ETV Bharat / business

జియో​లోకి మరో రూ.11,367 కోట్ల పెట్టుబడులు

author img

By

Published : May 8, 2020, 8:20 AM IST

Updated : May 8, 2020, 11:02 AM IST

టెలికాం దిగ్గజం రిలయన్స్ జియోలో అమెరికాకు చెందిన ప్రముఖ సంస్థ విస్టా రూ.11,367 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఈ ఒప్పందంతో 2.3 శాతం వాటను విస్టాకు బదిలీ చేయనుంది జియో.

jio vist deal
జియో విస్టా డీల్​

ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియోలోకి విదేశీ సంస్థల నుంచి పెట్టుబడుల ప్రవాహం కొసాగుతోంది. ఇప్పటికే ఫేస్​బుక్, సిల్వర్​ లేక్ వంటి సంస్థలు జియోలో భారీ పెట్టుబడులు పెట్టగా.. ఇప్పుడు వీటి సరసన అమెరికాకు చెందిన మరో సంస్థ విస్టా ఈక్విటీ పార్ట్​నర్స్ చేరింది. జియో ప్లాట్​ఫామ్స్​లో విస్టా రూ.11,367 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు జియో వెల్లడించింది. ఈ పెట్టుబడితో 2.3 శాతం వాటను విస్టాకు బదిలీ చేయనున్నట్లు పేర్కొంది జియో .

విస్టా పెట్టుబడితో జియో ప్లాట్​ఫాం ఈక్విటీ విలువ రూ.4.91 లక్షల కోట్లకు, ఎంటర్​ప్రైజెస్ విలువ రూ.5.16 లక్షల కోట్లకు పెరగనున్నట్లు రిలయన్స్ వెల్లడించింది.

జియోలో ఇప్పటికే ఫేస్​బుక్​ రూ.43,574 కోట్లతో 9.99 శాతం వాటా, సిల్వర్​ లేక్​ రూ.5,655.75 కోట్లతో 1.15 శాతం వాటా కొనుగోలు చేశాయి.

ఇదీ చూడండి:ఫేస్​బుక్ నుంచి త్వరలో ఉచిత ఇంటర్నెట్​

Last Updated : May 8, 2020, 11:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.