ETV Bharat / business

ఫండ్లలో ఇన్వెస్ట్ చేస్తున్నారా? క్రమం తప్పని ఆదాయం కావాలా? ఇలా చేయండి!

భవిష్యత్‌ అవసరాల కోసం పెట్టుబడి పెట్టినప్పుడు డివిడెండ్‌ ఆప్షన్‌ (ఐడీసీడబ్ల్యూ) నుంచి ఆదాయం వచ్చేలా చూసుకోవచ్చు. మరోవైపు క్రమానుగతంగా కొంత పెట్టుబడిని ఉపసంహరించుకునే (ఎస్‌డబ్యూపీ) పద్ధతినీ ఎంచుకోవచ్చు. మరి ఈ రెండింటిలో ఏది మేలు?. దేన్ని ఎంచుకుంటే ప్రయోజనకరంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

dividend-option-of-mutual-funds-and-periodic-investment-plan-in-mutual-fund-which-is-better
dividend option in mutual fund
author img

By

Published : May 16, 2023, 9:30 AM IST

భవిష్యత్‌ అవసరాల కోసం క్రమం తప్పని ఆదాయం వచ్చేలా మదుపరులు తమ పెట్టుబడి పథకాలు ఉండాలని ఆశిస్తారు. అవి బాండ్ల నుంచి వడ్డీ చెల్లింపులు, స్థిరాస్తుల నుంచి అద్దె, షేర్ల నుంచి డివిడెండ్లు, వ్యాపారాల నుంచి లాభాలు ఇలా ఎన్నో రూపాల్లో ఉండొచ్చు. మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టినప్పుడు ఈ ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఉంది. డివిడెండ్‌ ఆప్షన్‌ (ఐడీసీడబ్ల్యూ) నుంచి ఆదాయం వచ్చేలా చూసుకోవచ్చు. మరోవైపు క్రమానుగతంగా కొంత పెట్టుబడిని ఉపసంహరించుకునే (ఎస్‌డబ్యూపీ) పద్ధతినీ ఎంచుకోవచ్చు. మరి ఈ రెండింటిలో ఏది మేలో.. చూద్దాం.

లాంగ్​టర్మ్​లో సంపద సృష్టికి మ్యూచువల్‌ ఫండ్లలో క్రమానుగత పెట్టుబడి విధానం ఉపయోగపడుతుంది. ఇలా ఏర్పాటైన సొమ్మను ఒకేసారి వెనక్కి తీసుకోకుండా క్రమం తప్పని ఆదాయ మార్గంగా మార్చుకోవచ్చు. ఇందుకోసం అందుబాటులో ఉన్న మార్గాలు.. 1. సిస్టమేటిక్‌ విత్‌డ్రాయల్‌ ప్లాన్‌ (ఎస్‌డబ్ల్యూపీ) 2. ఇన్‌కం డిస్ట్రిబ్యూషన్‌ కమ్‌ విత్‌డ్రాయల్‌ (ఐడీసీడబ్ల్యూ). ఈ రెండు విధానాలు పెట్టుబడిదారులకు తన మదింపుల నుంచి క్రమం తప్పకుండా ఆదాయాన్ని అందించే మార్గాలుగా చెప్పవచ్చు.

సమకూరిన మదింపు నుంచి నిర్ణీత మొత్తాన్ని ప్రతినెలా వెనక్కి తీసుకునేలా ఎస్‌డబ్ల్యూపీ తోడ్పడుతుంది. ఇప్పటికే పెద్ద మొత్తంలో పెట్టుబడులు ఉన్న వారికి ఈ మార్గం అనుకూలమని చెప్పవచ్చు. వారికి కావాల్సిన మొత్తాన్ని ముందే నిర్ణయించుకోవచ్చు. ఆ మొత్తాన్ని ఇచ్చేందుకు అప్పటి మార్కెట్‌ ప్రకారం యూనిట్లను అమ్మేసి, పెట్టుబడిదారుల ఖాతాలో సొమ్మును జమ చేస్తారు. గ్రోత్‌ ఆప్షన్‌ను ఎంచుకొని కూడా ఈ పద్ధతిలో సొమ్మును వెనక్కి తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.

డివిడెండ్‌ ఆప్షన్‌ (ఐడీసీడబ్ల్యూ) ఎంచుకున్నప్పుడు.. ఇవి పెట్టుబడి వృద్ధితో పాటు, డివిడెండ్‌ను కూడా అందిస్తాయి. ఫండ్‌ కంపెనీలు నిర్ణీత కాలానికి ఒకసారి డివిండెండ్‌ను ప్రకటిస్తుంటాయి. దీన్ని చెల్లించిన అనంతరం ఆ మేరకు ఫండ్‌ ఎన్‌ఏవీ తగ్గుతుంది. ఇందులో యూనిట్లను అమ్మకుండానే డబ్బు అందుతుంది.

  • ఎస్‌డబ్ల్యూపీ ఎంచుకున్నప్పుడు ఎంత సొమ్ము కావాలి? దాని వ్యవధి ఏమిటి? అనేది నిర్ణయించుకునే వెసులుబాటు పెట్టుబడిదారులకు ఉంటుంది. దాన్ని బట్టి, అవసరమైన మేరకు యూనిట్లను అమ్మేసి, ఫండ్‌ సంస్థ.. డబ్బును సర్దుబాటు చేస్తుంది. దీంతో క్రమం తప్పని ఆదాయం మదింపుదారులకు సాధ్యమవుతుంది.

డివిడెండ్‌ను ఎంచుకునే సమయంలో ఫండ్‌ సంస్థ దాని వ్యవధిని నిర్ణయిస్తుంది. పోర్ట్‌ఫోలియోపై వచ్చే లాభాల ఆధారంగా డివిడెండ్‌లను చెల్లించేందుకు సంస్థ ప్రయత్నిస్తుంది. కొన్నిసార్లు కంపెనీ డివిడెండ్‌ను ప్రకటించకపోవచ్చు. అలాంటి సమయాల్లో ఆదాయం అందదు.

  • మదింపుదారు అవసరం మేరకు ఎంత మొత్తం కావాలన్నది నిర్ణయించుకునే అవకాశం ఎస్‌డబ్యూపీలో ఉంటుంది. వ్యవధితోపాటు, కావాల్సిన మొత్తాన్ని కూడా తగ్గించుకోవచ్చు అదేవిధంగా పెంచుకోవచ్చు. ఈ మార్పులన్నీ మందిపుదారుడి నియంత్రణలోనే ఉంటాయి.

డివిడెండ్‌ ప్లాన్‌ ఎంచుకున్నప్పుడు పై విషయాలేమి మదింపుదారుడికి సంబంధం ఉండవు.

  • పనితీరుతో సంబంధం లేకుండా పెట్టుబడి నుంచి కాలానుగుణంగా నిర్ణీత మొత్తాన్ని వెనక్కి తీసుకునేందుకు ఎస్‌డబ్ల్యూపీ ఉపయోగపడుతుంది. ఫండ్‌ కంపెనీలు లాభాలను పంచే అంచనా ఆధారంగా డివిడెండ్‌ ఆప్షన్‌ పనిచేస్తుంది.
  • మార్కెట్‌ పరిస్థితులు ఎలా ఉన్నా క్రమానుగత పెట్టుబడి విత్‌డ్రాయల్‌ ద్వారా సొమ్ముకు చేతికి అందుతుంది. ఫండ్‌ పనితీరు సరిగా లేని సమయాల్లో డివిడెండ్‌ లభించడం కష్టంగా మారుతుంది.
  • డివిడెండ్‌ నుంచి వచ్చిన సొమ్మును మొత్తం ఆదాయంగా పరిగణిస్తారు. అప్పుడు వర్తించే శ్లాబుల ప్రకారం టాక్స్​ కట్టాల్సి ఉంటుంది. ఎస్‌డబ్ల్యూపీలో గ్రోత్‌ ఆప్షన్‌ ఎంచుకుంటారు కాబట్టి.. మూలధన రాబడిపై టాక్స్​ లెక్కిస్తారు. అమ్మిన యూనిట్లు, కొనసాగిన కాలం ప్రకారం పన్నును లెక్కిస్తారు. ఎక్కువ పన్ను శ్లాబు రేటులో ఉన్నప్పుడు డివిడెండ్‌ ఆదాయం వల్ల టాక్స్​ భారం ఎక్కువగా ఉంటుంది.

రోజువారీ ఆదాయ అవసరాలు, జీవన శైలి ఖర్చులు, మరికొన్నింటిని లెక్కించుకొని ఏ విధానంలో పెట్టుబడిని ఉపసంహరించుకోవాలన్నది నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. కచ్చితంగా డబ్బు కావాలనుకునే వారు ఎస్‌డబ్ల్యూపీ విధానాన్ని ఎంచుకోవాలి. ఇన్వెస్ట్​మెంట్​ ద్వారా వచ్చే మొత్తంతో అవసరాలు తక్కువగానే ఉంటే డివిడెండ్‌ ఆప్షన్‌ను పరిశీలించవచ్చు. అవసరమైతే నిపుణుల సలహాను సైతం స్వీకరించాలి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.