ETV Bharat / business

Best Investment Plan : పదవీ విరమణ నాటికి రూ.10 కోట్లు సంపాదించాలా?.. ఇలా ఇన్వెస్ట్ చేయండి! - పదవీ విరమణ నాటికి రూ10 కోట్లు సంపాదించాలా

Best Investment Plan In Telugu : మీ వయస్సు 30 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉందా? బాగా డబ్బు సంపాదించి జీవితంలో స్థిరపడాలని ఆశపడుతున్నారా? అయితే ఇది మీ కోసమే. సరైన విధానంలో పెట్టుబడులు పెడితే, మీరు రిటైర్ అయ్యే నాటికి ఏకంగా రూ.10 కోట్లు వరకు సంపాదించవచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం రండి.

best investment plan for middle aged person
Best Investment Plan
author img

By ETV Bharat Telugu Team

Published : Aug 24, 2023, 8:36 AM IST

Best Investment Plan : ప్రతి వ్యక్తి తాను బాగా సంపాదించి, గొప్పగా బతకాలని ఆశపడతాడు. అందుకోసం జీవితాంతం చాలా కష్టపడి పనిచేస్తుంటాడు. రిటైరయ్యాక హాయిగా జీవించాలని కలలు కంటారు. అయితే కష్టపడడంతో పాటు, కొంచెం తెలివి ఉపయోగించడం ద్వారా, త్వరగా మీ రిటైర్మెంట్ లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది. అది ఎలానో ఇప్పుడు చూద్దాం.

లక్ష్యాన్ని చేధించవచ్చు!
Investment Goal Setting : మీరు 30 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారా? రిటైర్​ అయ్యే నాటికి రూ.10 కోట్లు సంపాదించాలని ఆశిస్తూ ఉన్నారా? అయితే ఇది మీకు కచ్చితంగా సరిపోతుంది.

భారతదేశంలో సాధారణంగా 60 ఏళ్లు వచ్చే నాటికి పదవీ విరమణ చేస్తూ ఉంటారు. ఇదే సమయానికి మీరు రూ.10 కోట్ల సంపదను సులువుగా సంపాదించవచ్చు. అయితే ఇందుకోసం కచ్చితమైన వ్యూహాన్ని అమలు చేయాల్సి ఉంటుంది. అలాగే కొన్ని ప్రత్యేకమైన అంశాలను కూడా పరిశీలించాల్సి ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం.

దీర్ఘకాలిక పెట్టుబడులు
Long Term Investment Plans : ప్రస్తుతం మీ వయస్సు 30 ఏళ్లు అయితే.. మీరు మరో 30 ఏళ్లపాటు దీర్ఘకాలిక పెట్టుబడులను కొనసాగించాల్సి ఉంటుంది. ఒక వేళ మీ వయస్సు 40 ఏళ్లు ఉంటే.. మీరు కనీసం 20 ఏళ్లపాటు పెట్టుబడులను కొనసాగించాల్సి ఉంటుంది.

ఇన్వెస్ట్​మెంట్స్​- రిటర్న్స్​
Rate Of Return Formula : దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టే ముందు కచ్చితంగా మీ పోర్టుఫోలియోను వైవిధ్యంగా రూపొందించుకోవాల్సి ఉంటుంది. ఈక్విటీ ఫండ్స్​లో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టినవారికి అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇందులో రిస్క్​ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. ఒక వేళ మీరు మంచి కేటగిరీ ఈక్విటీ స్టాక్స్​ తీసుకుంటే కొంత వరకు సేఫ్టీ ఉంటుంది. అలాగే మీరు బంగారం, రియల్​ ఎస్టేట్​, ఫిక్స్​డ్ డిపాజిట్స్​, ప్రభుత్వ పథకాలు, ఈక్విటీస్​​, మ్యూచువల్ ఫండ్స్​​.. ఇలా వైవిధ్య భరితమైన పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుది. అప్పుడే మీ పెట్టుబడులు భద్రంగా ఉంటాయి. మంచి రాబడులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఇన్వెస్ట్​మెంట్ రిటర్న్​ ఫార్ములా గురించి తెలుసుకుందాం.

rate of return formula
Rate Of Return Formula : రేట్​ ఆఫ్​ రిటర్న్​ ఫార్ములా
  • R = రిటర్న్​
  • Vf = ఫైనల్ వాల్యూ ( డివిడెండ్స్, వడ్డీ రేట్లు సహితంగా)
  • Vi = ఇనీషియల్ వాల్యూ

వయస్సు - పెట్టుబడి
Age And Investment Calculator : మీ ప్రస్తుత వయస్సు - ఇన్వెస్ట్​మెంట్ స్టైల్​కు అనుగుణంగా పెట్టుబడి మొత్తాలను నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. బ్యాలెన్స్​డ్​గా పెట్టుబడులు పెట్టాలా? లేదా అగ్రెసివ్​గా ఇన్వెస్ట్ చేయాలా? అనేది మీరే నిర్ణయించుకోవాలి.

ప్రస్తుత పరిస్థితుల్లో ఒక వ్యక్తి తాను పదవీ విరమణ చేసేనాటికి రూ.10 కోట్లు సంపాదించాలంటే.. కనీస మొత్తంగా నెలకు రూ.30,000 నుంచి రూ.1.7 లక్షల వరకు పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది.

30 ఏళ్ల వ్యక్తులు 30 ఏళ్లలో రూ.10 కోట్లు సంపాదించడం ఎలా?
How to reach Rs 10 crore in 30 years :

  • మీరు కనుక సంప్రదాయ పెట్టుబడిదారు అయితే.. 30 ఏళ్లకు 8 శాతం సగటు వడ్డీ రేటుతో రూ.10 కోట్లు సంపాదించాలంటే.. ఇప్పటి నుంచే నెలకు రూ.68,000 నుంచి రూ.69,000 వరకు ఇన్వెస్ట్​ చేయాల్సి ఉంటుంది.
  • మీరు బ్యాలెన్స్​డ్ ఇన్వెస్టర్ అయితే, ఈక్విటీ, డెట్​ ఫండ్స్​లో సమానంగా పెట్టబడులు పెట్టాల్సి ఉంటుంది. అప్పడు మీరు 30 ఏళ్లకు 10 శాతం సగటు వడ్డీ రేటుతో రూ.10 కోట్లు సంపాదించాలంటే, నెలకు రూ.46,000 నుంచి రూ.47,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
  • మీరు ప్రధానంగా ఈక్విటీల్లో పెట్టుబడి పెట్టే అగ్రెసివ్​ ఇన్వెస్టర్ అయితే, 30 ఏళ్లలో 12 శాతం సగటు వడ్డీ రేటుతో రూ.10 కోట్లు సంపాదించాలంటే, నెలకు రూ.30,000 నుంచి రూ.31,000 వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

35 ఏళ్ల వ్యక్తులు 25 ఏళ్లలో రూ.10 కోట్లు సంపాదించడం ఎలా?
How to reach Rs 10 crore in 25 years :

  • మీరు కనుక సంప్రదాయ పెట్టుబడిదారు అయితే.. 25 ఏళ్లకు 8 శాతం సగటు వడ్డీ రేటుతో రూ.10 కోట్లు సంపాదించాలంటే.. ఇప్పటి నుంచే నెలకు రూ.1,00,000 నుంచి రూ.1,10,000 వరకు ఇన్వెస్ట్​ చేయాల్సి ఉంటుంది.
  • మీరు బ్యాలెన్స్​డ్ ఇన్వెస్టర్ అయితే, ఈక్విటీ, డెట్​ ఫండ్స్​లో సమానంగా పెట్టబడులు పెట్టాల్సి ఉంటుంది. అప్పడు మీరు 25 ఏళ్లకు 10 శాతం సగటు వడ్డీ రేటుతో రూ.10 కోట్లు సంపాదించాలంటే, నెలకు రూ.77,000 నుంచి రూ.78,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
  • మీరు ప్రధానంగా అగ్రెసివ్​ ఇన్వెస్టర్ అయితే, 25 ఏళ్లలో 12 శాతం సగటు వడ్డీ రేటుతో రూ.10 కోట్లు సంపాదించాలంటే, నెలకు రూ.55,000 నుంచి రూ.56,000 వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

40 ఏళ్ల వ్యక్తులు 20 ఏళ్లలో రూ.10 కోట్లు సంపాదించడం ఎలా?
How to reach Rs 10 crore in 20 years :

  • మీరు కనుక సంప్రదాయ పెట్టుబడిదారు అయితే.. 20 ఏళ్లకు 8 శాతం సగటు వడ్డీ రేటుతో రూ.10 కోట్లు సంపాదించాలంటే.. ఇప్పటి నుంచే నెలకు రూ.1,60,000 నుంచి రూ.1,70,000 వరకు ఇన్వెస్ట్​ చేయాల్సి ఉంటుంది.
  • మీరు బ్యాలెన్స్​డ్ ఇన్వెస్టర్ అయితే, ఈక్విటీ, డెట్​ ఫండ్స్​లో సమానంగా పెట్టబడులు పెట్టాల్సి ఉంటుంది. అప్పడు మీరు 20 ఏళ్లకు 10 శాతం సగటు వడ్డీ రేటుతో రూ.10 కోట్లు సంపాదించాలంటే, నెలకు రూ.1,30,000 నుంచి రూ.1,40,000 పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.
  • మీరు ప్రధానంగా అగ్రెసివ్​ ఇన్వెస్టర్ అయితే, 25 ఏళ్లలో 12 శాతం సగటు వడ్డీ రేటుతో రూ.10 కోట్లు సంపాదించాలంటే, నెలకు రూ.1,00,000 నుంచి రూ.1,10,000 వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.

నోట్​ : మీరు కనుక దీర్ఘకాలిక మూలధన లాభాలపై వేసే పన్నును కూడా పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అలాటప్పుడు ఇక్కడ తెలిపిన పెట్టబడి అంకెల కంటే కాస్త ఎక్కువ మొత్తంలోనే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అయితే మీకు సులువుగా అర్థం కావడం కోసం, ఇక్కడ పన్నులను పరిగణించలేదు.

త్వరగా ప్రారంభిస్తే!
Early Investment Benefits : పొదుపు, మదుపులను ఎంత తొందరగా ప్రారంభిస్తే.. అంత మంచిది. ఎందుకంటే కాంపౌండింగ్ ఎఫెక్ట్​ వల్ల మీ పెట్టుబడులపై భారీ రాబడులు వస్తాయి. చిన్న వయస్సులో పెట్టుబడులు మొదలుపెడితే.. మీ నెలవారీ పెట్టుబడి మొత్తాలు తక్కువగా ఉంటాయి.. రాబడులు ఎక్కువగా ఉంటాయి. అదే ఆలస్యంగా ఇన్వెస్ట్​మెంట్​ స్టార్ట్​ చేస్తే.. మీ నెలవారీ పెట్టుబడి మొత్తాలు అధికంగా ఉంటాయి.. రాబడులు తక్కువగా ఉంటాయి.

ఆదాయం పెరిగినప్పుడు..
Investment Tips : వ్యక్తుల ఆదాయాలు కాలక్రమేణా పెరుగుతూ ఉంటాయి. అందువల్ల మీ ఆదాయం పెరిగిన ప్రతీసారీ మీ పెట్టుబడి మొత్తాలను కూడా పంచుకుంటూ వెళ్లడం మంచి పద్ధతి. దీని వల్ల మీ ఆర్థిక లక్ష్యాన్ని చాలా తొందరగా చేరుకునే వీలు ఉంటుంది.

ఇప్పటికే ఆలస్యమైందా?
Late Investing For Retirement : చాలా మంది నడివయస్సు దాటిపోయి ఉంటారు. మరి ఇలాంటి సమయంలో పెట్టుబడులు పెట్టడం ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు. వాస్తవానికి పొదుపు, మదుపు చేయడానికి సరైన వయస్సు అంటూ ఏమీ ఉండదు. మీరు ఒక క్రమపద్ధతి ప్రకారం, ఇన్వెస్ట్ చేస్తూ వెళ్లండి. కచ్చితంగా మీరు రిటైర్ అయ్యేనాటికి అద్భుతాన్ని చూస్తారు. గొప్ప సంపదను వెనుక వేసుకోగలుగుతారు.

స్టాక్​ మార్కెట్​ ఇన్వెస్ట్​మెంట్ మంచిదేనా?
Stock Market Investment Strategy : స్టాక్​ మార్కెట్​లో పెట్టుబడులు పెట్టడం చాలా రిస్క్​తో కూడుకున్న వ్యవహారమే. అయితే కాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటే మాత్రం ఇవి దీర్ఘకాలంలో మంచి రాబడులను ఇస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. వాస్తవానికి మిగతా పెట్టుబడి మార్గాలతో పోల్చి చూస్తే.. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి మించి అధిక రాబడులను అందించేవి స్టాక్​ మార్కెట్ పెట్టుబడులే.

నిపుణుల సలహాలు తీసుకోండి!
Financial Expert Advice : మీకు స్వయంగా ఆర్థిక విషయాల్లో నైపుణ్యం ఉంటే ఫర్వాలేదు. ఒక వేళ మీకు అలాంటి నిపుణత లేకపోతే మరేమీ చింతించకండి. నేడు సెబీ గుర్తింపు పొందిన మంచి ఆర్థిక నిపుణులు ఎందరో ఉన్నారు. వారిని సంప్రదించి తగిన పెట్టుబడి నిర్ణయాలు తీసుకోండి.

నోట్​ : ప్రస్తుతం మార్కెట్​లో అనేక మంది నకిలీ ఆర్థిక నిపుణులు ఉంటున్నారు. వీరి వలలో చిక్కుకోకుండా జాగ్రత్త పడండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.