ETV Bharat / business

రూ.లక్ష కోట్లతో వ్యవసాయ రంగానికి కొత్త రూపు - నిర్మలా సీతారామన్

ఆత్మనిర్భర భారత్​ అభియాన్​లో భాగంగా మూడో రోజు ఆర్థిక ప్యాకేజీ వివరాలు వెల్లడించారు కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్. రైతులు, పశువుల పెంపకందారుల సంక్షేమానికి సంబంధించిన 11 అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టం చేశారు. ఇందులో 8 మౌలిక వసతుల బలోపేతం, నిల్వ సామర్థ్యం పెంపునకు సంబంధించినవని వెల్లడించారు.

nirmala
నిర్మలా సీతారామన్ మీడియా సమావేశం
author img

By

Published : May 15, 2020, 5:20 PM IST

ఆత్మనిర్భర భారత్​ అభియాన్​లో భాగంగా మూడో రోజు ఆర్థిక ప్యాకేజీ వివరాలు వెల్లడించారు కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్. మొత్తం 11 అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు స్పష్టం చేశారు. ఇందులో 8 మౌలిక వసతుల బలోపేతం, నిల్వ సామర్థ్యం పెంపునకు సంబంధించినవి కాగా.. 3 పరిపాలనాపరమైన సంస్కరణలు ఉన్నట్లు వెల్లడించారు.

వ్యవసాయ రంగ మౌలిక సదుపాయాల అభివృద్ధికి లక్ష కోట్ల రూపాయలు కేటాయింపు సహా మత్స్యకారులకు ప్రయోజనం కలిగేలా మత్స్య సంపద యోజన తీసుకొస్తున్నట్లు ప్రకటించారు నిర్మల.

మౌలిక వసతుల అభివృద్ధికి 8 చర్యలు

1. లక్ష కోట్ల నిధి

  • మౌలిక వసతుల అభివృద్ధికి సాధ్యమైనంత త్వరలో లక్ష కోట్ల నిధి ఏర్పాటు
  • అగ్రిగేటర్లు, కో-ఆప్​లు ద్వారా నిధుల అందజేత
  • కోల్డ్ స్టోరేజ్​లు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి కోసం ప్రైవేటు సంస్థలు, స్టార్టప్​లు

2. మైక్రో ఫుడ్ ఎంటర్​ప్రైజెస్​కు...

  • మైక్రో ఫుడ్​ ఎంటర్​ప్రైజెస్​ కోసం 10 వేల కోట్ల నిధి
  • ప్రధాని చెప్పిన 'వోకల్ ఫర్ లోకల్' సాకారం చేసే దిశగా కేటాయింపులు
  • స్థానిక ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయి విపణులకు చేర్చేందుకు నిధితో సాయం
  • దేశవ్యాప్తంగా స్థానిక ఆహార ఉత్పత్తుల ఆధారంగా క్లస్టర్ల ఏర్పాటు
  • స్థానికంగా ఉన్న ప్రత్యేక ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్
  • రెండు లక్షల మైక్రో ఫుడ్​ ఎంటర్​ప్రైజెస్​కు ప్రయోజనం

3. మత్స్యకారులకు

  • ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ద్వారా మత్స్యకారులకు రూ.20 వేల కోట్లు
  • ఆక్వాకల్చర్​ కోసం 11 వేల కోట్లు కేటాయింపు
  • మౌలిక వసతుల కోసం 9 వేల కోట్లు
  • ఈ చర్యలతో రానున్న ఐదేళ్లలో అదనంగా 70 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి
  • 55 లక్షల మందికి ఉపాధి
  • ఎగుమతుల విలువ రెట్టింపై లక్ష కోట్లకు చేరే అవకాశం

4. పశు వ్యాధుల నియంత్రణ

  • ఇప్పటికే రూ.13,343 కోట్లతో జాతీయ పశు వ్యాధుల నియంత్రణ కార్యక్రమం ప్రారంభం
  • పశువులన్నింటికీ 100 శాతం టీకాలు ఇవ్వడం లక్ష్యం
  • ఎఫ్​ఎండీ, బ్రూసెలోసిస్ ​నుంచి దేశంలోని 53 కోట్ల పశువులను రక్షించేలా టీకాలు
  • ఇప్పటివరకు కోటిన్నర ఆవులు, గేదెలకు టీకాల పూర్తి...
  • లాక్​డౌన్​ ఉన్నా గ్రీన్​జోన్​లో కార్యక్రమం అమలు

5. పశు సంవర్థక రంగ మౌలికం

  • రూ.15 వేల కోట్లతో పశు సంవర్థక రంగ మౌలిక వసతుల అభివృద్ధి నిధి ఏర్పాటు
  • పాడి పరిశ్రమలో ప్రైవేటు పెట్టుబడులకు ప్రయత్నం
  • పాడి అనుబంధ ఉత్పత్తుల పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహకాలు

6. ఔషధ మొక్కల పెంపకం

  • ఔషధ విలువలున్న మొక్కలు పెంపకానికి రూ.4వేల కోట్లు
  • రానున్న రెండేళ్లలో 10 లక్షల హెక్టార్లలో సాగు
  • రైతులకు రూ.5 వేల కోట్ల ఆదాయం
  • గంగా నది ఒడ్డున 800 హెక్టార్లలో ఔషధ మొక్కల కారిడార్ అభివృద్ధి

7. తేనెటీగల పెంపకం

  • తేనెటీగల అభివృద్ధి, నిల్వ కేంద్రాలు సహా ఇతర సౌకర్యాలకు మౌలిక సదుపాయాల అభివృద్ధి
  • రూ.500 కోట్లతో పథకం అమలు
  • పాలినేషన్ ద్వారా నాణ్యమైన ఉత్పత్తులు
  • ఆదాయం పెరుగుదలతో 2 లక్షల మందికి తేనెటీగల పెంపకందారులకు లబ్ధి

8. టాప్​ టు టోటల్

టమాట(టీ), ఉల్లిపాయలు(ఓ), బంగాళదుంపలకు వర్తించే ఆపరేషన్ గ్రీన్స్ పథకాన్ని అన్ని పళ్లు, కూరగాయలకు(టోటల్) వర్తించేలా మార్పులు చేశారు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్.

  • టాప్​ టు టోటల్​ పథకానికి అదనంగా రూ.500 కోట్లు
  • రవాణా, కోల్డ్ స్టోరేజ్ సహా గోదాముల ఖర్చుపై 50శాతం రాయితీ
  • 6 నెలల పైలట్​ పథకంగా అమలు
  • దీని ద్వారా రైతలకు మెరుగైన ధర
  • వృథాను నివారించడం సహా వినియోగదారులకు చౌక ఉత్పత్తులు అందించడమే లక్ష్యం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.