సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్‌కు చెందిన ప్రముఖ డిజిటల్ చెల్లింపు సేవల సంస్థ 'గూగుల్ పే'(google pay) సరికొత్త ఫీచర్‌ను ఆవిష్కరించనుంది. భారతీయ వినియోగదారులు ఫిక్స్‌డ్ డిపాజిట్(fixed deposit)లను యూపీఐ పేమెంట్ సర్వీస్(UPI) ద్వారా తెరిచేందుకు అనుమతించనుంది. దీనితో బ్యాంకుకు వెళ్లకుండానే 'ఎఫ్డీ' ఖాతా తెరవొచ్చు. 'ఇండియన్ ఫిన్‌టెక్ స్టార్టప్ సేతు'(indian fintech startup Setu)తో గూగుల్ ఇటీవలే భాగస్వామ్యం ఏర్పరుచుకున్న నేపథ్యంలో ఈ ఫీచర్ అందుబాటులోకి రావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మొదట వారికే..
మొదట 'ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్'(Equitas Small Finance Bank) వినియోగదారులు ఎఫ్డీలు ఓపెన్ చేసే వెసులుబాటు కల్పించనుంది గూగుల్ పే. ఆ తర్వాత ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్(ujjivan small finance bank), ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్(AU small finance bank) సహా ఇతర బ్యాంకులకూ అనుమతివ్వనుంది. ఈ సేవను పొందాలనుకునే వినియోగదారులు ఆధార్ కేవైసీ(KYC) ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ఎఫ్డీలకు రోజుల వ్యవధి ప్రకారం సంవత్సరానికి 3.5 శాతం-6.35 శాతం వరకు వడ్డీ అందివ్వనుంది. అయితే గూగుల్ పేలో 'ఎఫ్డీ' సేవల ప్రారంభాన్ని గూగుల్ ఇండియా ధ్రువీకరించాల్సి ఉంది.
'ఫిన్‌టెక్ స్టార్టప్ సేతు' అనేది అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్(API). వివిధ బిల్లుల చెల్లింపులు, పొదుపులు, క్రెడిట్ ఖాతాదారులకు సేవలను అందిస్తుంది. ఎఫ్‌డీలను అందించే టెస్టింగ్ వెర్షన్‌ను ఏపీఐ సిద్ధం చేసినట్లు సమాచారం.
ఇవీ చదవండి: