ETV Bharat / business

ఆరంభంలో ఆందోళన.. చివర్లో అదరహో - నిఫ్టీ

stocks today
నేటి స్టాక్ మార్కెట్లు
author img

By

Published : Jun 12, 2020, 9:32 AM IST

Updated : Jun 12, 2020, 3:57 PM IST

15:53 June 12

ఆరంభ నష్టాలు మాయం..

వారంలో చివరి రోజును స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిసాయి. సెన్సెక్స్ 242 పాయింట్లు పుంజుకుని 33,781 వద్దకు చేరింది. నిఫ్టీ 71 పాయింట్లు బలపడి 9,972 వద్ద స్థిరపడింది.

ఆటో, టెలికాం, బ్యాంకింగ్ షేర్లు చివరి గంటలో రాణించిన కారణంగా.. ఆరంభ నష్టాలను దాటుకుని లాభాలను గడించాయి సూచీలు.

ఎం&ఎం, బజాజ్ ఫినాన్స్, హీరో మోటోకార్ప్, రిలయన్స్, టైటాన్​, బజాజ్ ఆటో, మారుతీ షేర్లు లాభపడ్డాయి.

ఓఎన్​జీసీ, టెక్ మహీంద్రా, పవర్​ గ్రిడ్, ఇన్ఫోసిస్, కోటక్ బ్యాంక్, టీసీఎస్​ షేర్లు నష్టాలతో ముగిశాయి.

15:00 June 12

ఆటో షేర్ల దన్ను..

చివరి గంటలో నమోదవుతున్న కొనుగోళ్లతో స్టాక్ మార్కెట్లు అనూహ్యంగా లాభాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 210 పాయింట్లకుపైగా లాభంతో 33,740 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 60 పాయింట్లకుపైగా బలపడి 9,963 వద్ద కొనసాగుతోంది.

ఆటో షేర్లు లాభాలకు దన్నుగా నిలుస్తున్నాయి.

ఎం&ఎం, బజాజ్ ఫినాన్స్, హీరో మోటోకార్ప్, టైటాన్, రిలయన్స్, మారుతీ షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఓఎన్​జీసీ, టెక్ మహీంద్రా, పవర్​ గ్రిడ్​, హెచ్​సీఎల్​టెక్, టీసీఎస్​ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

13:54 June 12

రికవరీ దిశగా మార్కెట్లు..

భారీ నష్టాల నుంచి నెమ్మదిగా తేరుకుంటున్నాయి స్టాక్ మార్కెట్లు. సెషన్ ముంగింపునకు ముందు లభిస్తున్న కొనుగోళ్ల మద్దతుతో సెన్సెక్స్ నష్టం 140 పాయింట్లకు తగ్గింది. ప్రస్తుతం ఈ సూచీ 33,397 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 80 పాయింట్ల నష్టంతో 9,818 వద్ద కొనసాగుతోంది.

రిలయన్స్, బజాజ్ ఫినాన్స్, భారతీ ఎయిర్​టెల్, సన్​ఫార్మా, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఆటో షేర్లు ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి.

ఓఎన్​జీసీ, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా, ఎల్​&టీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

13:09 June 12

స్థిరంగా నష్టాలు..

మిడ్​ సెషన్ తర్వాత స్టాక్ మార్కెట్లు నష్టాల్లో స్థిరంగా కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ దాాదాపు 530 పాయింట్లు కోల్పోయి 33,008 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాాదాపు 140 పాయింట్ల నష్టంతో 9,749 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది.

ఏషియన్​ పెయింట్స్, భారతీ ఎయిర్​టెల్, సన్​ఫార్మా, టైటాన్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

ఓఎన్​జీసీ, యాక్సిస్ బ్యాంక్, ఇండస్​ఇండ్ బ్యాంక్, ఎల్​&టీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

11:34 June 12

మిడ్​ సెషన్​ ముందు కాస్త ఉపశమనం..

స్టాక్ మార్కెట్లలో నష్టాలు కొనసాగుతున్నాయి. సెన్సెక్స్​ 430 పాయింట్లకుపైగా కోల్పోయి 33,105 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 130 పాయింట్లకుపైగా క్షీణతతో 9,765 వద్ద ట్రేడింగ్ సాగిస్తోంది. ఆరంభ సెషన్​తో పోలిస్తే మిడ్ సెషన్​​ ముందు సూచీలు కాస్త కోలుకున్నాయి.

టైటాన్​, భారతీ ఎయిర్​టెల్, అల్ట్రాటెక్ సిమెంట్ షేర్లు స్వల్ప లాభాల్లో ఉన్నాయి.  

ఇండస్​ఇండ్ బ్యాంక్​, ఓఎన్​జీసీ, టెక్ మహీంద్రా, టాటా స్టీల్, ఇన్ఫోసిస్, ఎల్​&టీ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

10:50 June 12

రూపాయి 31 పైసలు క్షీణత..

స్టాక్ మార్కెట్లలో భారీ నష్టాలు ట్రేడవుతున్నాయి.. సెన్సెక్స్ 620 పాయింట్లకుపైగా కోల్పోయి 32,917 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ దాదాపు 170 పాయింట్ల పతనంతో 9,736 వద్ద ట్రేడవుతోంది.

  • భారతీ ఎయిర్​టెల్, నెస్లే, టైటాన్​, సన్​ఫార్మా షేర్లు స్వల్ప లాభాల్లో ఉన్నాయి.
  • ఇండస్​ఇండ్ బ్యాంక్, ఓఎన్​జీసీ, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.
  • కరెన్సీ మార్కెట్​లో రూపాయి ఆరంభ సెషన్​లోనే 31 పైసలు కోల్పోయింది. డాలర్​తో పొలిస్తే మారకం విలువ రూ.76.10 వద్దకు చేరింది.
  • ముడి చమురు ధరల సూచీ-బ్రెంట్ 1.53 శాతం తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్​లో బ్యారెల్ ముడి చమురు ధర 37.96 డాలర్లుగా ఉంది.

09:53 June 12

ఇండస్​ఇండ్ బ్యాంక్ షేర్లు పతనం..

వారాంతపు సెషన్​లో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 780 పాయింట్లకు పైగా నష్టంతో 32,754 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 220 పాయింట్లకుపైగా కోల్పోయి 9,675 వద్ద కొనసాగుతోంది.

అమెరికాలో కరోనా కేసులు మళ్లీ భారీ పెరుగుతున్న నేపథ్యంలో ఆర్థిక వృద్ధిపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ కారణంగా మార్చి తర్వాత అత్యధికంగా గురువారం సెషన్​లో డౌజోన్స్ 6.90 శాతం, ఎస్​&పీ 500.. 5.9 శాతం కుప్పకూలాయి. ఈ ప్రతికూలతలు ప్రపంచ మార్కెట్లన్నింటిపైనా కనిపిస్తోంది.

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లన్నీ కూడా శుక్రవారం సెషన్​ను నష్టాలతో ప్రారంభించాయి.

30 షేర్ల ఇండెక్స్​లో ఎయిర్​టెల్​ మాత్రమే లాభాల్లో ఉంది.

గత సెషన్​ వరకు అత్యధిక లాభాలతో దూసుకుపోయిన ఇండస్​ఇండ్​ బ్యాంక్ శుక్రవారం 6 శాతానికిపైగా కుప్పకూలింది. ఓఎన్​జీసీ, కోటక్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

09:26 June 12

భారీ నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు

స్టాక్​మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఆసియా, అమెరికా మార్కెట్లలో ప్రతికూలతలతో దేశీయ సూచీలు నష్టాల బాట పట్టాయి. బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 800 పాయింట్లకుపైగా నష్టపోయింది. ప్రస్తుతం 32 వేల 761 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 225 పాయింట్లు క్షీణించి.. 9 వేల 676 వద్ద ట్రేడవుతోంది. 

Last Updated : Jun 12, 2020, 3:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.