ETV Bharat / business

యాపిల్​ సీఈవో కావాలనుకున్న  ఎలాన్‌ మస్క్‌! - యాపిిల్​

టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌ ఒకప్పుడు టెక్‌ దిగ్గజం యాపిల్‌కు సీఈఓ కావాలనుకున్నారని వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ పాత్రికేయుడు టిమ్‌ హిగిన్స్ తన పుస్తకం 'పవర్‌ ప్లే'లో రాశారు. దీనిపై స్పందించిన ఎలాన్‌ మస్క్‌.. పుస్తకంలోని అంశాలు అవాస్తవాలని తెలిపారు. తాను టెస్లాను యాపిల్‌కు విక్రయించాలనుకున్న మాట వాస్తవమని వెల్లడించారు. అందుకోసం టిమ్‌ కుక్‌ను కలవాలనుకున్నట్లు తెలిపారు. అయితే, తనతో కలవడానికి టిమ్‌ కుక్‌ అంగీకరించలేదన్నారు.

Elon Musk
ఎలాన్​ మస్క్​
author img

By

Published : Jul 31, 2021, 2:01 PM IST

ప్రపంచ కుబేరుల్లో ఒకరైన టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌ ఒకప్పుడు టెక్‌ దిగ్గజం యాపిల్‌కు సీఈఓ కావాలనుకున్నారని వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ పాత్రికేయుడు టిమ్‌ హిగిన్స్ తన పుస్తకం 'పవర్‌ ప్లే'లో రాశారు. దీని వెనుక ఉన్న అంశాల్ని తాజాగా 'లాస్‌ఏంజిల్స్‌ టైమ్స్‌' ప్రచురించింది. అయితే, ఈ కథనాన్ని మస్క్‌ ఖండించారు. తానెప్పుడూ అలాంటి ప్రతిపాదనను ముందుకు తీసుకురాలేదని స్పష్టం చేశారు.

ఫోన్​ కట్ చేశారని..

2016లో టెస్లా గడ్డు పరిస్థితులు ఎదుర్కొంది. అప్పుడు సంస్థ విలువ ఇప్పుడు ఉన్న దాంట్లో ఆరో వంతు. ఆ సమయంలో టెస్లాను యాపిల్‌కు విక్రయించాలని మస్క్‌ భావించారు. దీనికి యాపిల్‌ సీఈఓ టిమ్‌ కుక్‌ కూడా అంగీకరించారని హిగిన్స్‌ రాసుకొచ్చారు. కానీ, తనని యాపిల్‌ సీఈఓగా ప్రకటించాలని మస్క్‌ డిమాండ్‌ చేశారని తెలిపారు. ఇది విన్న వెంటనే కుక్‌ ఆగ్రహంతో ఫోన్‌ కట్‌ చేశారని పేర్కొన్నారు. వీరివురి ఫోన్‌ సంభాషణ వివరాలను మస్క్‌ సహచరుడొకరు తనతో పంచుకున్నట్లు హిగిన్స్‌ పేర్కొన్నారు.

అవాస్తవాలు..

దీనిపై స్పందించిన ఎలాన్‌ మస్క్‌ పుస్తకంలోని అంశాలు అవాస్తవాలని తెలిపారు. తాను టెస్లాను యాపిల్‌కు విక్రయించాలనుకున్న మాట వాస్తవమని వెల్లడించారు. అందుకోసం టిమ్‌ కుక్‌ను కలవాలనుకున్నట్లు తెలిపారు. అయితే, తనతో కలవడానికి టిమ్‌ కుక్‌ అంగీకరించలేదన్నారు. దీంతో ఇరువురి మధ్య ఎలాంటి చర్చ జరగలేదన్నారు. అలాంటప్పుడు యాపిల్‌ సీఈఓ కావాలనుకున్నానన్న ప్రతిపాదన ఎక్కడి నుంచి వస్తుందని వ్యాఖ్యానించారు.

యాపిల్‌ ప్రతినిధి ఒకరు దీనిపై స్పందిస్తూ గతంలో న్యూయార్క్‌ టైమ్స్‌కి టిమ్‌ కుక్‌ ఇచ్చిన ఇంటర్వ్యూను ప్రస్తావించారు. తాను ఎలాన్ మస్క్‌తో ఎప్పుడూ మాట్లాడలేదని కుక్‌ ఆ ముఖాముఖిలో తెలిపారు. అయితే, మస్క్‌ స్థాపించిన కంపెనీపై తనకు ఎంతో గౌరవం ఉందన్నారు.

మస్క్‌, యాపిల్‌ స్పందించిన తీరుపై హిగిన్స్‌ మాట్లాడారు. ఈ పుస్తకం వెలువరించడానికి ముందు ఇటు మస్క్‌, అటు కుక్‌.. ఇరువురికీ ఈ సంఘటనపై స్పందించడానికి అవకాశం ఇచ్చానని తెలిపారు. కానీ, దానికి వారు తిరస్కరించారన్నారు. పైగా తాను చెప్పిన ఉదంతం మస్క్‌ ఓ సందర్భంలో తన కంపెనీలో ఓ సమావేశంలో చెప్పిందేనని చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి:టాటా సన్స్​ చేతికి తేజస్​​- డీల్​ విలువ ఎంతంటే?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.