ETV Bharat / business

ఆర్థిక, విద్యుత్ షేర్ల దూకుడు.. నిఫ్టీ@10,471

stocks markets today
నేటి స్టాక్ మార్కెట్లు
author img

By

Published : Jun 23, 2020, 9:33 AM IST

Updated : Jun 23, 2020, 3:55 PM IST

15:49 June 23

ఎల్​&టీ అదుర్స్​..

వారంలో రెండో రోజును భారీ లాభాలతో ముగించాయి స్టాక్ మార్కెట్లు.  మంగళవారం సెషన్​లో సెన్సెక్స్ 519 పాయింట్లు బలపడి 35,430 వద్దకు చేరింది. నిఫ్టీ 160 పాయింట్లు పుంజుకుని 10,471 వద్ద స్థిరపడింది.

ఆర్థిక, విద్యుత్​, మౌలిక సదుపాయాల రంగాలు ప్రధానంగా రాణించాయి.

లాభనష్టాల్లోనివి ఇవే..

ఎల్​&టీ, బజాజ్ ఫినాన్స్, ఇండస్​ఇండ్ బ్యాంక్, ఎన్​టీపీసీ, పవర్​గ్రిడ్​, ఎం&ఎం షేర్లు లాభపడ్డాయి.

వరుస లాభాలతో దూసుకుపోతున్న రిలయన్స్ షేర్లు ఈ సెషన్​లో డీలా పడ్డాయి. భారతీ ఎయిర్​టెల్, మారుతీ షేర్లూ నష్టాలను నమోదు చేశాయి.

14:53 June 23

బుల్​ దూకుడు..

స్టాక్ మార్కెట్లలో లాభాల జోరు కొనసాగుతోంది. సెన్సెక్స్ దాదాపు 500 పాయింట్ల వృద్ధితో 35,410 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 140 పాయింట్లకుపైగా లాభంతో 10,450 వద్ద కొనసాగుతోంది.

  • బ్యాంకింగ్, మౌలిక వసతులు, విద్యుత్ రంగాలు ప్రధానంగా లాభాలకు ఊతమందిస్తున్నాయి.
  • ఇండస్​ఇండ్​, ఎల్​&టీ, ఎన్​టీపీసీ, బజాజ్​ ఫినాన్స్, పవర్​గ్రిడ్, ఎం&ఎం షేర్లు లాభాల్లో ఉన్నాయి.
  • 30 షేర్ల ఇండెక్స్​లో రిలయన్స్, భారతీ ఎయిర్​టెల్ మాత్రమే నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

12:49 June 23

10,400 పైకి నిఫ్టీ..

స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 300 పాయింట్లకుపైగా పెరిగి 35,215 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 100 పాయింట్లకుపైగా బలపడి 10,410 వద్ద ట్రేడవుతోంది.

అంతర్జాతీయ మార్కెట్ల దన్నుతో దాదాపు అన్ని రంగాలు సానుకూలంగా స్పందిస్తున్నాయి. 

  • ఎల్​&టీ అత్యధిక లాభాల్లో ఉంది. ఇండస్ఇండ్ బ్యాంక్, ఎన్​టీపీసీ, బజాజ్ ఫినాన్స్, హెచ్​యూఎల్​, పవర్​గ్రిడ్, ఎం&ఎం, ఇన్ఫోసిస్​ జోరు కనబరుస్తున్నాయి.
  • లాభాల స్వీకరణ కారణంగా రిలయన్స్​ ఇండస్ట్రీస్ ఒడుదొడుకులు ఎదుర్కొంటోంది. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, హెచ్​డీఎఫ్​సీ, భారతీ ఎయిర్​టెల్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

10:06 June 23

జోరు తగ్గిన రిలయన్స్..

స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ దాదాపు 70 పాయింట్లు బలపడి 34,980 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ దాదాపు 30 పాయింట్ల వృద్ధితో 10,340 వద్ద కొనసాగుతోంది.

అంతర్జాతీయ సానుకూలతలతో ఆరంభంలో భారీ లాభాల దిశగా పయనించాయి సూచీలు. అయితే రిలయన్స్, టీసీఎస్​ వంటి హెవీ వెయిట్​ షేర్లలో అమ్మకాలు నమోదవుతుండటం వల్ల కొద్దిసేపటికే స్వల్ప లాభాల్లోకి జారుకున్నాయి.

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లు అయిన షాంఘై, టోక్యో, హాంకాంగ్, సియోల్ సూచీలు లాభాలతో సెషన్ ప్రారంభించాయి.

ముడి చమురు ధరల సూచీ- బ్రెంట్ 0.30 శాతం తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్​లో బ్యారెల్ ముడి చమురు ధర 42.95 డాలర్ల వద్దకు చేరింది.

09:28 June 23

లాభాల్లో స్టాక్​ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు బీఎస్​ఈ, ఎన్​ఎస్​ఈ మంగళవారం లాభాలతో ప్రారంభమ్యాయి. ప్రస్తుతం బీఎస్​ఈ సెన్సెక్స్​ 130 పాయింట్ల లాభంతో 35,043 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 46 పాయింట్లు వృద్ధి చెంది 10,356 వద్ద ట్రేడ్​ అవుతోంది. రిలయన్స్​ షేర్లు కాస్త వెనక్కి తగ్గాయి.

Last Updated : Jun 23, 2020, 3:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.