ETV Bharat / business

మందుబాబుల సంఖ్యలో ఈ రాష్ట్రాలే టాప్! - మద్యం అధికంగా సేవించే రాష్ట్రాల జాబితా

మద్యం సేవించేవారు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఉత్తర్​ప్రదేశ్ తొలి స్థానంలో​, బంగాల్​ రెండో స్థానంలో ఉందని ఓ అద్యయనంలో తేలింది. ఆయా రాష్ట్రాలకు మద్యం ద్వారా గణనీయమైన ఆదాయం వస్తుందని వెల్లడైంది.

study on alcohol consuming
మద్యం సేవించే వారిపై అధ్యయనం
author img

By

Published : Aug 13, 2021, 5:45 PM IST

Updated : Aug 13, 2021, 5:52 PM IST

మద్యం సేవించే వారి సంఖ్య అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఉత్తర్​ప్రదేశ్, బంగాల్ తొలి​ రెండు స్థానాల్లో ఉన్నట్లు ఐసీఆర్​ఐఈఆర్​, పీఎల్​ఆర్​ ఛాంబర్స్​ నిర్వహించిన అధ్యయనం చెబుతోంది.

దాదాపు 1.4 కోట్ల మంది బంగాల్​లో మద్యం సేవిస్తారని ఈ అధ్యయనం చెప్పింది. రాష్ట్రానికి ఎక్కువ ఆదాయాన్ని అందించే మూడు రంగాల్లో ఇదీ ఒకటి అని తెలిపింది. అయితే.. బంగాల్​లో ఇటీవల మద్యం ధరల్లో మార్పులు చేయడం వల్ల ఈ రంగం ద్వారా వచ్చే ఆదాయంపై ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పింది.

రిటైల్ మద్యం ధరలు పెరిగినందున దేశీయంగా తయారయ్యే విదేశీ లిక్కర్​ అమ్మకాలు.. బంగాల్​లో గణనీయంగా తగ్గాయని అధ్యయనం పేర్కొంది.

నివేదిక ఇంకా చెప్పిందంటే..?

  • ప్రపంచవ్యాప్తంగా అల్కహాలిక్​ బేవరేజెస్​ అత్యధిక వేగంతో వృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్​ ఒకటి. 2020లో ఈ రంగం విపణి విలువ 52.5 బిలియన్ డాలర్లుగా ఉన్నట్లు అంచనా.
  • 2020 నుంచి 2023 మధ్య అల్కహాలిక్​ బేవరేజెస్​ మార్కెట్​ సీఏజీఆర్​ 6.8శాతం వృద్ధి చెందుతుందని అంచనా.
  • 2015-16, 2018-19 మధ్య కాలంలో.. ఆల్కహాల్​ బేవరేజెస్​ ఉత్పత్తి23.8శాతం మేర పెరిగింది. ఈ రంగంలో 15లక్షల మందికి ఉపాధి అవకాశాలు దొరికాయి.
  • 2019లో భారత్​లో 48.8బిలియన్ల అమ్మకాలు జరిగాయి.

అయితే.. చిలీ, అర్జెంటీనా, చైనా తరహాలో మద్యాన్ని భారీగా ఎగుమతి చేసే దేశాల స్థాయికి భారత్​ ఇంకా చేరుకోలేదని ఈ అధ్యయనం చెప్పింది.

ఇదీ చూడండి: సుంకం తగ్గిస్తాం సరే.. ఇంతకీ భారత్‌లో మీరేం చేస్తారు?

ఇదీ చూడండి: రాష్ట్ర ప్రభుత్వం గిఫ్ట్​- భారీగా తగ్గనున్న పెట్రోల్​ ధర

Last Updated : Aug 13, 2021, 5:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.