబ్బులు సంపాదించండి.!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.