ETV Bharat / business

ఫేస్​బుక్​ నుంచి త్వరలో ఉచిత గేమింగ్​ యాప్!

author img

By

Published : Apr 21, 2020, 2:27 PM IST

కరోనా వైరస్​ వ్యాప్తి తరుణంలో ఇళ్లకే పరిమితమైన ప్రజలు సామాజిక మాధ్యమాల్లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఈ డిమాండ్​ను క్యాష్​ చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది ఫేస్​బుక్​. ట్విచ్, యూట్యూబ్​కు పోటీగా ఓ గేమింగ్​ యాప్​ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువస్తోంది.

Facebook launching a dedicated Gaming app for free
త్వరలో ఫేస్​బుక్​లో ఉచితంగా కొత్త గేమింగ్​ యాప్!

కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టేందుకు ప్రపంచ దేశాలు కట్టుదిట్టంగా లాక్​డౌన్​ అమలు చేస్తున్నాయి. దీని వల్ల ఎవరూ బయటకు వెళ్లలేని దుస్థితి నెలకొంది. ఖాళీగా ఉన్నవారు సోషల్​ మీడియాలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. పలు ఎంటర్​టైన్​మెంట్​ షోలు, వీడియో గేమ్​లు ఆడుతున్నారు. ఈ తరుణంలో ఫేస్​బుక్​ ఓ గేమింగ్​ యాప్​ను అందుబాటులోకి తీసుకొస్తోంది. వినియోగదారులకు ఉచితంగా ఈ యాప్​ను అందించనుంది సోషల్​ మీడియా దిగ్గజ సంస్థ.

వాటికి పోటీగా

ప్రస్తుతం లాక్​డౌన్​ వల్ల లైవ్​ స్ట్రీమింగ్​లకు డిమాండ్​ బాగా పెరిగింది. ఇప్పటికే లైవ్​ ప్లాట్​ ఫామ్స్​గా మంచి ఆదరణ​ సంపాదించుకున్న ట్విచ్​, యూట్యూబ్​కు పోటీగా ఫేస్​బుక్​ కొత్త గేమింగ్​ యాప్​ను అందుబాటులోకి తీసుకొస్తోంది. దీనిద్వారా కోట్ల మంది వినియోగదారులు తమ స్మార్ట్​ఫోన్లలో ప్రత్యక్షంగా గేమింగ్​ టోర్నమెంట్లను వీక్షించవచ్చు.

త్వరలో ఐఓఎస్​ వెర్షన్​లోకి

ప్రస్తుతం ఈ యాప్​ను ఫేస్​బుక్​ ఆండ్రాయిడ్​ ఫోన్లలోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇక యాపిల్​ సంస్థ నుంచి ఆమోదం లభిస్తే త్వరలో ఐఓఎస్​ వెర్షన్​లోనూ ఈ గేమింగ్​ యాప్​ను విడుదల చేయనుంది.

ఆ బటన్​ను ఉపయోగించి

ఈ యాప్​లో గో లైవ్​ అనే ఫీచర్​ను ఉపయోగించడం ద్వారా వినియోగదారులు ఇతర మొబైల్​ గేమ్స్ స్ట్రీమ్​లను ఆప్​లోడ్​ చేసుకోవచ్చు.

" గేమింగ్​పై​​ పెట్టుబడులు పెట్టడమే ప్రస్తుతం ప్రాధాన్యంగా మారింది. ఈ ఆటల వల్ల ప్రజలు ఎక్కువగా వినోదాన్ని పొందుతున్నారు. అయితే వినియోగదారులను అనుసంధానం చేస్తూ వినోదం పంచడం వల్ల వారు వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నా ఒక్క దగ్గరే ఉన్నట్లు భావిస్తారు. "

-- ఫిద్జీ సిమో, ఫేస్​బుక్​ గేమింగ్​ యాప్​ అధినేత

ఈ గేమింగ్​ యాప్​ కొన్ని సాధారణ ఆటలను కలిగి ఉన్నప్పటికీ ప్రధానంగా లైవ్​ స్ట్రీమ్​లనే కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఈ యాప్​ ప్రారంభంలో ఎటువంటి ప్రకటనలు ఉండవు. లాటిన్​ అమెరికా, ఆగ్నేయాసియాలో 18 నెలలుగా ఈ యాప్​ వెర్షన్​లను పరీక్షిస్తోంది ఫేస్​బుక్​.

ఇదీ చదవండి: 'ప్రపంచంలో అతిపెద్ద అన్నదాన కార్యక్రమం రిలయన్స్​దే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.