ETV Bharat / business

How To Find My PPO Number : మీరు రిటైర్డ్​ ప్రభుత్వ ఉద్యోగాలా?.. ఆన్​లైన్​లో PPO నంబర్ తెలుసుకోండిలా! - how to find ppo number

How To Find My PPO Number : మీరు రిటైర్డ్​ ప్రభుత్వ ఉద్యోగులా? మీకు నెలనెలా అందే పెన్షన్​ ఒక్కసారిగా ఆగిపోయిందా? అయితే మీరు యాన్యువల్ లైఫ్​ సర్టిఫికేట్​ సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం మీరు పీపీఓ నంబర్​ తెలుసుకోవాల్సి ఉంటుంది. మరి దానిని చాలా సులువుగా ఆన్​లైన్​లో తెలుసుకోవడం ఎలానో ఇప్పుడు తెలుసుకుందామా?

How To Find PPO Number For Pension Online
How To Find My PPO Number
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 15, 2023, 6:15 PM IST

How To Find My PPO Number : ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ప్రభుత్వం కల్పించిన ఆదాయ మార్గం పెన్షన్​. అయితే క్రమం తప్పకుండా పెన్షన్​ పొందాలంటే.. ప్రతి రిటైర్డ్​ ఉద్యోగి సదరు బ్యాంకు లేదా పోస్టాఫీసుల్లో 'యాన్యువల్​​ లైఫ్​ సర్టిఫికేట్​' లేదా 'జీవన​ ప్రమాణ పత్రం'ను సమర్పించాల్సి ఉంటుంది. అలా ఏడాదికోసారి దీనిని అందిస్తేనే క్రమం తప్పకుండా మీరు పెన్షన్​ డబ్బులను పొందగలుగుతారు. అయితే యాన్యువల్​ లైఫ్ సర్టిఫికేట్ పొందాలంటే.. కచ్చితంగా మీకు PPO నంబర్​ తెలియాల్సి ఉంటుంది. మరి ఈ పీపీఓ నంబర్​ను ఆన్​లైన్​లో తెలుసుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

PPO నంబర్​ పొందండిలా!

  • ముందుగా www.epfindia.gov.in పోర్టల్​లోకి లాగిన్​ అవ్వాలి.
  • తర్వాత Online Serviceలోని pensioner's portalపై క్లిక్​ చేయాలి.
  • అనంతరం పేజీ కుడి భాగంలో ఉండే pensioner's portalలో 'Know Your PPO number'పై క్లిక్​ చేయాలి.
  • మీ బ్యాంక్​ ఖాతా నంబర్​ లేదా PF సంఖ్యను ఎంటర్​ చేయాలి.
  • ఈ వివరాలన్నీ ఇచ్చిన తర్వాత మీకు PPO నంబర్​తో పాటు Member ID, ఏ రకమైన పెన్షన్​ను మీరు పొందుతున్నారు లాంటి వివరాలు కనిపిస్తాయి.
  • ఈ యూనిక్​ నంబర్​ అనేది పెన్షన్​కు దరఖాస్తు చేసుకునే సమయంలో గానీ, యానువల్​ లైఫ్​ సర్టిఫికేట్​ను సమర్పించేటప్పుడు గానీ ఉపయోగపడుతుంది.
  • మీ PF ఖాతాను ఒక బ్యాంక్​ బ్రాంచ్​ నుంచి మరొక బ్యాంక్​కు బదిలీ చేసేటప్పుడు కూడా ఈ PPO నంబర్ ఉపయోగపడుతుంది.

Digilocker నుంచి కూడా PPO నంబర్​ డౌన్​లోడ్​!

  • EPF పోర్టల్​ నుంచే కాకుండా Digilocker ద్వారా కూడా పెన్షన్​ పేమెంట్​ ఆర్డర్(PPO)​ను సులువుగా పొందవచ్చు. ఎలాగంటే..
  • ముందుగా digilocker.gov.in లో రిజిస్టర్​ కావాలి. తరువాత..
  • Digilocker అకౌంట్​లోకి లాగిన్​ అవ్వాలి.
  • తరువాత UAN సేవలపై క్లిక్​ చేసి నంబర్​ను ఎంటర్​ చేయాలి.
  • అనంతరం 'Get Document'పై క్లిక్​ చేయాలి.
  • చివరగా 'ePPO'ను డౌన్​లోడ్​ చేసుకోవాలి.

గమనిక : పైన తెలిపిన స్టెప్స్​ను ఫాలో అవుతూ EPS స్కీమ్​ సర్టిఫికేట్​, UANను కూడా డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.

PPO నంబర్ అంటే ఏమిటి?
What Is PPO Number : PPO (పెన్షన్​ పేమెంట్ ఆర్డర్​).. ఇది 12 అంకెల నంబర్​. దీని సాయంతోనే పదవి విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులు నిరాటంకంగా పెన్షన్​ను పొందగలరు. దీని సాయంతో మీ పెన్షన్​ స్టేటస్​ను ట్రాక్ కూడా చేసుకోవచ్చు.

యానువల్​ లైఫ్​ సర్టిఫికేట్​ అంటే ఏమిటి?
What Is Annual Life Certificate : ప్రభుత్వ ఉద్యోగులు.. సర్వీస్​ నుంచి రిటైర్ అయిన తర్వాత పెన్షన్​ పొందుతారు. దీనిని పొందేందుకు సదరు వ్యక్తి తాను బతికి ఉన్నట్లుగా ఒక డాక్యుమెంట్​ను.. పెన్షన్​ను అందించే బ్యాంకులు, పోస్ట్​ ఆఫీసులు లేదా ఇతర సంస్థలకు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. దీనినే యానువల్​ లైఫ్​ సర్టిఫికేట్ లేదా జీవన​ ప్రమాణ​ పత్రం అని కూడా అంటారు.

జీవన​ ప్రమాణ పత్రం ఇవ్వకపోతే ఏమౌతుంది?
What Will Happen If Jeevan Pramaan Pathra Not Submitted : జీవన ప్రమాణ​ పత్రం.. అనేది మీరు బతికి ఉన్నారని తెలిపే సర్టిఫికేట్​. ఇది మీ పెన్షన్​ డబ్బులను యథావిథిగా మీ బ్యాంక్​ ఖాతాలు లేదా పోస్ట్​ ఆఫీసుల్లో జమ చేయాల్సిందిగా కోరుతూ ఇచ్చే డాక్యుమెంట్​. దీనిని తప్పనిసరిగా ఏడాదికోసారి మీకు పెన్షన్​ను మంజూరు చేసే సంస్థలకు అందించాల్సి ఉంటుంది. ఒకవేళ దీనిని అందిచని పక్షంలో మీకు వచ్చే పెన్షన్​ను నిలుపుదల చేస్తారు.

డిజిటల్​ లైఫ్​ సర్టిఫికేట్​ కోసం ఇవ్వాల్సిన వివరాలు!

  • మీ పూర్తి పేరు
  • ఆధార్​ నంబర్​
  • మొబైల్​ నంబర్​
  • PPO నంబర్​
  • పెన్షన్​ అకౌంట్​ నంబర్​
  • బ్యాంక్​ ఖాతా వివరాలు
  • మీకు పెన్షన్​ను మంజూరు చేసే సంస్థ వివరాలు.
  • మీకు పెన్షన్​ అందించే బ్యాంకు లేదా పోస్టాఫీస్​ వివరాలు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.