ETV Bharat / business

రుణ సమీకరణ యత్నాల్లో 'అదానీ'... ఏకంగా రూ.35,000 కోట్ల కోసం.. - అదానీ గ్రూప్ రుణ సమీకరణ

Adani group loans: విదేశీ రుణాల ద్వారా 450 కోట్ల డాలర్ల (సుమారు రూ.35,000 కోట్లు) మేర రుణాలు సేకరించాలని ఆదానీ గ్రూప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కొనుగోలు చేసిన సిమెంట్ కంపెనీలకు సంబంధించిన చెల్లింపుల కోసం నిధుల సేకరణ యత్నాలు ప్రారంభించింది. విదేశీ కరెన్సీలో ఒక భారతీయ కంపెనీ సమీకరించబోతున్న మొత్తంలో ఇప్పటివరకు ఇదే అత్యధికమని సమాచారం.

ADANI GROUP LOAN
ADANI GROUP LOAN
author img

By

Published : Jun 13, 2022, 7:14 AM IST

Adani group loans: సిమెంటు రంగంలో దిగ్గజంగా ఎదిగేందుకు కంపెనీలను కొనుగోలు చేసిన అదానీ గ్రూప్‌, సంబంధిత చెల్లింపులు జరిపేందుకు భారీమొత్తం రుణాలు సమీకరించే ప్రయత్నాల్లో ఉంది. విదేశీ రుణాల ద్వారా 450 కోట్ల డాలర్ల (సుమారు రూ.35,000 కోట్లు) మేర రుణాలు సేకరించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల అదానీ గ్రూప్‌ అంబుజా సిమెంట్స్‌, ఏసీసీ కంపెనీల్లో హోల్సిమ్‌కు ఉన్న వాటాల్ని 1,050 కోట్ల డాలర్లకు (సుమారు రూ.81,000 కోట్లు) కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం నిధుల సమీకరణ యత్నాలు ప్రారంభించింది. విదేశీ బ్యాంకుల నుంచి 450 కోట్ల డాలర్లను రుణంగా పొందేందుకు మెజనైన్‌ ఫైనాన్సింగ్‌, స్టాక్‌ బ్యాక్డ్‌ బ్రిడ్జ్‌ రుణాలు, 18 నెలల సీనియర్‌ డెట్‌ ఫెసిలిటీ వంటి పలు పద్ధతుల్లో నిధులు సమీకరించే యత్నాలు చేస్తున్నట్లు సమాచారం. విదేశీ కరెన్సీలో ఒక భారతీయ కంపెనీ సమీకరించబోతున్న మొత్తంలో ఇప్పటివరకు ఇదే అత్యధికమని తెలుస్తోంది.

బార్‌క్లేస్‌, డాయిష్‌ బ్యాంక్‌, స్టాండర్డ్‌ ఛార్టర్డ్‌ బ్యాంక్‌లే మొత్తం నిధులు అందించడానికి గతంలో ముందుకొచ్చినా, ఇప్పుడు మరిన్ని బ్యాంకులు ఈ లావాదేవీల్లో పాల్గొనబోతున్నాయని సమాచారం. సీనియర్‌ డెట్‌ ఫెసిలిటీ పద్ధతిలో 300 కోట్ల డాలర్లు, మెజనైన్‌ ఫైనాన్స్‌ మార్గంలో 100 కోట్ల డాలర్లు, 1-3 ఏళ్ల మెచ్యూరిటీతో 50 కోట్ల డాలర్ల బ్రిడ్జ్‌ రుణాలు అదానీ గ్రూప్‌ తీసుకోనుంది. సిటీ, జేపీ మోర్గాన్‌, ఎంయూఎఫ్‌జీ, మిజుహో బ్యాంక్‌, ఎస్‌ఎంబీసీతో పాటు కొన్ని మధ్య ప్రాచ్య రుణదాతల్నీ సంప్రదిస్తున్నట్లు సమాచారం. మెజనైన్‌ ఫైనాన్సింగ్‌ అనేది డెట్‌, ఈక్విటీ ఫైనాన్సింగ్‌కు హైబ్రిడ్‌ నమూనా. ఒకవేళ కంపెనీ డిఫాల్ట్‌ అయ్యే పక్షంలో రుణాన్ని ఈక్విటీగా మార్చుకునే వెసులుబాటు కంపెనీకి లభిస్తుంది. ప్రతి బ్యాంక్‌ నుంచి 20-50 కోట్ల డాలర్ల వరకు రుణం తీసుకునేందుకు అదానీ గ్రూప్‌ అవకాశాలను పరిశీలిస్తోంది.

రుణ గిరాకీ పుంజుకుంటోంది: ఎస్‌బీఐ ఛైర్మన్‌ దినేశ్‌ ఖారా

వరుసగా రెండేళ్ల పాటు రుణాల జారీ నెమ్మదించినా, ఇప్పుడు మళ్లీ పుంజుకుంటోందని స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఛైర్మన్‌ దినేశ్‌ కుమార్‌ ఖారా పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందనడానికి ఇది నిదర్శనమని వివరించారు. 71 బిలియన్‌ డాలర్ల రుణాలకు అభ్యర్థనలు రాగా, కంపెనీలు స్థిరంగా అప్పులు తీసుకుంటున్నాయని అన్నారు. రూ.120 లక్షల కోట్ల విలువైన భారత బ్యాంకింగ్‌ వ్యవస్థ వచ్చే మూడేళ్లలో వేగవంతమైన వృద్ధి సాధించొచ్చని అభిప్రాయపడ్డారు. పెరుగుతున్న వ్యయాలు, వ్యాపార విస్తరణ, అదనపు సామర్థ్యం కోసం పెట్టుబడుల వంటి అవసరాల కోసం కంపెనీలు రుణాలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఉక్కు వంటి పలు రంగాల్లో సామర్థ్య వినియోగం పూర్తి స్థాయిలో ఉందని, ఈ ఏడాది మంచి వర్షపాతం నమోదైతే పరిస్థితులు మరింత మెరుగవుతాయని దినేశ్‌ కుమార్‌ అంచనా వేశారు. ఎస్‌బీఐ డిజిటల్‌ బ్యాంకింగ్‌ వినియోగించుకుంటున్న వారి సంఖ్య భారీగా పెరుగుతోందని అన్నారు. ప్రస్తుతం మొబైల్‌ బ్యాంకింగ్‌ యాప్‌ యోనోకు 46.7 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.