ETV Bharat / business

How to Cancel IRCTC Train Tickets Online : ఐఆర్​సీటీసీలో.. ట్రైన్ టికెట్స్ రద్దు చేసుకోవడం ఎలా..?

How to Cancel IRCTC Train Tickets in Online : మీరు సుదూర ప్రాంతాలకు వెళ్లేందుకు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ రోజు వెళ్లడం కుదరలేదు. అయితే సకాలంలో మీరు టికెట్స్ క్యాన్సిల్ చేసుకోకపోతే నష్టపోతారు. కొందరు ట్రైన్ టికెట్స్ ఎలా రద్దు చేసుకోవాలో తెలియక అనవసరంగా టికెట్స్ బుక్ చేశామని బాధపడుతుంటారు. ఇప్పుడు మీరు అలాంటి ఆందోళన చెందాల్సిన పని లేదు. సింపుల్​గా ఆన్​లైన్​లో ఇలా మీ ట్రైన్ టికెట్స్ రద్దు చేసుకోండిలా..

Cancel Train Tickets in Telugu
Train Tickets
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 2, 2023, 12:17 PM IST

IRCTC Train Tickets Cancel Procedure in Telugu : టెక్నాలజీ పెరిగాక ఎక్కువమంది ఆన్​లైన్ ద్వారానే రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. పండుగ సీజన్లలో, రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు రైలు టికెట్లు(Train Tickets) దొరకడం చాలా కష్టం. అందుకే చాలా అడ్వాన్స్​డ్​గా రైల్వే ప్రయాణికులు రిజర్వేషన్ చేస్తుంటారు. అయితే.. కొందరు మాత్రం తీరా ప్రయాణపు తేదీ వచ్చే నాటికి అనారోగ్య సమస్యలు, ఇతరత్రా కారణాలు తలెత్తడంతో బుక్ చేసుకున్న టికెట్లు ఎలా రద్దు చేసుకోవాలో తెలియక ఆందోళన చెందుతుంటారు. ఇకపై అలాంటి ఇబ్బందులకు గురి కావాల్సిన పనిలేదు. చాలా సింపుల్​గా ఆన్​లైన్​లో రెండు విధాలుగా మీ రైలు టికెట్లను రద్దు చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

How to Cancel Train Ticket use IRCTC Mobile App :

IRCTC మొబైల్ యాప్‌లో రైలు టికెట్‌ను రద్దు చేయండిలా..

  • ముందుగా IRCTC యాప్‌లోకి లాగిన్ అవ్వాలి.
  • లాగిన్ అవ్వడానికి మీకు 4 అంకెల పిన్ అవసరం. మీరు అకౌంట్ క్రియేట్ చేసుకున్న సమయంలోనే మీకు లాగిన్ పిన్ వస్తుంది.
  • మీకు పిన్ గుర్తులేకపోతే 'Forgetting the PIN' పై క్లిక్ చేసి పొందవచ్చు.
  • లాగిన్ అయినప్పుడు మొదట IRCTC హోమ్ పేజీ ఓపెన్ అవుతుంది.
  • ఇప్పుడు మీరు 'My Bookings' ఆప్షన్​ను ఎంచుకుని.. దానిపై క్లిక్ చేయాలి.
  • దీంతో.. మీరు బుక్ చేసిన టికెట్ల జాబితా మీ ముందు కనిపిస్తుంది.
  • ఇప్పుడు మీరు రద్దు చేయాలనుకుంటున్న టికెట్‌పై క్లిక్ చేయాలి.
  • అనంతరం మీ టికెట్​ పూర్తి వివరాలు అక్కడ కనిపిస్తాయి.
  • ఇప్పుడు టికెట్​ పైన ఉండే మూడు చుక్కలపై క్లిక్ చేయాలి.
  • అలా క్లిక్ చేయగానే మీకు కొత్త పేజీలో Cancel Ticket అనే ఆప్షన్​ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
  • అన్ని టికెట్స్ క్యాన్సిల్ చేయాలనుకుంటే 'Select All' అనే ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • చివరగా కన్ఫర్మేషన్ కోసం మిమ్మల్ని అడుగుతారు. అప్పుడు మీరు 'Confirm'పై క్లిక్ చేస్తే మీ IRCTC రైలు టికెట్ పూర్తిగా రద్దవుతుంది.

IRCTCలో రైలు టికెట్స్​ బుక్​ అవ్వట్లేదా.. అమెజాన్, పేటీఎంల్లో ట్రై చేయండి!

How to Cancel Train Ticket in IRCTC Website :

IRCTCలో ట్రైన్ టికెట్‌ను రద్దు చేసుకోండిలా..

  • ముందుగా IRCTC.co.in వెబ్ సైట్​లోకి లాగిన్ కావాలి.
  • తర్వాత పైన ఉన్న లాగిన్ ఆప్షన్​ పై క్లిక్ చేసి లాగిన్ అవ్వాలి.
  • లాగిన్ కోసం మీరు తప్పనిసరిగా వినియోగదారు ఐడీ, పాస్​వర్డ్ కలిగి ఉండాలి.
  • టికెట్ బుకింగ్ సమయంలో ఫిల్ చేసిన ఖాతా వివరాలు. అలా యూజర్ ఐడీ, పాస్​వర్డ్​, ఇచ్చిన క్యాప్చాతో లాగిన్ అవ్వాలి.
  • తర్వాత 'My Account' అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ తర్వాత క్లిక్ చేయాలి. ఆ తర్వాత 'My Profile' అనే ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు ఓపెన్ అయిన పేజీలో మీరు 'Booked Ticket History' అనే దానిపై ప్రెస్ చేయాలి. ఆ తర్వాత మీరు రద్దు చేయాల్సిన టికెట్​పై క్లిక్ చేయాలి.
  • అనంతరం మీకు టికెట్ పూర్తి వివరాలు కనిపిస్తాయి. అప్పుడు మీరు టికెట్ రద్దు అనే అనే ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు ఎవరి టికెట్ క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారో వారి వివరాలను తనిఖీ చేసి తొలగించాలి.
  • ఆపై Click OK అనే ఆప్షన్​పై నొక్కాలి.
  • ఒకవేళ అన్ని టికెట్లూ రద్దు చేయాలంటే.. అన్ని చెక్‌బాక్స్‌లపై క్లిక్ చేసి.. 'Cancel Ticket' ​పై క్లిక్ చేయాలి.
  • నిర్ధారణ కోసం మళ్లీ అడుగుతారు. అప్పుడు ఓకే చేసి 'Ticket Cancellation'ని Confirm చేస్తే మీ టికెట్లు పూర్తిగా రద్దు చేస్తారు.

How to Check Train PNR Status : మీకు తెలుసా..? ట్రైన్ PNR స్టేటస్ సింపుల్​గా చెక్ చేసుకోవచ్చు!

IRCTC Train Ticket Cancellation Rules : అయితే మొదట మనం ఐఆర్‌సీటీసీ (IRCTC) క్యాన్సలేషన్ పాలసీ, రీఫండ్ ప్రాసెస్ లాంటి వివరాలను ఓ సారి తెలుసుకుని ఆ తర్వాత టికెట్స్ రద్దు చేసుకోవడం మంచిది. ఎందుకంటే చాలా మందికి రైలు టికెట్‌ ఎప్పుడు రద్దు చేస్తే ఎంత ఛార్జ్‌ చెల్లించాలో పెద్దగా అవగాహన ఉండదు. ఆ విషయాలు తెలుసుకోవడం ద్వారా మనకు టికెట్స్ రద్దు చేసుకుంటే ఏ క్లాస్​లో ఎంత మొత్తంలో రిఫండ్ వస్తుందనే దానిపై క్లారిటీ వస్తుంది. అవేంటో ఓసారి చూద్దాం..

  • మీరు ఏదైనా రైలులో ప్రయాణించాలనుకున్నారు. అప్పుడు మీ రైలు టికెట్ ఛార్ట్ సిద్ధమైన తర్వాత మీ టికెట్స్​ RAC లేదా వెయిటింగ్ చూపుతున్నట్లయితే.. అలాంటి సమయంలో మీరు రైలు బయల్దేరే 30 నిమిషాల ముందు టికెట్​ను రద్దు చేసుకోవాలనుకుంటే స్లీపర్‌లో 60 రూపాయలు, ఏసీలో 65 రూపాయలు కట్ అవుతాయి.
  • ఒకవేళ మీ టికెట్ కన్ఫర్మ్ అయి మీ రైలు బయలుదేరడానికి 48 గంటల ముందు టికెట్​ను రద్దు చేస్తే, మీరు రెండవ సీటర్ క్లాస్‌లో ఒక్కో ప్రయాణికుడికి 68 రూపాయలు వసూలు చేస్తారు.
  • అదే మీరు కన్ఫర్మ్ చేసిన టికెట్‌ని కలిగి ఉండి, రద్దు చేసినట్లయితే మీరు రూ. 120 చెల్లించాలి.
  • AC చైర్ క్లాస్‌లో ఏదైనా సీటు కోసం మీరు 120 రూపాయలు చెల్లించాలి. అదే One Class కోసమైతే మీరు రూ. 180 చెల్లించాలి.
  • సెకండ్ ఏసీ టికెట్ల రద్దుకు రూ. 200, ఫస్ట్ క్లాస్ ఏసీకి రూ. 240 తగ్గిస్తారు. మీరు స్లీపర్ క్లాస్‌లో ఎలాంటి GSTని ఛార్జ్ చేయరు. కానీ అదే AC క్లాస్‌లో అయితే మీరు GST చెల్లించాలి.

రైలు ప్రయాణం వాయిదా పడిందా? ఇలా చేస్తే క్యాన్సిలేషన్‌ ఛార్జీలు ఉండవ్!

ఇకపై నెలకు 24 ట్రైన్ టికెట్లు బుక్​ చేసే వీలు.. కానీ ఓ షరతు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.