ETV Bharat / business

హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అయిందా? ఇవి తెలుసుకోండి!

Health insurance rejection reasons: అనారోగ్య పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఆరోగ్య బీమా ఆదుకుంటుంది. కొన్నిసార్లు బీమా సంస్థ మనం పరిహారం కోసం చేసిన క్లెయింను తిరస్కరించే అవకాశం లేకపోలేదు. ఏ పరిస్థితుల్లో ఇలాంటి అనుభవం ఎదురవుతుంది? దాన్ని నివారించేందుకు ఏం చేయాలో చూద్దాం..

health insurance rejection reasons
ఆరోగ్య బీమా.. క్లెయిం తిరస్కరణ ఎప్పుడంటే..
author img

By

Published : Jul 10, 2022, 4:27 PM IST

రోగ్య బీమా పాలసీ అమల్లో ఉన్నప్పుడే క్లెయింలను బీమా సంస్థ ఆమోదిస్తుంది. ఏటా ఈ పాలసీని పునరుద్ధరించుకోవాలి. కొన్నిసార్లు పాలసీదారులు ఈ పాలసీ పునరుద్ధరణలో ఆలస్యం చేస్తుంటారు. లేదా మర్చిపోతుంటారు. ఇలాంటి సందర్భంలో క్లెయిం చేసుకోవాల్సి వచ్చినప్పుడు పాలసీ నుంచి పరిహారం అందదు. చాలామంది దీన్ని క్లెయిం చేసుకున్న తర్వాతే గుర్తిస్తారు. పాలసీ సకాలంలో పునరుద్ధరించుకోకపోతే.. బీమా కంపెనీకి క్లెయిం చెల్లించాల్సిన బాధ్యత ఉండదు. ఇలాంటి అనుభవాలు లేకుండా చూసుకునేందుకు గడువు తేదీలోగా పాలసీని పునరుద్ధరించుకోవడం మేలు.
సాధారణంగా ఆరోగ్య బీమా పాలసీ గడువు ముగిసిన తర్వాత పునరుద్ధరణ కోసం 15 నుంచి 30 రోజుల అదనపు వ్యవధినిస్తారు. కానీ, వ్యవధిలో క్లెయిం వచ్చినా పరిహారం లభించదు. కేవలం కొనసాగింపు ప్రయోజనాలు దూరం కాకుండా ఉంటాయి.

దాపరికం వద్దు..
పాలసీ తీసుకునేటప్పుడు దరఖాస్తు పత్రంలో ఇప్పటికే ఉన్న వ్యాధుల గురించి తెలియజేయాలి. ముఖ్యంగా అధిక రక్తపోటు, గుండె జబ్బులు, మధుమేహంలాంటి విషయాలను పేర్కొనాలి. గతంలో ఏదైనా పెద్ద శస్త్రచికిత్స జరిగితే.. ఆ వివరాలూ తెలియజేయాలి. పాలసీ పునరుద్ధరించుకునేటప్పుడు.. ఆ పాలసీ ఏడాదిలో ఏదైనా అనారోగ్యం బారిన పడటం, లేదా రక్తపోటు, మధుమేహం రావడంలాంటివి ఉంటే.. దానిని పునరుద్ధరణ సమయంలో బీమా సంస్థకు చెప్పాలి. ఆరోగ్య బీమా విషయంలో మీ ఆరోగ్యానికి సంబంధించిన ప్రతి విషయమూ ఎంతో కీలకమే. చిన్న పొరపాటు చేసినా, బీమా సంస్థ దాన్ని కారణంగా చూపి, క్లెయింను తిరస్కరించేందుకు వీలుంటుంది. ముందస్తు వ్యాధులకు.. శాశ్వత మినహాయింపును ఇవ్వడం ద్వారా పాలసీని జారీ చేయొచ్చు. కొన్నిసార్లు పాలసీ ఇవ్వడంలో ఇదే కీలకంగానూ ఉంటుంది.

వేచి ఉండే వ్యవధి..
బీమా పాలసీ తీసుకున్న తర్వాత కొన్ని వ్యాధులకు నిర్ణీత వేచి ఉండే సమయం (వెయిటింగ్‌ పీరియడ్‌) ఉంటుంది. ఈ లోపు ఆ వ్యాధి చికిత్స కోసం క్లెయిం చేసుకుంటే దాన్ని బీమా సంస్థ ఆమోదించకపోవచ్చు. బీమా సంస్థలను బట్టి, ఈ వేచి ఉండే వ్యవధిలో తేడా ఉంటుంది. పాలసీ తీసుకునేటప్పుడే ఈ నిబంధన గురించి స్పష్టంగా తెలుసుకోవాలి. ఏయే వ్యాధులకు, ఎంత కాలం పరిహారం ఇవ్వరు అనేది పాలసీ పత్రంలో ఉంటుంది. దీన్ని పూర్తిగా చదివి, అర్థం చేసుకోవాలి.

మినహాయింపు ఉంటే..
కొన్ని వ్యాధుల చికిత్సకు పరిహారం లభించదని బీమా సంస్థ ముందుగానే తెలియజేస్తుంది. ఈ జాబితాలో ఉన్న వ్యాధుల చికిత్స కోసం వెళ్లినప్పుడు బీమా సంస్థ పరిహారం ఇవ్వదు. పాలసీ తీసుకునేటప్పుడు ఈ జాబితాను ఒకసారి పరిశీలించండి. ఎక్కువ వ్యాధులకు పరిహారం ఇవ్వని పాలసీని ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

సరైన పత్రాలు లేకుండా..
క్లెయింల సందర్భంలో.. ప్రత్యేకంగా వైద్య ఖర్చులను తిరిగి చెల్లించాలని దరఖాస్తు చేసుకున్నప్పుడు బీమా సంస్థ పలు పత్రాలను అడుగుతుంటుంది. ఇందులో డిశ్ఛార్జి సమ్మరీతోపాటు, ఇతర బిల్లుల అసలు పత్రాలు ఉండాలి. నకళ్లను బీమా సంస్థలు సాధారణంగా అనుమతించవు.

పాలసీ క్లెయింలు తిరస్కరణకు గురి కాకుండా.. బీమా సంస్థ నెట్‌వర్క్‌ ఆసుపత్రిలో చేరి నగదు రహిత చికిత్స చేయించుకోవడం మంచిది. దీనివల్ల అనారోగ్యం సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడకుండా ఉంటాయి. ఇలాంటి ఆసుపత్రులతో బీమా సంస్థకు ప్రత్యేక ఒప్పందాలు ఉంటాయి కాబట్టి, క్లెయిం సులువుగా పరిష్కరిస్తాయి. రీఇంబర్స్‌మెంట్‌ సమయంలోనూ చిక్కులుండవు.

పాలసీదారుడు క్లెయిం కోసం నిర్ణీత వ్యవధి లోపు దరఖాస్తు చేయాలి. ఆసుపత్రి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత 60-90 రోజుల్లోగా సంబంధిత క్లెయింకు సంబంధించిన పత్రాలను బీమా సంస్థకు అందించాలి. ఈ సమయాన్ని పాటించకపోతే.. బీమా సంస్థలు వైద్య ఖర్చులను చెల్లించేందుకు నిరాకరిస్తాయి.
- భాస్కర్‌ నెరుర్కర్‌, హెడ్‌-హెల్త్‌ అడ్మినిస్ట్రేషన్‌, బజాజ్‌ అలియాంజ్‌ జనరల్‌ ఇన్సూరెన్స్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.