ETV Bharat / business

రూ.7కోట్ల ఫ్లాట్స్​కు భారీ డిమాండ్.. డీఎల్​ఎఫ్​ ఆఫీస్ హౌస్​ఫుల్​.. 3 రోజుల్లోనే 1100 ఇళ్లు సేల్​! - రూ 7 కోట్ల విలువైన డీఎల్​ఎఫ్​ ఫ్లాట్ల అమ్మకాలు

లగ్జరీ ఫ్లాట్లు కొనేందుకు ప్రజలు పోటీపడ్డారు. ఫ్లాట్లు విక్రయించే సంస్థ కార్యాలయం ముందు భారీగా బారులు తీరారు. రూ.7 కోట్లు విలువైన 1,137 ఫ్లాట్లను మూడు రోజుల్లోనే కోనేశారు. హరియాణా గురుగ్రామ్​లోని డీఎల్​ఎఫ్​ సంస్థకు చెందిన ఫ్లాట్లను ఇలా హాట్​కేకుల్లా కొనేశారు.

dlf-arbour-gurgaon-massive-crowd-at-dlf-office-to-buy-rs-7-crore-flats
డీఎల్​ఎఫ్​ అర్బోర్ అమ్మకాలు
author img

By

Published : Feb 23, 2023, 5:15 PM IST

ప్రముఖ రియల్​ ఎస్టేట్​ సంస్థ అయిన డీఎల్​ఎఫ్​కు చెందిన ఫ్లాట్లు హాక్​ కేకుల్లా అమ్ముడుపోయాయి. వీటిని కొనేందుకు ప్రజలు విపరీతంగా పోటీపడ్డారు. గురుగ్రామ్​లోని డీఎల్​ఎఫ్​ ఆఫీస్​ ముందు బారులు తీరారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఫ్లాట్లు కొనేందుకు ఎగబడ్డారు. డీఎల్​ఎఫ్​ సంస్థ కొత్తగా ప్రారంభించిన విలాసవంతమైన ప్రాజెక్ట్​లో ఫ్లాట్ల కోసం జనం ఇలా పోటీపడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్​గా మారింది.

ఈ కొత్త ప్రాజెక్ట్​ను.. డీఎల్​ఎఫ్​ సంస్థ గురుగ్రామ్​లో ప్రారంభించింది. ఏడు కోట్ల రూపాయలు విలువైన 1,137 ఫ్లాట్​లను అమ్మకానికి పెట్టింది. మూడు నాలుగు రోజుల క్రితం ఈ విలాసవంతమైన నివాస గృహాలను విక్రయిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో కంపెనీ కార్యాలయానికి ఆసక్తి ఉన్న కొనుగోలుదారులంతా పోటెత్తారు. ఆఫీస్​ ముందు బారులు తీరారు. మూడు రోజుల్లోనే మొత్తం ఫ్లాట్లన్నీ అమ్ముడుపోయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

దిల్లీకి చెందిన రీసెర్చ్​ అనలిస్ట్​, వీకెండ్​ ఇన్వెస్టింగ్​ వ్యవస్థాపకులైన అలోక్​ జైన్​.. డీఎల్​ఎఫ్​ ఆఫీస్​ ముందు జనం బారులు తీరి ఉన్న ఫొటోను​ సామాజిక మాధ్యమాల్లో షేర్​ చేశారు. ఫొటో కింద పలు ఆసక్తికర అంశాలను రాసుకొచ్చారు. రియల్​ ఎస్టేట్​ ఎక్కడ పడిపోయిందని ప్రశ్నించారు. ఈ మధ్య కాలంలో రియల్ ఎస్టేట్​ పడిపోతుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

dlf-arbour-gurgaon-massive-crowd-at-dlf-office-to-buy-rs-7-crore-flats
డీఎల్​ఎఫ్​ ఆఫీస్​ ముందు జనం బారులు

"రూ. 7 కోట్లు విలువైన విలాసవంతమైన ఇళ్లను కొనుగోలు చేసేందుకు.. డీఎల్​ఎఫ్​ కార్యాలయం ముందు ప్రజలు బారులు తీరారు. అక్కడి నుంచే ఓ వ్యక్తి నాకు ఈ ఫొటోలను పంపారు." అని అలోక్​ జైన్​ తెలిపారు. అలోక్​ జైన్.. గురువారం ఈ వైరల్​ ఫోటోను షేర్​ చేశారు. కంపెనీకి సంబంధించిన 1,137 ఫ్లాట్లు మూడు రోజుల్లోనే అమ్ముడుపోయాయని జైన్​ తెలిపారు. ఈ విషయాన్ని ఓ డీఎల్​ఎఫ్​ బ్రోకర్​ తనకు చెప్పారని వెల్లడించారు. అలోక్​ చేసిన ఫోస్ట్​పై పలువురు వివిధ రకాలుగా స్పందించారు.
గురుగ్రామ్​లోని సెక్టార్​ నెం 63లో 'అర్బర్' పేరుతో లగ్జరీ హైరైజ్ ప్రాజెక్ట్​ను డీఎల్​ఎఫ్​ లాంఛ్​ చేసింది. దాదాపు 10 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఆ కంపెనీ ఇంతటి భారీ, ఎత్తయిన గృహసముదాయాన్ని నిర్మిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.