ETV Bharat / business

పండుగ డిమాండ్​తో పెరిగిన కార్ల విక్రయాలు - ,ఫాడా వాహన విక్రయాల డేటా

దేశీయంగా వాహన రిటైల్ విక్రయాలు నవంబర్​నూ భారీగా 19.29 శాతం తగ్గాయి. గత నెల మొత్తం 18,27,990 యూనిట్లు విక్రయించినట్లు వాహన డీలర్ల సమాఖ్య 'ఫాడా' ప్రకటించింది. అయితే దీపావళి, దంతేరాస్ వంటి పండుగల నేపథ్యంలో కార్ల విక్రయాలు మాత్రం స్వల్పంగా 4 శాతం పెరిగినట్లు వెల్లడించింది.

FADA on Vehicle Sales report
నవంబర్​లో తగ్గిన వాహన విక్రయాలు
author img

By

Published : Dec 8, 2020, 1:49 PM IST

Updated : Dec 8, 2020, 4:45 PM IST

ప్యాసింజర్ వాహనాల రిటైల్ విక్రయాలు నవంబర్​​లో స్వల్పంగా పెరిగాయి. గత ఏడాది నవంబర్​తో పోలిస్తే.. ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 4.17 శాతం పుంజుకున్నట్లు వాహన డీలర్ల సమాఖ్య 'ఫాడా' ప్రకటించింది. దీపావళి, దంతేరాస్ వంటి పండుగల నేపథ్యంలో గత నెల మొత్తం 2,91,001 యూనిట్లు విక్రయమైనట్లు వెల్లడించింది. 2019 నవంబర్​లో 2,79,365 ప్యాసింజర్ వాహనాలు అమ్ముడవ్వడం గమనార్హం.

నవంబర్ వాహన రిటైల్ విక్రయాలు ఇలా..

  • ద్విచక్రవాహనాల విక్రయాలు గత నెల 21.4 శాతం తగ్గి.. 14,13,378 యూనిట్లుగా నమోదయ్యాయి. 2019 నవంబర్​లో 17,98,201 ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి.
  • వాణిజ్య వాహనాల విక్రయాలు నవంబర్​లో భారీగా 31.22 శాతం పడిపోయాయి. గత నెల 50,113 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. 2019 నవంబర్​​లో 72,863 వాణిజ్య వాహనాలు విక్రయమవ్వడం గమనార్హం.
  • ఈ ఏడాది నవంబర్​లో 24,185 త్రిచక్ర వాహనాలు మాత్రమే అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో విక్రయమైన 69,056 యూనిట్లతో పోలిస్తే.. ఇవి 64.98 శాతం తక్కువ.
  • ట్రాక్టర్ల విక్రయాలు నవంబర్​లోనూ 8.74 శాతం పెరిగాయి. గత నెల మొత్తం 49,313 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2019 ఇదే సమయంలో 45,462 ట్రాక్టర్లు విక్రయమయ్యాయి.
  • అన్ని విభాగాల్లో కలిపి వాహన విక్రయాలు నవంబర్​​లో 19.29 శాతం తగ్గాయి. మొత్తం 18,27,990 యూనిట్లు విక్రయమయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో విక్రయమైన వాహనాల సంఖ్య 22,64,947గా ఉంది.

ఇదీ చూడండి:'విదేశీ పెట్టుబడులకు గమ్యస్థానం భారత్​'

Last Updated : Dec 8, 2020, 4:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.