విమానాల్లో వాడే ఇంధనం (ఏటీఎఫ్) ధరలు మరోసారి భారీగా పెరిగాయి. కిలో లీటర్ ఏటీఫ్ ధర రూ.2,922.94 (7.5 శాతం) పెంచుతూ చమురు మార్కెటింగ్ సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తాజా ధరల పెంపుతో దిల్లీలో కిలో లీటర్ ఏటీఎఫ్ ధర రూ.41,992.81 వద్దకు చేరింది.
గడచిన 30 రోజుల్లో ఏటీఎఫ్ ధరలు పెరగటం ఇది మూడో సారి. ఇప్పటికే కరోనా వల్ల ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న విమాన సంస్థలకు పెరిగిన ఏటీఎఫ్ ధరలు మరింత భారం కానున్నాయి.
ఏటీఎఫ్ ధరలు ప్రతి నెల 1, 16 తేదీల్లో సవరిస్తుంటాయి చమురు మార్కెటింగ్ సంస్థలు. ఇందులో భాగంగా జూన్ 1న అత్యధికంగా 56.6 శాతం, జూన్ 16న 16.3 శాతం ధరలు పెంచాయి.
మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరల్లో వరుసగా రెండో రోజూ మార్పులు చేయలేదు చమురు మార్కెటింగ్ సంస్థలు.
స్వల్పంగా పెరిగిన ఎల్పీజీ ధర..
రాయితీలేని వంటగ్యాస్ (ఎల్పీజీ) ధర కూడా దిల్లీలో రూ.1 పెరిగి రూ.594కు చేరింది. స్థానిక పన్నులు, వ్యాట్లలో తేడా కారణంగా నాన్సబ్సిడీ రూ.4 వరకు ధర పెరిగింది.
ఇదీ చూడండి:అమెజాన్ ఉద్యోగులకు రూ.3వేల కోట్ల బోనస్