ETV Bharat / business

మరింత ప్రియమైన బంగారం, వెండి

దేశీయంగా బంగారం, వెండి ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర దిల్లీలో గురువారం రూ.480కిపైగా ఎగిసింది. వెండి ధర కిలోకు మళ్లీ రూ.63,500 వేల పైకి చేరింది.

Gold Price rises
పెరిగిన బంగారం ధర
author img

By

Published : Dec 3, 2020, 5:25 PM IST

బంగారం ధర గురువారం భారీగా రూ.481 పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర రూ.48,887 వద్దకు చేరింది.

అంతర్జాతీయంగా వరుసగా పెరుగుతూ వస్తున్న పసిడి ధరలకు అనుగుణంగా.. దేశీయంగానూ బంగారం ధరలు పెరుగుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

పసిడి బాటలోనే వెండి ధర కూడా కిలోకు (దిల్లీలో) రూ.555 పెరిగింది. కిలో ధర ప్రస్తుతం రూ.63,502 వద్దకు చేరింది.

అంతర్జాతీయ మార్కెట్​లో ఔన్సు బంగారం ధర 1,841 డాలర్లకు పెరిగింది. వెండి ధర ఔన్సుకు 24.16 డాలర్ల వద్ద ఫ్లాట్​గా ఉంది.

ఇదీ చూడండి:ఆర్థికానికి వ్యవ'సాయం'- జీడీపీ V ఆకారపు రికవరీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.