ETV Bharat / business

ఆర్​బీఐ గవర్నర్​ ప్రకటనలో కీలక అంశాలు ఇవే.. - reporate latest news

కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేలా రిజర్వు బ్యాంకు గవర్నర్ శక్తికాంతదాస్​ కీలక ప్రకటన చేశారు. రెపో రేటు, రివర్స్ రెపో రేటును తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. టర్మ్​ లోన్లపై మారటోరియాన్ని మరో 90 రోజులు పొడిగించారు.

BIZ-RBI
ఆర్బీఐ గవర్నర్​
author img

By

Published : May 22, 2020, 11:25 AM IST

ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేలా రిజర్వు బ్యాంకు కీలక నిర్ణయాలు ప్రకటించింది. కేంద్రం రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించిన తర్వాత ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ మొదటిసారి మీడియా ముందుకొచ్చారు. ద్రవ్యపరపతి సమీక్ష అనంతరం శక్తికాంతదాస్‌ పలు విషయాలను వెల్లడించారు.

  • రెపో రేటు 4.40 నుంచి 4 శాతానికి (40 బేసిస్‌ పాయింట్లు) తగ్గింపు. రెపో రేటు తగ్గింపును 5-1 ఓట్లతో ఆరుగురు సభ్యుల కమిటీ ఆమోదించింది. ఈ నిర్ణయంతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న పరిశ్రమ వర్గాలకు కొంతమేర ఊరట లభిస్తుంది.
  • రివర్స్​ రెపో రేటు 3.35 శాతానికి తగ్గింపు.
  • ద్రవ్యోల్బణం అంచనా వేయడం చాలా కష్టంగా మారింది. మున్ముందు ద్రవ్యోల్బణం లాక్‌డౌన్‌ నిబంధనల అమలుపై ఆధారపడి ఉండవచ్చు.
  • ఆర్థిక మందగమనంతో ప్రభుత్వ ఆదాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.
  • టర్మ్‌లోన్లపై మారటోరియం మరో 90 రోజులు పొడిగింపు (జూన్‌ 1 నుంచి ఆగస్టు 31 వరకు)
  • మార్చి, ఏప్రిల్‌లో సిమెంట్‌, ఉక్కు పరిశ్రమపై ప్రతికూల ప్రభావం పడింది. సిమెంట్‌ ఉత్పత్తిలో 25 శాతం తగ్గింది.
  • మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి 17 శాతం మేర పడిపోయింది. ఏప్రిల్‌లో తయారీ రంగం ఎన్నడూలేనంత క్షీణత నమోదు చేసింది.
  • ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరగడం వల్ల ఆహార భద్రతకు భరోసా ఏర్పడింది. వ్యవసాయ రంగంలో ఉత్పత్తి పెరగడంతో వ్యవసాయ రంగానికి మరింత ప్రోత్సాహకం ఉంటుంది.
  • కూరగాయలు, నూనె గింజల ధరలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
  • ఈ ఏడాది రుతుపవనాలు సాధారణంగానే ఉంటాయి. కరోనా అనంతర పరిస్థితుల్లో డిమాండ్‌ ఆధారంగా ద్రవ్యోల్బణం భవిష్యత్తు.
  • ఆర్థిక వ్యవస్థకు తీవ్రమైన సవాళ్లు పొంచి ఉన్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 23 పైసలు తగ్గిందని ఆర్‌బీఐ గవర్నర్‌ వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.